News


పోస్ట్‌బడ్జెట్‌ సిఫార్సులు!

Monday 8th July 2019
Markets_main1562580106.png-26900

కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అనంతరం పాజిటివ్‌గా ప్రభావితమయ్యే 21 షేర్లను అనలిస్టులు సిఫార్సు చేస్తున్నారు.
సామ్‌కో సెక్యూరిటీస్‌:
1. కొచ్చిన్‌ షిప్‌ యార్డ్‌, అదానీ పోర్ట్స్‌: అంతర్గత జలరవాణాపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ఇందులో భాగంగా కార్గొ టెర్మినల్స్‌ సంఖ్యను పెంచనుంది. ఇవన్నీ జలరవాణా విభాగ రంగానికి చెందిన కంపెనీలకు మేలు చేసే అంశాలు. ఈ రెండు కంపెనీలకు కొత్త నౌకలు, పడవలు నిర్మించే ఆర్డర్లు పెరుగుతాయి. దీంతో పాటు లాజిస్టిక్స్‌ పరంగా మంచి వృద్ది ఉంటుంది.
2. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌: గ్రామీణ భారతంపై ఎక్కువ ఫోకస్‌, సాగు ఆదాయాల పెంపు చర్యలు, కన్జూమర్‌ కొనుగోలు సామర్ధ్యం పెరుగుదల చర్యలు.. కంపెనీపై పాజిటివ్‌ ప్రభావం చూపుతాయి.
3. ఐటీసీ: దేశంలో అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ కంపెనీగా రూరల్‌ ఇండియా, వ్యవసాయ రంగాల్లో చేపట్టే వృద్ధి చర్యలతో నేరుగా ప్రభావితం కానుంది.
4. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌: బీమా ఇంటర్‌మీడియరీస్‌లోకి వంద శాతం ఎఫ్‌డీఐలను అనుమతించాలన్న నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుంది.
5. ఎల్‌అండ్‌టీ: మౌలిక వసతుల కల్పనకు ఎక్కువ నిధుల కేటాయింపు ఈ రంగంలోని పెద్ద సంస్థైన ఎల్‌అండ్‌టీకి మేలు చేస్తుంది.
6. ఎస్‌బీఐ: పీఎస్‌బీల రీక్యాప్‌కు రూ. 70వేల కోట్లు కేటాయించారు. దీంతో ఈ బ్యాంకుల సామర్ధ్యం మరింత మెరుగవనుంది. 
7. హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌ఐసీ హౌసింగ్‌, జీఐసీ హౌసింగ్‌: బడ్జెట్లో హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల నియంత్రణకు ప్రకటించిన చర్యలు ఈ కంపెనీల పనితీరును మెరుగుపరుస్తాయి. ఈ రంగంలో స్థిరత్వం వస్తుంది.
షేర్‌ఖాన్‌:
1. ఇన్‌ఫ్రా: ఎల్‌అండ్‌టీ, అశోక్‌ బిల్డ్‌కాన్‌, గాయత్రి ప్రాజెక్ట్స్, సద్భావ్‌ ఇంజనీరింగ్‌, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక‌్షన్స్‌: ఇన్‌ఫ్రా రంగంలో వచ్చే ఐదేళ్లలో రూ. 100 లక్షల కోట్లు వెచ్చిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ రంగంలో సమస్యల అధ్యయనానికి నిపుణుల కమిటీ ఏర్పరచాలని నిర్ణయించింది. 
2. ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, అసైనా హౌసింగ్‌, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌: అందరికీ గృహకల్పనకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. 
3. ఎన్‌బీఎఫ్‌సీ: ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌: ఇకపై డిపాజిట్లు స్వీకరించే ఎన్‌బీఎఫ్‌సీలు కీలకమైనవిగా మారనున్నాయి. You may be interested

ఫైనాన్షియల్‌ సర్వీసుల షేర్లు...నిలువునా పతనం

Monday 8th July 2019

మార్కెట్‌ పతనంలో భాగంగా సోమవారం ఫైనాన్షియల్‌ సర్వీసుల షేర్లు తీవ్ర స్థాయిలో నష్టపోయాయి. బడ్జెట్లో డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సాహించే దిశగా రూ. కోటికి మించి నగదు తీసుకుంటే 2శాతం పన్ను విధించారు. అలాగే  కంపెనీలు ప్రకటించే బై బ్యాక్‌లపై 20శాతం పన్ను చెల్లించాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ రెండు అంశాలతో నేడు ఈ షేర్లు తీవ్రంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ ఫైనాన్షియల్‌

గ్లోబల్‌ మార్కెట్ల డౌన్‌గ్రేడ్‌

Monday 8th July 2019

రేటింగ్‌ తగ్గించిన మోర్గాన్‌ స్టాన్లీ అంతర్జాతీయ మందగమన భయాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రముఖ బ్రోకింగ్‌ సం‍స్థ మోర్గాన్‌స్టాన్లీ, ప్రపంచ మార్కెట్లను డౌన్‌గ్రేడ్‌ చేసింది. ఇప్పటివరకు కొనసాగిస్తున్న ఈక‍్వల్‌వెయిట్‌ రేటింగ్‌ను అండర్‌వెయిట్‌కు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ప్రపంచ మార్కెట్లలో అప్‌సైడ్‌ కదలికలు పరిమితంగా ఉంటాయని తెలిపింది. వచ్చే ఏడాది కాలంలో ఎస్‌అండ్‌పీ 500, ఎంఎస్‌సీఐ యూరప్‌, ఎంఎస్‌సీఐ ఈఎం, తోపిక్స్‌ జపాన్‌ తదితర సూచీల్లో కేవలం ఒక్క శాతం అప్‌మూవ్‌ ఉండొచ్చని అంచనా

Most from this category