News


చౌకగా ఉన్నాయని వలలో పడొద్దు!

Friday 28th June 2019
Markets_main1561746213.png-26669

బీఎస్‌ఈలో ప్రతీ ఆరు చురుగ్గా ట్రేడయ్యే స్టాక్స్‌లో ఒకటి 2019లో కొత్త కనిష్ట స్థాయికి పడిపోయినదే. ఇదే కాలంలో ప్రధాన సూచీలు రాబడులను ఇవ్వడం గమనార్హం. ఇలా పతమైన వాటిల్లో 70 శాతం కంపెనీలకు ఈ తరహా అనుభవాలు గతంలో ఎదురు కాలేదు. ఇవి ఇన్వెస్టర్ల సంపదను వాటి ఏడాది గరిష్ట ధరల నుంచి చూస్తే 50-95 శాతం మధ్య తుడిచిపెట్టేశాయి. క్యాఫ్‌ ఫ్లో, అధిక రుణ భారం, ప్రమోటర్ల వాటాల తనఖా, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ అంశాలు ఇందుకు కారణాలుగా ఉన్నాయి. వీటిని వ్యాల్యూ ట్రాప్‌లుగా గుర్తించక ఇన్వెస్టర్లు వీటిల్లో చిక్కుకుంటున్నారని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 

 

బీఎస్‌ఈలో 547 కంపెనీలు 2019లో రికార్డు కనిష్ట స్థాయిలకు పడిపోగా, ఇందులో 383 స్టాక్స్‌ వాటి 52 వారాల గరిష్ట ధరల నుంచి 50-95 శాతం మధ్య నష్టపోయాయి. అనిల్‌ అంబానీ అడాగ్‌ గ్రూపులో రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ 95 శాతం, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా 92 శాతం, రిలయన్స్‌పవర్‌ 89 శాతం, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ 86 శాతం, రిలయన్స్‌నావల్‌ 84 శాతం వరకు నష్టపోయినవే. రేటింగ్‌ ఏజెన్సీలు అడాగ్‌ గ్రూపు కంపెనీల రేటింగ్‌ను డిఫాల్ట్‌ గ్రేడ్‌కు తగ్గించేయడం గమనార్హం. జెట్‌ ఎయిర్‌వేస్‌ స్టాక్‌ 93 శాతం పడిపోయింది. జైప్రకాష్‌ అసోసియేట్స్‌ 86 శాతం, మన్‌పసంద్‌ బెవరేజెస్‌ 86 శాతం, సింటెక్స్‌ ప్లాస్టిక్‌ టెక్నాలజీస్‌ 84 శాతం చొప్పున నష్టపోయాయి. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, సిటీ నెట్‌వర్క్స్‌, బల్లార్‌పూర్‌ ఇండస్ట్రీస్‌, నవ్‌కార్‌ కార్పొరేషన్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌, జైపీ ఇన్‌ఫ్రా టెక్‌ కూడా ఇన్వెస్టర్ల సంపదను హరించేసిన వాటిల్లో ఉన్నాయి. 98 శాతానికి పైగా నష్టపోయిన వాటిల్లో జైప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌, హెచ్‌డీఐఎల్‌, బోంబే రేయాన్‌ ఫ్యాషన్స్‌ కూడా ఉన్నాయి. 

 

‘‘ఇవన్నీ అస్తులు అధికంగా కలిగిన కంపెనీలు. చాలా వాటికి నగదు పరంగా సమస్యలున్నాయి. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ అంశాలు కొన్నింటిని వేధిస్తున్నాయి. వీటిల్లో నిర్మాణపరంగా సమస్యలు ఉన్నాయి’’అని ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ ధనుంజయ్‌ సిన్హా పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టిన రంగం గురించి బాగా తెలుసుకుని ఉండాలని సూచించారు. మంచి సామర్థవంతమైన యాజమాన్యం ఉన్న స్టాక్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వ్యాల్యూట్రాప్‌లో పడకుండా చూసుకోవచ్చన్నారు. 

