News


2019: ఈ షేర్లు జీరోలు

Wednesday 25th December 2019
Markets_main1577269457.png-30433

కుప్పకూలిన అడాగ్‌ కౌంటర్లు
యస్‌ బ్యాంక్‌, ఐబీ హౌసింగ్‌ బోర్లా
జాబితాలో జెట్‌ ఎయిర్‌వేస్‌, మన్‌పసంద్‌

నిజానికి ఈ ఏడాది దేశీయంగా ఓవైపు పలు సానుకూల వార్తలు వెలువడగా.. మరోపక్క అంతర్జాతీయ స్థాయిలో ప్రతికూల పవనాలూ వీచాయి. దీంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు పలుమార్లు హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ అవుతూ వచ్చాయి. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం నెలకొనడం, ప్రభుత్వ సంస్కరణలు, రిజర్వ్‌ బ్యాంక్‌ రేట్ల కోతలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు తదితర సానుకూల అంశాల నేపథ్యంలో ఈ ఏడాది ఇప్పటివరకూ దేశీ స్టాక్‌ మార్కెట్లు సగటున 10 శాతంపైగా లాభాలు ఆర్జించాయి. మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 13 శాతంపైగా ర్యాలీ చేయగా.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11 శాతం పురోగమించింది. మరోవైపు అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు, ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితులు, చైనా జీడీపీ వెనకడుగు వంటి అంతర్జాతీయ అంశాలు సెంటిమెంటును దెబ్బతీస్తూ వచ్చాయి. చివరికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసురుతున్న అమెరికా, చైనా వాణిజ్య వివాదాలకు చెక్‌ పడటంతో గత వారం సెంటిమెంటు మరింత బలపడింది. వెరసి అమెరికా మార్కెట్లతోపాటు.. సెన్సెక్స్‌, నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. అయితే మధ్య, చిన్నతరహా షేర్ల(మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌) విభాగంలో చాలా వరకూ అమ్మకాల ఒత్తిడి నమోదుకావడం గమనార్హం! నిజానికి ఈ ఏడాది బ్యాంకింగేతర ఫైనాన్షియల్‌(ఎన్‌బీఎఫ్‌సీలు) రంగంలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి. ఇందుకు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ దివాళా ప్రధానంగా ప్రభావం చూపింది. దీనికితోడు బ్యాంకింగ్‌ రంగంలో మొండిబకాయిల సమస్య కొనసాగడంతో లిక్విడిటీ సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో బీఎస్‌ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 4-8 శాతం మధ్య నీరసించాయి. గతంలో మార్కెట్‌ ఫేవరెట్లుగా నిలిచిన అనిల్‌ అంబానీ ధీరూభాయ్‌ గ్రూప్‌(అడాగ్‌) కంపెనీల కౌంటర్లతోపాటు.. యస్‌బ్యాంక్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ తదితర బ్లూచిప్స్‌ డీలాపడ్డాయి. వివరాలు చూద్దాం...

పతన బాటలో
మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ విభాగంలో ఈ ఏడాది అడాగ్‌ కౌంటర్లు భారీగా పతనమయ్యాయి. మరోపక్క కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, తల్వాల్కర్స్‌ ద్వయం, మెక్‌లాయిడ్‌ రసెల్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, సింటెక్స్‌ ప్లాస్టిక్స్‌, దివాన్‌ హౌసింగ్‌ సైతం ఒక దశలో 90 శాతం స్థాయిలో పతనమై ఇన్వెస్టర్లకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. అడాగ్‌ కంపెనీలలో రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, రిలయన్స్‌ కేపిటల్‌, రిలయన్స్‌ పవర్‌ 90 శాతం స్థాయిలో దిగజారాయి. భారీగా నష్టపోయిన ఇతర చిన్న కౌంటర్లలో మన్‌పసంద్‌, కాఫీ డే, సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రా, ఎవరెడీ, జైన్‌ ఇరిగేషన్‌, అరవింద్‌, ఇండియాబుల్స్‌ ఇంటిగ్రేటెడ్‌, శ్రేఈ ఇన్‌ఫ్రా, శంకర బిల్డింగ్‌, హెచ్‌ఈజీ తదితరాలున్నాయి.

యస్‌ బ్యాంక్‌ బోర్లా
ఈ ఏడాది ఒక దశలో బ్లూచిప్‌ సంస్థ యస్‌ బ్యాంక్‌ షేరు 80 శాతం స్థాయిలో పతనంకాగా.. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 70 శాతం దిగజారింది. ఇక వొడాఫోన్‌ ఐడియా కౌంటర్‌ సైతం 80 శాతం పడిపోవడం గమనార్హం!

టాప్‌-10 లూజర్స్‌
కంపెనీ పేరు ధర (23-12-2019) నష్టం(శాతంలో)
వొడాఫోన్‌ ఐడియా రూ.6.5 83
యస్‌ బ్యాంక్‌ రూ.51 73
గెయిల్‌ ఇండియా రూ.120 66
ఐబీ హౌసింగ్‌ రూ.300 64
బయోకాన్‌  రూ.288 55
గ్లెన్‌మార్క్‌ ఫార్మా రూ.352 49
ఎడిల్‌వీజ్‌ ఫైనాన్స్‌ రూ.115  42
హెచ్‌సీఎల్‌ టెక్‌ రూ.572 40
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.1296 33
బీహెచ్‌ఈఎల్‌ రూ.45 36


        You may be interested

మిడ్‌క్యాప్‌లో ఐసీఐసీఐ డైరెక్ట్‌ సిఫారసులు

Thursday 26th December 2019

నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ దిద్దుబాటు చానల్‌ను అధిగమించే దశలో ఉందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ విశ్లేషించింది. గత రెండేళ్ల ధరల క్షీణత చానల్‌ను బ్రేకవుట్‌ చేసే విధంగా బుల్‌ మార్కెట్‌ సంకేతాన్ని ఇచ్చినట్టు తెలిపింది. లార్జ్‌క్యాప్‌ కంపెనీలు 2019లో మంచి పనితీరు చూపించగా, సాంకేతింగా చూస్తే మిడ్‌క్యాప్‌ నూతన బుల్‌ ట్రెండ్‌కు సమీపంలో ఉందని అభిప్రాయపడింది.   ‘‘దేశీయ బెంచ్‌మార్క్‌లు నూతన జీవితకాల గరిష్టాలను చేరాయి. ఈ ప్రక్రియలో దేశీయ, అంతర్జాతీయ అనిశ్చితులను అధిగమించాయి.

స్టార్టప్‌.. రౌండప్‌...

Wednesday 25th December 2019

యూఎస్‌, చైనా తర్వాత అతిపెద్ద స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ భారత్‌లోనే ఉంది. దేశంలో దాదాపు 50వేల స్టార్టప్స్‌ ఉన్నాయి. వీటిలో పది శాతం వరకు ఫండింగ్‌ పొందాయి. యువ జనాభా అధికంగా ఉన్న భారత్‌లో స్టార్టప్‌ బూమ్‌ మరింతగా ఉండాల్సిఉందని, కానీ కొన్ని సవాళ్ల కారణంగా జోరందుకోలేకపోతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశీయ స్టార్టప్‌ రంగంలో 2019 తీసుకువచ్చిన మార్పులు, చేర్పులు చాలా ఉన్నాయి. బడా డీల్స్‌ నుంచి భారీ ఫండ్‌రైజింగ్‌ల దాకా

Most from this category