STOCKS

News


ఆటుపోట్ల మార్కెట్లో అవలంబించాల్సిన సూత్రాలు!

Saturday 23rd November 2019
Markets_main1574493454.png-29812

కొన్ని నెలలుగా దేశీయ మార్కెట్లు అటుఇటు ఊగిసలాడుతూ కొనసాగుతున్నాయి. మందగమనం, ఎన్‌బీఎఫ్‌సీ లిక్విడిటీ సంక్షోభం, ఐఐపీ క్షీణత లాంటి అంశాలు మార్కెట్‌ ప్రదర్శనపై ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వం, ఆర్‌బీఐ ఎంత యత్నిస్తున్నా మార్కెట్లో సెంటిమెంట్‌ పూర్తి పాజిటివ్‌గా మారడం లేదు. ఈ నేపథ్యంలో రిటైల్‌ ఇన్వెస్టర్లు తప్పక పాటించాల్సిన సూత్రాలని నిపుణులు వివరిస్తున్నారు. 
1. అనవసర పుకార్లను నమ్మొద్దు: మార్కెట్లో వినిపించే పుకార్లు ఇన్వెస్టర్‌కు ఒక్కోసారి అత్యాశను కలిగిస్తే ఒక్కోసారి హడలెత్తిస్తుంటాయి. దీంతో ఆవేశంతో కీలక నిర్ణయాలు తీసుకొని నష్టపోవడం జరుగుతుంటుంది. కొన్ని సార్లు మార్కెట్లో కొత్తవాళ్లు కూడా నిపుణుల్లాగా సలహాలిస్తుంటారు. అందువల్ల నిజమైన వార్తకు, పుకారుకు తేడాను స్పష్టంగా గ్రహించాలి. ప్రతిఒక్కరూ చెప్పే ప్రతిమాట నమ్మి ట్రేడ్‌ చేయవద్దు. ఆవేశ నిర్ణయాలు అసలొద్దు. ఒకవేళ ఏదైనా కన్ఫ్యూజన్‌ ఉంటే సర్టిఫైడ్‌ సలహాదారును సలహా కోరాలి. 
2. పెట్టుబడి కొనసాగించాలి: మార్కెట్లో చిన్న పాటి స్పీడ్‌బ్రేకర్‌ ఎదురైనా, పెద్ద సంక్షోభం కనిపించినా ప్రతి చిన్న ఇన్వెస్టర్‌ ముందుగా ఈక్విటీల నుంచి వైదొలగేందుకు సిద్ధంగా ఉంటాడు. కానీ ఇది దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికను దెబ్బ తీస్తుంది. జీడీపీ సహా ఏ గణాంకాలు బాగాలేకున్నా నియంత్రణా సంస్థలు, ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవు. పరిస్థితి చక్కదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటాయి. అందువల్ల ప్రతి చిన్న విషయానికి ఆదుర్దా పడి షేర్లు అమ్మేసుకోకుండా వీలైతే యావరేజ్‌ చేసి దీర్ఘకాలం వేచిచూడడం ఉత్తమం.
3. తరచూ మార్చొద్దు: ఒత్తిడి, మందగమన సమయాల్లో సగటు ఇన్వెస్టరు తరచూ తన పోర్టుఫోలియోని పునఃసమీక్షిస్తూ ఉంటాడు. నష్టాలు కనిపించాయని ఆదుర్దాపడి ఆవేశ నిర్ణయాలు తీసుకుంటాడు. నిజానికి మార్కెట్‌ బాగాలేనప్పుడు పోర్టుఫోలియో నష్టాల్లో ఉండడం సాధరణ విషయమే! దీన్ని భూతద్దంలో చూసి బెంబేలెత్తకుండా, కుదిరితే మరిన్ని నాణ్యమైన స్టాకులను తక్కువ ధరల వద్ద సమీకరించుకునే యత్నం చేయాలి. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు తరచూ పోర్టుఫోలియోలో భారీ మార్పులు చేయకుండా, రివ్యూకు కనీసం 6 నెలల కాలపరిమితి పెట్టుకోవాలి.
4. లార్జ్‌స్టాక్‌ ఫండ్స్‌ బెటర్‌: సొంత పోర్టుఫోలియోతో పాటు తప్పక ఒకట్రెండు లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టుకోవడం ఉత్తమం. దీనివల్ల పోర్టుఫోలియో నష్టాలను కొంతవరకు భర్తీ చేసే వీలుంటుంది. ఇలాంటి ఫండ్స్‌లో  నేరుగా పెట్టుబడులు పెట్టే కన్నా సిప్‌ రూపంలో క్రమానుగత పెట్టుబడులు పెట్టడం మంచిది.  

 

క్రమశిక్షణ, నిశితత్వం, ఓపిక.. ఒడిదుడుకుల మార్కెట్లో ఇన్వెస్టర్‌ను కాపాడే ఆయుధాలు. పోర్టుఫోలియో వైవిధ్యీకరణ అనుకోని షాక్‌ల నుంచి రక్షిస్తుంది. సొంత అధ్యయనంతో పెట్టుబడులను దీర్ఘకాలం కొనసాగించడం ద్వారా మంచి రాబడి ఆర్జించవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. You may be interested

ఫ్లాట్‌గా ముగిసిన పసిడి

Saturday 23rd November 2019

ప్రపంచమార్కెట్లో ఉదయం ఆర్జించిన లాభాలను కోల్పోయిన పసిడి ధర శుక్రవారం ఫ్లాట్‌గా ముగిసింది. అమెరికా ఆర్థిక గణాంకాలు అంచనాలకు మించిన నమోదుకావడంతో డాలర్‌ బలపడటం పసిడి ఫ్లాట్‌ ముగింపునకు కారణమైంది. అమెరికాలో డిసెంబర్‌ కాంటాక్టు ఔన్స్‌ పసిడి ధర క్రితం ముగింపుతో ఎలాంటి లాభనష్టాలు లేకుండా 1,463.30 డాలర్ల వద్ద స్థిరపడింది. రాత్రి అమెరికా మార్కెట్‌ ఉదయం సెషన్‌లో వాణిజ్య చర్చల ఆందోళనల నేపథ్యంలో పసిడి ఫ్యూచర్లు 10డాలర్ల వరకు

స్వల్ప నష్టంతో ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 23rd November 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ ఇండెక్స్‌ శుక్రవారం స్వల్ప నష్టంతో ముగిసింది. నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ ముగింపు 11914.50తో పోలిస్తే 6 పాయింట్లు నష్టంతో 11,920 వద్ద స్థిరపడింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అత్యుత్త ప్రదర్శన కారణంగా ఈ వారం నిఫ్టీ 12000 స్థాయిని​బ్రేక్‌ చేసింది. అయితే ఈ మేజిక్‌ మార్కుపై ముగియడంలో మాత్రం విఫలమైంది. వారం మొత్తంగా నిప్టీ ఇండెక్స్‌ 21 పాయింట్లు లాభపడగా, సెన్సెక్స్‌ మాత్రం 2 పాయింట్లు మాత్రమే పెరిగింది.

Most from this category