 

గరిష్ట ధరల నుంచి భారీగా పడిపోవడంతో చౌకగా దొరుకుతున్నాయని, ఇక్కడి నుంచి బాగా పెరుగుతాయని భావించి రిటైల్‌ ఇన్వెస్టర్లు ఈ స్టాక్స్‌ను కొనుగోలు చేయడాన్నే వ్యాల్యూ ట్రాప్‌గా చెబుతారు. జెట్‌ ఎయిర్‌వేస్‌లో మార్చి 31 నాటికి రిటైల్‌ ఇన్వెస్టర్లకు 11.42 వాతం వాటాలు ఉండగా, ఏడాది క్రితం ఇదే సమయానికి రిటైల్‌ ఇన్వెస్టర్లకు కేవలం 4.29 శాతం వాటాయే ఉంది. ఎఫ్‌పీఐలు ఈ కంపెనీలో వాటాను 5.23 శాతం నుంచి ఇదే కాలంలో 1.47 శాతానికి తగ్గించుకున్నారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ సైతం 9.16 శాతం నుంచి 3.58 శాతానికి తగ్గించుకున్నాయి. అంటే నిపుణులైన ఇన్వెస్టర్లు పొజిషన్లు తగ్గించుకుంటు, రిటైల్‌ ఇన్వెస్టర్లు వాటిని కొన్నట్టు తెలుస్తోంది. ఇక జైప్రకాష్‌ అసోసియేట్స్‌లో అయితే ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌జున్‌జున్‌వాలా తొలుత 1.13 శాతం వాటాలు కొనుగోలు చేశారు. ఆయన్ను చూసి రిటైల్‌ ఇన్వెస్టర్లు కూడా ఎగబడి కొనుగోలు చేశారు. దీంతో మార్చి నాటికి రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఈ కంపెనీలో వాటా 29.49 శాతానికి పెరిగిపోయింది. కానీ, జున్‌జున్‌వాలా మాత్రం డిసెంబర్‌, 2018 త్రైమాసికంలోనే తన వాటాలను గణనీయంగా తగ్గించుకోడం లేదా విక్రయించడం చేశారు. You may be interested

5జీ స్మార్ట్‌ఫోన్లు వస్తున్నాయ్!!

Saturday 29th June 2019

2020లో వెల్లువలా కొత్త టెక్నాలజీ ఫోన్లు సిద్ధం చేసుకుంటున్న తయారీ కంపెనీలు రూ.15,000-20,000 శ్రేణిలోనూ లభించే చాన్స్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఇప్పటి వరకు భారత మొబైల్‌ మార్కెట్లో 4జీ స్మార్ట్‌ఫోన్లనే చూశాం. వచ్చే ఏడాది నుంచి తదుపరి తరం 5జీ స్మార్ట్‌ఫోన్లు వస్తున్నాయి. దేశంలో 5జీ స్పెక్ట్రం వేలం 2020లో జరిగే అవకాశం ఉంది. స్పెక్ట్రం అందుబాటులోకి రాగానే కొత్త టెక్నాలజీతో మోడళ్లను ప్రవేశపెట్టేందుకు తయారీ కంపెనీలు రెడీ అయ్యాయి. ఇప్పటికే పలు

మూడేళ్లలో రెట్టింపైన హెచ్‌యూఎల్‌.. ఇంకా ఎంత?

Friday 28th June 2019

హిందుస్తాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌ కంపెనీలో మూడేళ్ల క్రితం ఇన్వెస్ట్‌ చేసి, ఇప్పటికీ ఆ పెట్టుబడిని కొనసాగించిన ఇన్వె‍స్టర్లకు రెట్టింపు ప్రతిఫలం దక్కినట్టే. మూడేళ్లలో ఈ షేరు 106 శాతం పెరిగింది. 2016 జూన్‌ 27న ఈ షేరు ధర రూ.859.80. తాజా ధర రూ.1787.30. కానీ, ఇదే కాలంలో సెన్సెక్స్‌ 50 శాతమే పెరగ్గా, నిఫ్టీ 46 శాతం రాబడినిచ్చింది. సూచీలకు మించి ఈ కంపెనీ దిగ్గజ రాబడులను ఇచ్చినట్టు.

Most from this category