News


ఈ 4 స్టాక్స్‌ మార్కెట్లను మించాయ్‌

Tuesday 7th January 2020
Markets_main1578388964.png-30735

ఇండిగో, జేకే టైర్‌
హెచ్‌సీసీ, పనామా పెట్రోకెమ్‌

ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లలో మెరుగుపడ్డ సెంటిమెంటు కారణంగా దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. వెరసి ట్రేడింగ్‌ ప్రారంభంనుంచీ కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. మధ్యాహ్నం 2.20 ప్రాంతంలో సెన్సెక్స్‌ 145 పాయింట్లు పెరిగి 40,821కు చేరగా.. నిఫ్టీ 42 పాయింట్లు పుంజుకుని 12,035 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల ఆధారంగా ఇండిగో బ్రాండు విమానయాన సేవల సంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌, పనామా పెట్రోకెమ్‌, హెచ్‌సీసీ కౌంటర్లకు డిమాండ్‌ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ కౌంటర్లన్నీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌
ఇండిగో బ్రాండు ద్వారా కంపెనీ తాజాగా ఆగ్రాకు సేవలను విస్తరించినట్లు ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ పేర్కొంది. తద్వారా దేశీయంగా 63వ ప్రాంతాన్ని కలుపుతూ సర్వీసులను విస్తరించినట్లు తెలియజేసింది. దీంతో ఉత్తరప్రదేశ్‌లో ఐదో పట్టణానికి కనెక్టివిటీని ఏర్పాటు చేసినట్లయ్యిందని తెలియజేసింది. కంపెనీ ఇప్పటికే అలహాబాద్‌, గోరఖ్‌పూర్‌, లక్నో, వారణాశిల నుంచి విమానయాన సర్వీసులను నిర్వహిస్తోంది. కంపెనీలో ప్రమోటర్లకు 74.89% వాటా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఇండిగో షేరు 2.5 శాతం పెరిగి రూ. 1360 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1384 వరకూ ఎగసింది.

జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌
మార్చితో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 50 శాతం జంప్‌చేయనున్నట్లు జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా అంచనాలు ప్రకటించింది. దీనికితోడు దేశీయంగా రీప్లేస్‌మెంట్‌ మార్కెట్‌ జోరందుకోవడవంతో రూ. 800 కోట్ల టర్నోవర్‌ సాధించనున్నట్లు అభిప్రాయపడింది. ఆటోమొబైల్‌ కంపెనీల నుంచి డిమాండ్‌ తగ్గినప్పటికీ ఆదాయ అంచనాలు అందుకోగలమని తెలియజేసింది. కంపెనీలో ప్రమోటర్లకు 56.23% వాటా ఉంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో జేకే టైర్‌ షేరు ప్రస్తుతం 3.3 శాతం లాభంతో రూ. 75 వద్ద ట్రేడవుతోంది.

పనామా పెట్రోకెమ్‌
వరుసగా ఆరో త్రైమాసికంలోనూ ప్రమోటర్లు వాటా పెంచుకున్నట్లు వెల్లడించడంతో పనామా పెట్రోకెమ్‌ కౌంటర్‌ జోరం‍దుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 7 శాతం జంప్‌చేసి రూ. 66 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 71 సమీపానికి ఎగసింది. డిసెంబర్‌ చివరికల్లా కంపెనీలో ప్రమోటర్ల వాటా 72.82 శాతానికి చేరినట్లు పనామా పెట్రో బీఎస్‌ఈకి వెల్లడించింది. సెప్టెంబర్‌కల్లా ఈ వాటా 70.49 శాతంగా నమోదైంది. కాగా.. 2018 జూన్‌ క్వార్టర్‌లో ప్రమోటర్‌ వాటా 68.53 శాతంకాగా.. అప్పటినుంచీ చూస్తే.. మొత్తం 4.29 వాటాను అదనంగా కొనుగోలు చేశారు. 

హెచ్‌సీసీ లిమిటెడ్‌
వీసీసీఎల్‌తో సంయుక్తంగా ఏర్పాటు చేసిన జేవీ ద్వారా ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ నుంచి కాంట్రాక్టును పొందినట్లు మౌలిక సదుపాయాల సంస్థ హెచ్‌సీసీ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. ఢిల్లీ మెట్రో నాలుగో దశ ప్రాజెక్టులో భాగంగా రూ. 489 కోట్ల విలువైన ఆర్డర్‌ లభించినట్లు తెలియజేసింది. ఈ జేవీలో హెచ్‌సీసీ 75 శాతం వాటాను కలిగి ఉంది. కాంట్రాక్టులో భాగంగా జనక్‌పురి వెస్ట్‌ నుంచి ఆర్‌కే పురం ఆశ్రమ్‌వరకూ 2.03 కిలోమీటర్లమేర రెండు సొరంగ మార్గాలను అభివృద్ధి చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌సీసీ షేరు 3.5  శాతం పుంజుకుని రూ. 10.5 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో గరిష్టంగా రూ. 10.75ను తాకింది.You may be interested

2020లో సరికొత్త బుల్‌సైకిల్‌!

Tuesday 7th January 2020

నార్నొలియా అనలిస్టు శైలేంద్రకుమార్‌ కొత్త ఏడాది ఎర్నింగ్స్‌ దన్నుతో ఈక్విటీల్లో కొత్త బుల్‌సైకిల్‌ ఆరంభమవుతుందని నార్నొలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ అనలిస్టు శైలేంద్ర కుమార్‌ అంచనా వేశారు. 2013-17 కాలంలో వేగవంతమైన ర్యాలీ జరిపిన సూచీలు తర్వాత రెండేళ్లు కన్సాలిడేషన్‌ మూడ్‌లోకి మారాయన్నారు. గతేడాది సూచీల్లో 12 శాతం పెరుగుదల ఉన్నా, విస్తృత మార్కెట్‌ భాగస్వామ్యం లోపించిందన్నారు. చాలా స్టాకులు 2017 గరిష్ఠాలకు చాలా దిగువన ట్రేడవుతున్నాయన్నారు. కొత్త ఏడాది ఇవన్నీ పుంజుకుంటాయని,

వచ్చే కొన్ని వారాలకు 12 స్టాక్‌ సిఫార్సులు

Tuesday 7th January 2020

రెండువారాల వరుస పతనం అనంతరం దురదృష్టవశాత్తూ సూచీలు ఈ వారాన్ని కూడా నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మధ్యప్రా‍చ్య దేశాల్లో చెలరేగిన రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు సూచీలను నష్టాల వైపు నడిపించాయి. మార్కెట్లో కొనసాగుతున్న ఈ దిద్దుబాటు చర్య షేరు కొనుగోళ్లకు మంచి తరుణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే వారంలో అధిక రాబడులను ఇచ్చే 12స్టాకులను వారు సిఫార్సు చేస్తున్నారు.  షేరు పేరు :- ఓఎన్‌జీసీ రేటింగ్‌:- కొనవచ్చు టార్గెట్‌ ధర:- రూ.140 స్టాప్‌

Most from this category