News


ఎఫ్‌పీఐలు.. షార్ట్‌ సెల్లింగ్‌ ఆపండి!

Friday 13th December 2019
Markets_main1576221615.png-30208

సెబి ఆదేశాలు
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లలో(ఎఫ్‌పీఐ) కొందరు షేర్ల షార్ట్‌ సెల్లింగ్‌ చేస్తున్నారని, దీన్ని తక్షణమే నివారించాలని ఆయా కస్టోడియన్లను సెబి ఆదేశించింది. పోర్టుఫోలియోలో పొజిషన్‌ లేకున్నా విక్రయించడాన్ని షార్ట్‌ సెల్లింగ్‌ అంటారు. కొన్ని ఎఫ్‌పీఐలు ఇలాంటి ట్రేడ్లకు పాల్పడుతున్నాయని తమ దృష్టికి వచ్చినట్లు సెబి తెలిపింది. విదేశీ ఫండ్స్‌కు, దేశీయ మార్కెట్‌కు మధ్య కస్టోడియన్లు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తారు. ఎఫ్‌పీఐల షార్ట్‌ సెల్లింగ్‌ నిర్వాకం గురించి వీరిని సెబి హెచ్చరించింది. దేశీయ మార్కెట్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు షార్ట్‌ సెల్లింగ్‌ చేయడానికి నిబంధనలు అంగీకరించవని సెబి పేర్కొంది. ప్రస్తుతం ఎఫ్‌పీఐలు ఒక షేరు కొంటే టీ ప్లస్‌ 2డేస్‌ సెటిల్‌మెంట్‌ వ్యవస్థ ఉంది. అంటే కొన్న రెండ్రోజులకు ఆయా షేర్లు ఫండ్స్‌ పోర్టుపోలియోలోకి వస్తాయి. అప్పుడు మాత్రమే అవి ఆయా షేర్లను తిరిగి విక్రయించే వీలుంటుంది. అయితే కొన్ని ఎఫ్‌పీఐలు సెటిల్‌మెంట్‌ జరిగి షేర్లు తమ పోర్టుఫోలియోలోకి రాకముందే అమ్మేస్తున్నాయి. ​

కేవలం ఎస్‌ఎల్‌బీ విధానంలో మాత్రమే ఎఫ్‌పీఐలు షార్ట్‌ సెల్లింగ్‌ చేయవచ్చు. లేదా సెటిల్‌మెంట్‌ జరిగి పోర్టుఫోలియోలో స్టాక్స్‌ వచ్చిన తర్వాత అమ్మవచ్చు. ఇంకే విధానంలో సెల్లింగ్‌ అనుమతి ఉండదని నిబంధనలు పేర్కొంటున్నాయి. స్థానిక ట్రేడర్లలాగా ఎఫ్‌పీఐలు ఇంట్రాడేలో షార్ట్‌ సెల్లింగ్‌ చేయడం కుదరదు. ఎస్‌ఎల్‌బీ విధానాన్ని దశాబ్దం క్రితం ప్రవేశపెట్టారు. ఇందులో ఎఫ్‌పీఐలు అప్పుగా తీసుకున్న షేర్లను విక్రయించే అవకాశం ఉంటుంది. అంతకుముందు అసలు ఏ రూపంలో కూడా ఎఫ్‌పీఐలు షార్ట్‌ సెల్లింగ్‌ చేసే అవకాశం ఉండేది కాదు. 



You may be interested

ట్రేడ్‌ డీల్‌ ఖరారుతో తగ్గిన పసిడి

Friday 13th December 2019

అమెరికా చైనాల మధ్య వాణిజ్య మొదటి దశ వాణిజ్య ఒప్పందానికి ట్రంప్‌ అంగీకరించారనే వార్తలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను తగ్గిస్తున్నాయి. నిన్నరాత్రి అమెరికాలో 1491 డాలర్ల గరిష్టాన్ని అందుకున్న అనంతరం యూఎస్‌- చైనా ట్రేడ్‌ డీల్‌కు ట్రంప్‌ ఆమోదం తెలిపారన్న వార్తలతో అక్కడి నుంచి 1469డాలర్ల కనిష్టానికి పతనమైంది. తిరిగి స్వల్ప రికవరీని సాధించి 1,472.30 డాలర్ల వద్ద స్థిరపడింది. నేడు ఆసియాలో 1డాలరు స్వల​లాభంతో 1,473.80 వద్ద ప్రారంభమైంది.

సౌదీ ఆరామ్‌కో @ 2 ట్రలియన్‌ డాలర్ల కంపెనీ

Friday 13th December 2019

ప్రపంచంలో అత్యధిక మార్కెట్‌ క్యాప్‌ కంపెనీ ఇదే  దుబాయ్‌: సౌదీ చమురు దిగ్గజం, సౌదీ ఆరామ్‌కో కంపెనీ మార్కెట్‌ విలువ 2 ట్రిలియన్‌ డాలర్లు(2 లక్షల కోట్ల డాలర్లు-రూ.142 లక్షల కోట్లు)దాటేసింది. ప్రపంచంలో అత్యధిక మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఉన్న కంపెనీ ఇదే. 1.19 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌తో యాపిల్‌ కంపెనీ రెండో స్థానంలో ఉంది. స్టాక్‌ మార్కెట్లో లిస్టైన తొలి రోజు 1.8 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌

Most from this category