News


షార్ట్‌టర్మ్‌కు టాప్‌ స్టాక్స్‌

Monday 11th February 2019
Markets_main1549869858.png-24133

వచ్చే 2-3 వారాల్లో మంచి రాబడినిచ్చే సత్తా ఉన్న స్టాకులను ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు సిఫార్సు చేస్తున్నాయి.
చార్ట్‌వ్యూ ఇండియా రికమండేషన్లు
1. లుపిన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 890. స్టాప్‌లాస్‌ రూ. 797. మూడు సెషన్లుగా లాంగ్‌లోయర్‌ షాడోలను ఏర్పరుస్తూ రూ. 800 వద్ద కొనుగోళ్లను ఆకర్షిస్తోంది. ఇటీవలి కాలంలో రూ. 800-900 మధ్య కదలాడుతోంది. అందువల్ల ఈ శ్రేణికి దిగువ అవధి వద్ద కొనుగోళ్లు చేయవచ్చు.
2. సుప్రీం ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గె్‌ట్‌ రూ. 1078. స్టాప్‌లాస్‌ రూ. 977. ఇటీవలి పతనం అనంతరం రూ. 980 వద్ద కన్సాలిడేట్‌ అయింది. గత రెండు సెషన్లుగా పుల్‌బ్యాక్‌ యత్నాలు ఆరంభించింది. రూ. 1028కి పైన అప్‌మూవ్‌ వేగవంతమవుతుంది 
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రికమండేషన్లు
1. దివిస్‌ ల్యాబ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1850. స్టాప్‌లాస్ రూ. 1570. రెండు నెలలపాటు దశదిశా లేకుండా తిరిగిన షేరు ధర గతవారం అప్‌మూవ్‌ దిశగా అడుగులు వేసింది. చార్టుల్లో హయ్యర్‌టాప్స్‌, బాటమ్స్‌ ఏర్పాటు పరిశీలిస్తే అప్‌మూవ్‌ మరికొంతకాలం కొనసాగవచ్చు. 
2. బాటా ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1365. స్టాప్‌లాస్‌ రూ. 1105. గతవారం స్వల్ప పతనం చూసిన అనంతరం తిరిగి అప్‌మూవ్‌ దిశగా పయనించింది. గత కొద్ది నెలలుగా కొనసాగుతున్న అప్‌ట్రెండ్‌ మరింత కాలం కొనసాగుతుందని అంచనా. ఇండికేటర్లు కూడా పాజిటివ్‌గా ఉన్నాయి.
ప్రభుదాస్‌లీలాధర్‌ రికమండేషన్లు
1. కోటక్‌ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1420. స్టాప్‌లాస్‌ రూ. 1245. క్రమానుగత పెరుగుదల నమోదు చేస్తోంది. చార్టుల్లో హయ్యర్‌ బాటమ్స్‌ ఏర్పరుస్తోంది. ఆర్‌ఎస్‌ఐ అప్‌మూవ్‌లో ఉంది. వాల్యూంలు కూడా బాగున్నాయి.
2. బీఈఎంఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 850. స్టాప్‌లాస్‌ రూ. 735. ఇటీవలి పతనం అనంతరం రూ. 730 వద్ద  కన్సాలిడేట్‌ అయింది. తాజాగా చార్టుల్లో బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచి అప్‌మూవ్‌ సంకేతాలు వెలువరించింది.
ఛాయిస్‌ బ్రోకింగ్‌ రికమండేషన్లు
1. గృహ్‌ ఫైనాన్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 277. స్టాప్‌లాస్‌ రూ. 230. డైలీ చార్టుల్లో సాసర్‌ బాటమ్‌ పాటర్న్ ఏర్పరిచింది. బుల్స్‌ పట్టు కొనసాగుతుందనేందుకు ఈ పాటర్న్‌ నిదర్శనం. ప్రస్తుతం స్టాకు తన 21 రోజుల డీఎంఏకు పైన ట్రేడవుతూ బలంగా ఉంది.
2. యూపీఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 857. స్టాప్‌లాస్‌ రూ. 796. చార్టుల్లో మూవింగ్‌ యావరేజ్‌లు పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచాయి. తాజాగా స్థిరీకరణ పాటర్న్‌ నుంచి అప్‌సైడ్‌ బ్రేకవుట్‌ సాధించింది. 
ఏంజల్‌ బ్రోకింగ్‌ రికమండేషన్లు
1. బజాజ్‌ ఫైనాన్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2898. స్టాప్‌లాస్‌ రూ. 2620. మూడు నెలలుగా గత పతనం నుంచి క్రమానుగత రికవరీ చూపుతోంది. రెండు వారాలుగా బ్రేకవుట్‌ సాధించే యత్నాలు చేసి విజయం పొందింది. తాజా అప్‌మూవ్‌ మరింత ముందుకు కొనసాగనుంది.
2. వోకార్డ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 468. స్టాప్‌లాస్‌ రూ. 296. ఇటీవలి పతనంతో లోతైన ఓవర్‌సోల్డ్‌ జోన్‌లోకి ప్రవేశించింది. గత బుధవారం వీ ఆకారపు రికవరీ నమోదు చేసింది. చార్టుల్లో బుల్లిష్‌ హామర్‌ ఏర్పడడం అప్‌మూవ్‌కు సంకేతం.
ఎపిక్‌ రిసెర్చ్‌ రికమండేషన్లు:
1. భారతీ ఎయిర్‌టెల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 335. స్టాప్‌లాస్‌ రూ. 300. చార్టుల్లో బాటమ్‌ అవుట్‌ అయ్యే సంకేతాలు చూపుతోంది. దిగువన రూ. 300 వద్ద బలమైన మద్దతు లభిస్తోంది. ఈ స్థాయిల వద్ద కొనుగోళ్లకు అవకాశాలను పరిశీలించవచ్చు. You may be interested

మెటల్‌ షేర్లలో అమ్మకాలు

Monday 11th February 2019

ప్రపంచమార్కెట్లో పతనమవుతున్న మెటల్‌ షేర్ల పతనానికి అనుగుణంగా దేశీయ మార్కెట్లో మెటల్‌ షేర్లు నష్టాల బాటపట్టాయి. మెటల్‌ షేర్లలో అధిక పరిమాణం గల నాల్కో, వేదాంత, వెల్‌స్పాన్‌ కార్పోరేషన్‌, జిందాల్‌ స్టీల్‌, మెయిల్‌ షేర్ల క్షీణతతో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ సోమవారం ట్రేడింగ్‌లో 2శాతం నష్టపోయింది. అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధి మందగమనం, చైనా-అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం, అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ ఆందోళన కొనసాగుతుండం

విహార యాత్రకు సిప్‌

Monday 11th February 2019

ప్ర: నా వయస్సు 40 సంవత్సరాలు. నాకు బుద్ది మాంద్యం గల ఒక కొడుకున్నాడు. తన భవిష్యత్‌ అవసరాల నిమిత్తం  నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎలా ప్లాన్‌ చేసుకోవాలో సూచించండి? -అరవింద్‌, విశాఖపట్టణం జ: బుద్ది మాంద్యం గల బిడ్డ ఉంటే, ఆ బిడ్డ అవసరాల కోసం మీకు భవిష్యత్తులో భారీ మొత్తమే అవసరమవుతుంది. దీనికి గాను మీరు పెద్ద మొత్తంలోనే నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అందుకని వీలైనంత అధికంగా ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేయండి.

Most from this category