News


గురువారం వార్తల్లోని షేర్లు

Friday 27th March 2020
Markets_main1585289369.png-32708

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు

యస్‌బ్యాంక్‌: యస్‌ బ్యాంక్‌ సాధారణ స్థితికి రావడానికి షేర్ల అమ్మకం ద్వారాæ  రూ.5000 కోట్లు›సమీకరించనుంది.

మహీంద్రా అండ్‌ మహీంద్రా:  వాహన తయారీ సంస్థ రెండు ప్రభుత్వం సెక్టార్‌ యూనిట్లతో కలిసి అత్యాధునిక వెంటిలేటర్స్‌ను తయారు చేస్తుంది.

దీపక్‌ ఫెర్టిలైజర్స్‌: శానిటైజర్‌లలో ప్రముఖంగా వాడే ఐసోప్రొపైల్‌ ఆల్కాహాల్‌ (ఐపీఏ) రసాయనాన్ని దీపక్‌ ఫెర్టిలైజర్‌ ఉత్పత్తి చేస్తోంది.

టెక్‌ మహీంద్రా: ప్రముఖ ఐటీ కంపెనీ టెక్‌ మహీంద్రా కార్యాలయాలన్నింటిని మూసివేసి, అత్యవసర సేవలను వర్క్‌ ఫ్రం ద్వారా అందిస్తోంది.

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌:  యూకే కేంద్రంగా పనిచేస్తోన్న హెడ్జ్‌ ఫండ్, థీలేమ్‌ మాస్టర్‌ ఫండ్‌లు జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లోని 2.84 కోట్లకుపైగా షేర్లను బహిరంగా మార్కెట్లో రూ.437 కోట్లకు కొనుగోలు చేసింది.

కేపీఐటీ టెక్నాలజీస్‌: కరోనా వైరస్‌ ప్రభావంతో ఆర్థిక సంవత్సరం నాల్గో త్రైమాసికం,  2020–21ఆర్థిక సంవత్సరాలలో ఆదాయాలపై కరోనా వైరస్‌ ప్రభావంతపడుతుందని ఈ కంపెనీ వెల్లడించింది.

యూనైటెడ్‌ స్పిరిట్స్‌: లిక్కర్‌ తయారీ సంస ్థయూనైటెడ్‌ స్పిరిట్స్‌ కరోనా కారణంగా ఉత్పత్తి కేంద్రాలన్నింటిని మూసివేసింది.

ఎన్‌టీపీసీ: టీహెచ్‌డీసీఐఎల్, ఎన్‌ఈఈపీసీఓలలో ఉన్న ప్రభుత్వ వాటాను రూ.11,500 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఎన్‌టీపీసీ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసింది.

కోల్‌ ఇండియా: కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉండడంతో తమ వినియోగదారుల పేమెంట్స్‌కు కోల్‌ ఇండియా సడలింపు ఇచ్చింది.  
 You may be interested

బుల్‌ ఆర్బిట్‌లో డోజోన్స్‌

Friday 27th March 2020

3 రోజుల్లో 21 శాతం ప్లస్‌ యూఎస్‌ మార్కెట్ల రిలీఫ్‌ ర్యాలీ 6.5 శాతం ఎగసిన ఇండెక్సులు భారీ సహాయక ప్యాకేజీల ఎఫెక్ట్‌   ప్రజలకూ, ఆర్థిక వ్యవస్థలకూ పెనునష్టాన్ని కలిగిస్తోన్న కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా అమెరికా పార్లమెంట్‌(కాంగ్రెస్‌) భారీ సహాయక ప్యాకేజీని ఆమోదించింది. కాంగ్రెస్‌ చరిత్రలోనే అత్యధికంగా 2 లక్షల కోట్ల డాలర్లను వ్యవస్థలోకి విడుదల చేయనుంది . తద్వారా నిరుద్యోగం, పరిశ్రమలు, మెడికల్‌ పరికరాల కొనుగోలు తదితరాలకు నిధులను వెచ్చించనుంది.  దీంతో

రేపోరేటు కోత : బ్యాంక్‌ నిఫ్టీ లాభాలు ఆవిరి

Friday 27th March 2020

కరోనా వైరస్‌ నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టిక్కేం‍చే చర్యల్లో భాగంగా రెపో రేటును తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. రెపో రేటును 75శాతం బేసిస్ పాయింట్లకు తగ్గించి 4.40శాతానికి తీసుకొచ్చామని చెప్పారు. రివర్స్ రెపో రేటును కూడా 90శాతం తగ్గించామన్నారు. అలాగే క్యాష్ రిజర్వ్ రేషియోలో 3శాతం మేరకు కోత విధించింది. బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై చెల్లించే వడ్డీ రేట్ల(రెపో రేటు)ను తగ్గించడంతో  శుక్రవారం

Most from this category