News


చిన్న క్యాప్స్‌లో రికవరీ.. ఇప్పుడే కాదు!

Wednesday 18th December 2019
Markets_main1576651826.png-30286

హేమాంగ్‌ జానీ అంచనా
నెలన్నరగా వివిధ ఐపీఓలు, బ్లాక్‌డీల్స్‌ కారణంగా మార్కెట్లో లిక్విడీటీ అధికమొత్తంలో ఆవిరైందని షేర్‌ఖాన్‌ వైస్‌ప్రెసిడెంట్‌ హేమాంగ్‌ జానీ అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితి మెరుగై, లిక్విడిటీ పెరిగే వరకు చిన్న స్టాకుల్లో రికవరీ కానీ, మార్కెట్లో బలమైన అప్‌మూవ్‌ కానీ ఆశించకూడదన్నారు. సూచీల్లోని కొన్ని స్టాకులు మాత్రమే ర్యాలీ జరుపుతూ ముందుకు తీసుకుపోతున్నాయని విశ్లేషించారు. దేశీయ ఎకానమీలో కొన్ని సవాళ్లున్నాయని, విస్తృతస్థాయి ఎర్నింగ్స్‌ రికవరీ ఆశించలేమని చెప్పారు. ఇప్పటివరకు ఏవైతే షేర్లు ప్రదర్శన జరుపుతున్నాయో, ఇకపై కూడా దాదాపు అవే షేర్లు ముందుకు వెళ్లవచ్చన్నారు. ఇలాంటప్పుడు ఆల్రెడీ అప్‌మూవ్‌లో ఉన్న షేర్లలో పెట్టుబడులు పెట్టడమే బెటరని, చిన్న స్టాకుల్లో రికవరీని ఇప్పుడే ఆశించలేమని తెలిపారు. యూఎస్‌ మార్కెట్లు చాలాపెద్ద ర్యాలీ జరుపుతున్నాయని, మన మార్కెట్‌ మాత్రం పడుతూ లేస్తూ ఉందని తెలిపారు. ఇకపై విదేశీ ఫండ్స్‌ ఇండియాకు ఏమేరకు వస్తాయనేది కూడా కీలకమేనన్నారు. అందువల్ల ఇప్పటికిప్పుడు మార్కెట్లో, చిన్న స్టాకుల్లో పెద్ద ర్యాలీ ఊహించవచ్చని సూచించారు.
ఆటో రంగంలో కరెక‌్షన్‌ నడుస్తోంది. నెలవారీ అమ్మకాలు పురోగమించాలంటే ఇంకా సమయం పడుతుంది. అందువల్ల వీటిపై ప్రస్తుతానికి అండర్‌వెయిట్‌గానే ఉన్నాము. ఒకవేళ రెండు మూడేళ్ల కాలపరిమితకైతే మాత్రం మారుతీ, హీరో మోటోకార్‌‍్పను ఎంచుకోవచ్చు. ఆటో రంగంలో బలమైన రికవరీ సైకిల్‌ ఆరంభమయ్యేందుకు ఇంకా సమయం పడుతుంది. బీపీసీఎల్‌ డిజిన్వెస్ట్‌మెంట్‌ ధర బాగా ఎక్కువగా ఉండొచ్చు. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు సమయం పట్టవచ్చు. ఈ లోపు షేరులో కొంత ఒడిదుడుకులు సహజం. ఇలాంటి చిన్నా చితక ఆటుపోట్లు పట్టించుకోని ఇన్వెస్టర్లు షేరును కొనుగోలు చేయవచ్చు. కంపెనీ విలువ దృష్ట్యా పరిశీలిస్తే ప్రస్తుత ధర కన్నా చాలా ఎక్కువ ధర నిర్ణయించే అవకాశాలు అధికం. అలాంటప్పుడు రిస్కురివార్డు బాగా ఉంటుంది. You may be interested

లాభాల మార్కెట్లో బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో...

Wednesday 18th December 2019

మార్కెట్‌ ర్యాలీలోనూ బ్యాంకింగ్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లలో భారీ ఎత్తున లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఈ రంగానికి చెందిన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌ షేర్లు పతనంతో నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 2.50శాతం నస్టపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ రూ.5,250 కోట్ల మొండిబకాయిలను కలిగి ఉన్నట్లు ఆర్‌బీఐ రిస్క్‌ అసెస్‌మెంట్‌

రూపాయి బలహీనత: ఐటీ షేర్లకు డిమాండ్‌

Wednesday 18th December 2019

ఐటీ, బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీ అండంతో సూచీలు వరుసగా రెండోరోజూ కొత్త రికార్డు స్థాయిలను అందుకున్నాయి. ముఖ్యంగా ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండటం సూచీలకు కలిసొస్తుంది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 1.50శాతం లాభపడింది. అమెరికాలో నవంబర్‌ ఆర్థిక గణాంకాలు అంచనాలకు మించిన నమోదుకావడంతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ వారం గరిష్టానికి ఎగిసింది.

Most from this category