STOCKS

News


కరోనాతో ఈ కంపెనీలకు లాభం!

Wednesday 12th February 2020
Markets_main1581490555.png-31723

చైనాలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చైనాలో పలు ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి, ఆ దేశం నుంచి పలు ఎగుమతులు నిలిచిపోతున్నాయి. దీంతో అలాంటి ఉత్పత్తులు చేసే దేశీయ కంపెనీలకు సమీప భవిష్యత్‌లో డిమాండ్‌ ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ ఎక్విప్‌మెంట్‌, కెమికల్స్‌, ఎరువులు, ప్లాస్టిక్‌ రంగాల కంపెనీలకు చైనా ఇబ్బందులు లాభదాయకంగా మారతాయని ట్రేడింగ్‌బెల్స్‌ అనలిస్టు సంతోశ్‌ మీనా చెప్పారు. ఈ రంగాలకు చెందిన ఐదు కంపెనీలను ఏడాది కాలానికి సూచించారు.
1. డిక్సన్‌ టెక్నాలజీ: ఏడాది టార్గెట్‌ రూ. 5500. మేక్‌ ఇన్‌ ఇండియాతో కంపెనీ బాగా ప్రయోజనం పొందుతోంది. కంపెనీకి బలమైన ఆర్డర్‌ బుక్‌ ఉంది. చైనాలో ఉత్పత్తివ్యయాలు పెరగడంతో అంతర్జాతీయ కంపెనీలు ఇండియా కంపెనీలవైపు చూస్తున్నాయి. కార్పొరేట్‌ టాక్స్‌ కోత కూడా కలిసివస్తుంది.
2. పీఐ ఇండస్ట్రీస్‌: ఏడాది టార్గెట్‌ రూ. 1920. ఆగ్రోకెమికల్స్‌లో అగ్రగామి స్థానాల్లో ఉంది. చైనా దిగుమతులు పడిపోవడంతో కంపెనీకి బాగా కలిసివస్తుంది. ఆర్‌అండ్‌డీపై అధిక ఫోకస్‌ కంపెనీ పురోగతిలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం సామర్ధ్య విస్తరణ కూడా చేపడుతోంది.
3. సుప్రీమ్‌ ఇండస్ట్రీస్‌: ఏడాది టార్గెట్‌ రూ. 1660. క్రూడాయిల్‌ ధరల పతనం, చైనా ఎగుమతుల క్షీణతతో కంపెనీకి ప్రయోజనకరంగా ఉంటుంది. ప్యాకేజింగ్‌, ప్లాస్టిక్‌ పైప్‌ విభాగాల్లో డిమాండ్‌ పెరగడం కూడా కలిసిరానుంది. నల్‌ సే జల్‌ స్కీమ్‌తో కంపెనీ ఆర్డర్లు బాగా పెరుగుతాయి.
4. ఐఓఎల్‌ కెమికల్స్‌అండ్‌ఫార్మాసూటికల్స్‌: ఏడాది టార్గెట్‌ రూ. 255. ఏపీఐ, కెమికల్‌ వ్యాపార కంపెనీలు క్రమంగా చైనా నుంచి ఇండియా వైపు మరలుతున్నాయి. చైనాలో నియంత్రణలు పెరగడం, కరోనా కారణంగా ఉత్పత్తి తగ్గడంతో కంపెనీకి ప్రయోజనం పెరగనుంది. 
5. యూపీఎల్‌: ఏడాది టార్గెట్‌ రూ. 750. చైనా నుంచి దిగుమతుల్లో ఎరువులు నాలుగోస్థానంలో ఉన్నాయి. ఇప్పుడు తాజా భయాలతో ఈ దిగుమతులు పతనం కావడం కంపెనీ అమ్మకాలు పెరగడానికి దోహదం చేస్తుంది. దేశీయంగా మార్కెట్‌ పెంచుకోవడానికి ఈ సందర్భం ఒక మంచి అవకాశంగా కంపెనీ భావిస్తోంది. 



You may be interested

కొనసాగుతున్న యస్‌బ్యాంక్‌ షేరు పతనం

Wednesday 12th February 2020

యస్‌ బ్యాంక్‌ షేరు వరుసగా మూడో రోజూ నష్టాన్ని చవిచూసింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు రూ.36.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. డిసెంబర్‌ క్వార్టర్‌లో మొండిబకాయిలు మరింత పెరగవచ్చనే భయాలతో డిపాజిట్‌దారులు యస్‌ బ్యాంకు నుంచి తమ డిపాజిట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు గణాంకాలు వెలువడ్డాయి. దీంతో  షేరు ఈ వారం ప్రారంభం నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. ఈ మూడు ట్రేడింగ్‌ సెషన్‌లో షేరు ఏకంగా 9శాతం నష్టాన్ని చవిచూసింది.

ఎంఎస్‌సీఐ ఇండెక్స్‌లో బంధన్‌ బ్యాంక్‌ వెయిటేజ్‌కి బూస్ట్‌

Wednesday 12th February 2020

ఎంఎస్‌సీఐ ఇండియా ఇండెక్స్‌లో బంధన్‌ బ్యాకు వెయిటేజి 32 బేసిస్‌ పాయింట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ బ్యాంకు ఈక్విటీ ఫ్రీఫ్లోట్‌ పెరిగిన కారణంగా వచ్చే సమీక్షలో ఈ వెయిటేజిలో మార్పు ఉండవచ్చని  మోర్గాన్‌ స్టాన్లీ తెలిపింది. బుధవారం ఎంఎస్‌సీఐ  ఇండెక్స్‌పై సమీక్ష నిర్వహించనున్నారు.వెయిటేజీ పెరగనున్నందున రూ.700 కోట్ల విదేశీ నిధులు ఈ బ్యాంకు స్టాక్‌లోకి ప్రవహించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

Most from this category