News


ఈ షేర్లు కొనొచ్చు

Monday 24th June 2019
Markets_main1561355919.png-26518


బజాజ్‌ ఆటో   :     కొనొచ్చు 
బ్రోకరేజ్‌ సం‍స్థ: అరిహంత్‌ క్యాపిటల్‌
ప్రస్తుత ధర: రూ.2,873
టార్గెట్‌ ధర: రూ.3,631

ఎందుకంటే:- పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, బజాజ్‌ ఆటో కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో చెప్పుకోదగ్గ  ఆర్థిక ఫలితాలే సాధించింది. ఎగుమతుల దన్నుతో కంపెనీ నికర అమ్మకాలు 9 శాతం వృద్ధితో రూ.7,450 కోట్లకు చేరాయి. సీటీ100, ప్లాటినా బైక్‌ ధరల సవరణ కొనసాగుతుండటంతో స్థూల మార్జిన్లు 3 శాతమే వృద్ధి చెంది 28.4 శాతానికి చేరాయి.  ఇతర వ్యయాలు 16 శాతం, సిబ్బంది వ్యయాలు 17 శాతం పెరగడంతో నిర్వహణ లాభ మార్జిన్‌ 4 శాతం తగ్గి 16.5 శాతానికి చేరింది. నికర లాభం 11 శాతం పతనమై రూ.960 కోట్లకు తగ్గింది.. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర అమ్మకాలు 24  శాతం వృద్ధితో రూ.30,500 కోట్లకు పెరిగాయి. నిర్వహణ లాభం 24 శాతం పెరిగి రూ.5,270 కోట్లకు చేరింది. నిర్వహణ లాభ మార్జిన్‌ 17.3 శాతానికే పరిమితమైంది. నికర లాభం 31 శాతం ఎగసి రూ.4,300 కోట్లకు చేరింది.  ఎంట్రీ లెవల్‌ బైక్‌ల మార్కెట్లో తమ మార్కెట్‌  వాటా మరింతగా పెరగగలదని ఈ కంపెనీ ధీమాగా ఉంది. ఈ బైక్‌ల ధరలను దూకుడుగా నిర్ణయించడం, ఆకర్షణీయమైన ఫీచర్లతో కొత్త వేరియంట్లను అందుబాటులోకి తేనుండటంతో ఎంట్రీ లెవల్‌ బైక్‌ల మార్కెట్లో తమ మార్కెట్‌ వాటాను పెంచుకోగలమని కంపెనీ భావిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి బీఎస్‌ సిక్స్‌ నిబంధనలు అమల్లోకి రానుండటం, భద్రత పరమైన కఠినమైన నిర్ణయాల కారణంగా దేశీయంగా టూ-వీలర్ల అమ్మకాలు ఒకింత తగ్గవచ్చు. అయితే ఎగమతులు పుంజుకునే అవకాశాలు కంపెనీకి కలసివచ్చే అంశం. రెండేళ్లలో ఆదాయం 10 శాతం, నిర్వహణ లాభం 11 శాతం, నికర లాభం 14 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందతాయని అంచనా. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతుండటంతో మార్జిన్లు తగ్గే అవకాశాలు, ఆఫ్రికా దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొని ఎగుమతులు తగ్గే అవకాశాలు... ప్రతికూలాంశాలు. 

