News


విభిన్న రంగాల నుంచి బడ్జెట్‌ స్టాక్స్‌ ఇవే!

Monday 27th January 2020
Markets_main1580106939.png-31232

వారం రోజుల్లో వెలువడనున్న సార్వత్రిక బడ్జెట్‌ నేపథ్యంలో మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. ఇందుకు దేశ, విదేశీ అంశాలు ప్రభావం చూపుతున్నాయి. మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు, వినియోగాన్ని పెంచే చర్యలు వంటి అంచనాలతో బడ్జెట్‌ ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తుంటే.. చైనాలో తలెత్తిన కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటును దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌కు ముందు పెట్టుబడుల కోసం  ఏఏ రంగాలను ఎంపకి చేసుకోవాలి, ఎలాంటి స్టాక్స్‌కు ప్రాధాన్యమివ్వాలి అనే అంశాలపై ఇటీవల  ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరిగింది. కాగా.. శనివారం(ఫిబ్రవరి 1న) లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై పలు అంచనాలున్నట్లు విళ్లేషకులు చెబుతున్నారు.  ఓవైపు ఆర్థిక మందగమనానికి చెక్‌ పెడుతూనే.. మరోపక్క ద్రవ్యలోటును అదుపు చేసుకోవలసి ఉన్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా ఇటీవల రూ. 105 లక్షల కోట్లతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగానికి ప్రకటించిన ప్రణాళికలు, డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా నిధుల సమీకరణ తదితర అంశాలపై స్పష్టమైన విధానాలు రూపొందించవలసి ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఇప్పటికే కార్పొరేట్‌ ట్యాక్స్‌లో కోత పెట్టడంతో.. వ్యక్తిగత ఆదాయ పన్నునూ తగ్గించనున్నట్లు వేతనవర్గాలు ఆశిస్తున్నాయి. తద్వారా వినియోగానికి బూస్ట్‌నిచ్చే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తు‍న్నాయి. ఈ అంచనాల నడుమ వెలువడనున్న బడ్జెట్‌ ఏ రంగంపై ఎలాంటి ప్రభావం చూపేదీ వేచిచూడవలసి ఉన్నట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని బ్రోకింగ్‌ సంస్థలు కొన్ని రంగాలపట్ల ఆశావహంగా స్పందిస్తున్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం..

మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ ర్యాలీ?
బడ్జెట్‌పై సానుకూల అంచనాలతో ఇటీవల సెన్సెక్స్‌, నిఫ్టీ సరికొత్త గరిష్టాలను తాకాయి. ఇందుకు అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారానికి వీలుగా ప్రాథమిక దశ ఒప్పందం కుదరడం కూడా సహకరించింది. అయితే తాజాగా చైనాలో కరోనా వైరస్‌ తలెత్తడం, ఇతర దేశాలకూ విస్తరించడం వంటి ప్రతికూల వార్తలతో మార్కెట్లు వెనకడుగు వేస్తు‍న్నాయి. అయినప్పటికీ గత కొద్ది రోజులుగా ర్యాలీ బాట పట్టిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లలో ర్యాలీ కొనసాగే అంశంపై పలువురు నిపుణులు ఆశావహంగా స్పందిస్తుండటం గమనార్హం. కాగా.. బడ్జెట్‌ తదుపరి మార్కెట్లు కొంతమేర దిద్దుబాటు(కరెక్షన్‌)ను చవిచూడనున్నట్లు మరికొంతమంది అంచనా వేస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,000 పాయింట్లస్థాయికి దిగివచ్చాక తిరిగి 13,000 పాయింట్ల మైలురాయివైపు సాగవచ్చని భావిస్తున్నారు.  
 

అంచనాలు ఇలా
షేర్‌ఖాన్‌, యాంటిక్‌, శామ్‌కో సెక్యూరిటీస్‌ తదితర కొన్ని స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలు బడ్జెట్‌ నేపథ్యంలో లబ్ది పొందే వీలున్న కొన్ని రంగాలను ఎంపిక చేశాయి. ఈ రంగాల నుంచి విభిన్న స్టాక్స్‌ను కొనుగోలుకి పరిశీలించవచ్చని భావిస్తున్నాయి. బడ్జెట్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, వినియోగం, గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యమివ్వనున్న నేపథ్యంలో ఎఫ్‌ఎంసీజీ, ఆటో, మెటల్‌ తదితర రంగాలు వెలుగులో నిలిచే వీలున్నట్లు పేర్కొంటున్నాయి. 

ఎంపిక తీరిలా
జాబితాలో ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌సహా.. సిమెంట్‌, రిటైల్‌ వరకూ పలు రంగాలకు ప్రాధాన్యత లభించింది. స్టాక్స్‌ జాబితాలో ఎల్‌అండ్‌టీ, మహానగర్‌ గ్యాస్‌, ఐసీఐసీఐ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, అల్ట్రాటెక్‌, పీఎన్‌సి ఇన్‌ఫ్రా, సుదర్శన్‌ కెమికల్స్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌, ఎంఅండ్‌ఎం, టీవీఎస్‌ మోటార్‌, బజాజ్‌ ఆటో, క్రాంప్టన్‌ కన్జూమర్‌, వోల్టాస్‌, బాటా ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌యూఎల్‌, కాల్గేట్‌, డాబర్‌, ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌, కేఈసీ, టిమ్‌కెన్‌, సోలార్‌ ఇండస్ట్రీస్‌, ఏపీఎల్‌ అపోలో, బిర్లా కార్ప్‌, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ తదితరాలకు చోటు లభించింది. వీటితోపాటు పీఎస్‌యూ కంపెనీలు పవర్‌గ్రిడ్‌ కార్ప్‌రేషన్‌, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, కంకార్‌, బీఈఎల్‌, బీఈఎంఎల్‌ సైతం లబ్ది పొందే వీలున్నట్లు బ్రోకింగ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి.You may be interested

52 వారాల గరిష్టానికి 57 షేర్లు

Monday 27th January 2020

-52 వారాల కనిష్టానికి 26 షేర్లు ఇంచుమించు 57 షేర్లు సోమవారం ఎన్‌ఎస్‌ఈలో 52 వారాల గరిష్టానికి చేరాయి. వీటిలో ఆదాని ఎంటర్‌ప్రైజెస్‌, అమర రాజా బ్యాటరీస్‌, అపోలో హాస్పటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అతుల్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, డాబర్‌ ఇండియా, గుజరాత్‌ ఇండస్ట్రీస్‌ పవర్‌ కంపెనీ, గుజరాత్‌ స్టేట్‌ పెట్రోనెట్‌ లిమిటెడ్‌, గుజరాత్‌ గ్యాస్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌, జుబ్లింట్‌ ఫుడ్‌ వర్క్‌, లారస్‌ ల్యాబ్స్‌, పీవీఆర్‌, టొరంటో పవర్‌, వైభవ్‌

అమ్మకాల ఒత్తిడిలో మెటల్‌ షేర్లు

Monday 27th January 2020

మార్కెట్‌ పతనంలో భాగంగా సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో మెటల్‌ షేర్లు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. కరోనా వైరస్‌ వల్ల సంభవించే వ్యాధి మరింత ఉధృత రూపం దాల్చవచ్చనే అంచనాలతో చైనాతో పాటు అంతర్జాతీయ వృద్ధి ఆందోళనలు తెరపైకి వచ్చాయి. ఈ ప్రతికూల ప్రభావంతో మెటల్‌ షేర్లు నేటి ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌

Most from this category