News


నేడు వార్తల్లో షేర్లు

Wednesday 22nd January 2020
Markets_main1579668491.png-31092


వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్లు

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌:   జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ క్యూ3 నికర లాభం 37.9 శాతం తగ్గి రూ.349.4 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన ఆదాయం 5.5 శాతం తగ్గి రూ.2,048.7 కోట్లుగా నమోదైంది.

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ: హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ క్యూ3 నికర లాభం 45 శాతం పెరిగి రూ.352.55 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన నికర ఆదాయం 10 శాతం పెరిగి రూ.524.73 కోట్లకు చేరింది.

హవెల్స్‌: ఈ కంపెనీ క్యూ3 కన్సాలిడేటెడ్‌ నికర లాభం 7.4 శాతం పెరిగి రూ.201.2 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన నికర ఆదాయం 9.9 శాతం తగ్గి రూ.2,273.3 కోట్లకు చేరింది.
శాస్కన్‌ టెక్నాలజీస్‌: శాస్కన్‌ టెక్నాలజీస్‌ క్యూ3 నికర లాభం 3.1 శాతం పెరిగి రూ.23.4 కోట్లుగా నమోదైంది. త్రైమాసిక ప్రాతిపదికన నికర ఆదాయం 5.3 శాతం తగ్గి రూ.119 కోట్లకు చేరింది.

అలహాబాద్‌ బ్యాంక్‌: ప్రిఫరెన్షియల్‌ కేటాయింపుల ద్వారా అలహాబాద్‌ బ్యాంక్‌ ఈక్విటీ క్యాపిటల్‌ను రూ.2, 153 కోట్ల వరకు పెంచే ప్రతిపాదనను పరిశీలించడానికి బోర్డు జనవరి 24న సమావేశం కానుంది.

ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌:  రూ.4,360 కోట్ల మొత్తానికి ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన ఇండియన్‌ఓవర్సీస్‌ బ్యాంక్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియాకి జారీ చేయాల్సిన ఈక్విటీ వాటా ధరను నిర్ణయించడానికి జనవరి 27న డైరెక్టర్ల కమిటీ సమావేశం జరగనుంది.

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌: రూ .28 కోట్లు విలువచేసే  2.053 శాతం డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ వాటాను  ఎల్‌ఐసీ ఓపెన్‌ మార్కెట్‌లో విక్రయించింది.

యాక్సిస్‌ బ్యాంక్‌: రిలయన్స్‌ పవర్‌కు చెందిన సంస్థపై యాక్సిస్‌ బ్యాంక్‌ దివాల పిటీషన్‌ను వేసింది.


 



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ డౌన్‌

Wednesday 22nd January 2020

0.5 శాతం వెనకడుగు రెండు రోజుల వరస నష్టాలకు చెక్‌ పెడుతూ ప్రారంభంలోనే బౌన్స్‌బ్యాక్‌ అయిన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి తిరిగి అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. లాభాలను పోగొట్టుకోవడంతోపాటు.. నష్టాల బాట పట్టాయి. ఉదయం 10.40 ప్రాంతంలో సెన్సెక్స్‌ 60 పాయింట్లు క్షీణించి 41,254ను తాకగా.. నిఫ్టీ 24 పాయింట్లు తక్కువగా 12,146 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో బ్యాం‍క్‌ కౌంటర్లలో అమ్మకాలు కనిపిస్తున్నాయి. వెరసి ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ

4 వారాలకు 3 స్టాక్‌ రికమండేషన్స్‌?

Wednesday 22nd January 2020

8-14 శాతం రిటర్న్స్‌ అంచనా సాంకేతిక అంశాల ఆధారంగా సిఫారసులు వరుసగా రెండు రోజులపాటు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న దేశీ స్టాక్‌ మార్కెట్లు బుధవారం బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. బడ్జెట్‌పై అంచనాలు పెరగడంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో సెన్సెక్స్‌ 185 పాయింట్లు ఎగసి 41,510కు చేరగా.. నిఫ్టీ 48 పాయింట్లు పుంజుకుని 12,218ను తాకింది. పెట్టుబడులు, వినియోగంపై దృష్టిపెడుతూ బడ్జెట్‌ వెలువడనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. జీడీపీ వృద్ధికి ఊతమిచ్చే

Most from this category