లుపిన్‌      :   కొనొచ్చు 
బ్రోకరేజ్‌ సం‍స్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌ 
ప్రస్తుత ధర: రూ.712
టార్గెట్‌ ధర: రూ.810

ఎందుకంటే: ఈ ఫార్మా కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలం ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. అమెరికా వ్యాపారం 16 శాతం వృద్ధితో రూ.1,741 కోట్లకు పుంజుకోవడంతో ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.4,406 కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభ మార్జిన్‌ 2 శాతం పెరిగి 20 శాతానికి చేరింది. నిర్వహణ లాభం 23 శాతం వృద్ధితో రూ.874 కోట్లకు పెరిగింది. నికర లాభం మాత్రం 20 శాతం తగ్గి రూ.288 కోట్లకు పరిమితమైంది. నికర లాభంలో మినహా మిగిలిన అన్ని అంశాల్లో ఈ కంపెనీ ఫలితాలు అంచనాలను మించాయి. మొత్తం ఆదాయంలో 38 శాతం వాటా ఉన్న అమెరికా వ్యాపారం సమస్యలతో సతమతమవుతోంది. ధరల ఒత్తిడి, ఇటీవలే గోవా, ఇండోర్‌ ప్లాంట్లకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి హెచ్చరిక లేఖలు అందడం వంటి సమస్యలు ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించడం కోసం బ్రాండెడ్‌ ఉత్పత్తులతో పాటు బయోసిమిలర్లు, ఇంజెక్టబుల్‌ వంటి కాంప్లెక్స్‌ జనరిక్స్‌పై కంపెనీ దృష్టి సారిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20కు పైగా కొత్త ఔషధాలను అమెరికా మార్కెట్లోకి అందించనున్నది. కొత్త ఔషధాలను   మార్కెట్లోకి తేవడం ద్వారా అమెరికా అమ్మకాలు రెండేళ్లలో 12 శాతం వృద్ధితో రూ.6,964 కోట్లకు పెరుగుతాయని అంచనా. దేశీయ ఫార్ములేషన్ల విభాగంలో ఈ కంపెనీ ఐదో స్థానంలో ఉంది. ఎలి లిల్లీ, బోరింగర్‌, ఎమ్‌ఎస్‌డీ వంటి కంపెనీలతో భాగస్వామ్యాల కారణంగా రెండేళ్లలో భారత అమ్మకాలు 12 శాతం వృద్ధితో రూ.5,818 కోట్లకు పెరగగలవని భావిస్తున్నాం. ఇతర భారీ ఫార్మా కంపెనీలలాగానే ఉత్పత్తి, వ్యయాల హేతుబద్దీకరణ చేపట్టింది. దీనికి సంబంధించిన ఫలితాలు రెండేళ్లలో కనిపించనున్నాయి. 

 You may be interested

జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలా ప్రక్రియ ప్రారంభం

Monday 24th June 2019

90 రోజుల్లో రిజల్యూషన్‌ ప్రణాళిక తదుపరి విచారణ జూలై 5న  న్యూఢిల్లీ: రుణభారంతో కుదేలైన జెట్‌ ఎయిర్‌వేస్‌పై దివాలా ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కంపెనీకి రుణాలిచ్చిన 26 సంస్థల తరపున స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎన్‌సీఎల్‌టీ(నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌)లో జెట్‌ ఎయిర్‌వేస్‌పై దివాలా ప్రక్రియ కోసం పిటీషన్‌ దాఖలు చేసింది.ఎన్‌సీఎల్‌టీ ముంబై ధర్మాసనం ఈ పిటీషన్‌ను ఈ నెల 20న స్వీకరించింది. 2016 నాటి ఇన్‌సాల్వెన్సీ బ్యాంక్‌రప్టసీ చట్టం ప్రకారం

ఫండ్స్‌తో లాభాలు వస్తాయా ?

Monday 24th June 2019

ప్ర: మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, లాభాలు వస్తాయా? పదేళ్లపాటు ఇన్వెస్ట్‌ చేస్తే, కనీసం బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కంటే ఎక్కువ వడ్డీనే వస్తుందా ?  -పల్లవి, విశాఖపట్టణం  జ: నాకు తెలిసినంత వరకూ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, మంచి రాబడులే పొందవచ్చు. ఏదైనా ఒక ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తే, మంచి లాభాలే ఆర్జించవచ్చు. రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు చేసుకోవడం, సొంత ఇల్లు

Most from this category