News


బ్రోకరేజ్‌ల నుంచి షార్ట్‌టర్మ్‌ సిఫార్సులు

Monday 25th March 2019
Markets_main1553508152.png-24788

వచ్చే రెండు మూడువారాల్లో మంచి రాబడినందించే పది షేర్లను వివిధ బ్రోకింగ్‌ సంస్థలు రికమండ్‌ చేస్తున్నాయి. 
ఏంజిల్‌ బ్రోకింగ్‌
1. హెడెల్‌బర్గ్‌ సిమెంట్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 192. స్టాప్‌లాస్‌ రూ. 167. దిగువన రూ.145 నుంచి ఒక్కపాటున అప్‌మూవ్‌ చూపి రూ. 184 వరకు ఎగిసింది. అనంతరం కన్సాలిడేషన్‌ చెంది రూ. 170 స్థాయికి చేరింది. చార్టుల్లో జపనీస్‌ క్యాండిల్‌స్టిక్‌ పాటర్న్‌ ఏర్పరిచింది. వాల్యూం కదలికలు అప్‌మూవ్‌కు అనుకూంలగా ఉన్నాయి.
2. ఇన్ఫోసిస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 804. స్టాప్‌లాస్‌ రూ. 707. ఇటీవలి ర్యాలీలో ఐటీ స్టాకులు పెద్దగా పాలుపంచుకోలేదు. ప్రసుతానికి ఇవి స్తబ్దుగా ఉన్నా, త్వరలో మరలా పరుగులు ఆరంభిస్తాయని ఇండికేటర్లు సూచిస్తున్నాయి. డైలీ చార్టుల్లో ఫాలింగ్‌ ఛానెల్‌ బుల్లిష్‌ బ్రేకవుట్‌ సాధించింది. 
యస్‌ సెక్యూరిటీస్‌
1. టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 3350. స్టాప్‌లాస్‌ రూ. 2800. వీక్లీ, డైలీ చార్టుల్లో నిరోధ పాటర్న్‌ నుంచి బ్రేకవుట్‌ సాధనకు సిద్దంగా కనిపిస్తోంది. రూ. 3010కి పైన స్థిరంగా కదలాడితే మరింత అప్‌మూవ్‌ ఉంటుంది. 
2. ఏసియన్‌ పెయింట్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1570. స్టాప్‌లాస్‌ రూ. 1420. చార్టుల్లో త్రిభుజాకార పాటర్న్‌ నుంచి బ్రేకవుట్‌ ఇచ్చేందుకు రెడీగా ఉంది. ఆర్‌ఎస్‌ఐ తదితర ఇండికేటర్లు పాజిటివ్‌గా ఉన్నాయి. 
ప్రభుదాస్‌ లీలాధర్‌
1. ఆస్ట్రల్‌ పాలీటెక్నిక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1300. స్టాప్‌లాస్‌ రూ. 1080. అప్‌మూవ్‌ అనంతరం చిన్న కరెక‌్షన్‌ తిరిగి అప్‌మూవ్‌.. ఇలా షేరు నడక కొనసాగుతోంది. ఇండికేటర్లు బుల్లిష్‌గా ఉన్నాయి.
2. కాస్ట్రాల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 180. స్టాప్‌లాస్‌ రూ. 154. హయ్యర్‌ బాటమ్‌ పాటర్న్‌ ఏర్పరిచి 200 రోజుల డీఎంఏ వద్ద మంచి మద్దతు పొందుతోంది. వాల్యూంలు, ఇండికేటర్లు త్వరలో అప్‌మూవ్‌కు సంకేతాలు ఇస్తున్నాయి.
ఛాయిస్‌ బ్రోకింగ్‌
1. కెన్‌ఫిన్‌ హోమ్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 355. స్టాప్‌లాస్‌ రూ. 308. హయ్యర్‌టాప్‌, బాటమ్‌ పాటర్న్‌తో కొనసాగుతోంది. వాల్యూంలు సరాసరి కన్నా ఎక్కువగా ఉన్నాయి. చార్టుల్లో కీలక డీఎంఏలకు పైన కదలాడుతూ బలంగా కనిపిస్తోంది.
2. ఎస్‌ఆర్‌ఎఫ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2665. స్టాప్‌లాస్‌ రూ. 2350. అధోముఖ వాలురేఖ నుంచి అప్‌సైడ్‌ బ్రేకవుట్‌ సాధించింది. దీర్ఘకాలిక అప్‌మూవ్‌ ఛానెల్లోకి మరోమారు ఎంటరైంది.
ఎపిక్‌ రిసెర్చ్‌
1. ఇన్ఫోసిస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 798. స్టాప్‌లాస్‌ రూ. 729. డైలీ చార్టుల్లో వాలు రేఖా నిరోధాన్ని ఛేదించుకొని బయటపడింది. ఆర్‌ఎస్‌ఐ తదితర ఇండికేటర్లు పాజిటివ్‌గా మారాయి.
2. జుబిలాంట్‌ ఫుడ్‌వర్క్స్‌': కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1495. స్టాప్‌లాస్‌ రూ. 1385. ఇటీవలి కన్సాలిడేషన్‌ అనంతరం బుల్లిష్‌ ఎంగల్ఫింగ్‌ పాటర్న్‌ను ఏర్పరిచింది. చాలారోజులుగా మద్దతునిస్తున్న వాలురేఖ వద్ద మరోమారు మద్దతు పొందింది.
చార్ట్‌వ్యూఇండియా
1. ఎస్‌ఆర్‌ఎఫ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2662. స్టాప్‌లాస్‌ రూ. 2390. ఇటీవల గత కాలపు గరిష్ఠాలను దాటి మరో అప్‌స్వింగ్‌కు రెడీగా ఉన్నట్లు కనిపిస్తోంది. కన్సాలిడేషన్‌ అనంతరం బ్రేకవుట్‌ సాధించడం పాజిటివ్‌ అంశం.
2. సిటీ యూనియన్‌ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 219. స్టాప్‌లాస్‌ రూ. 189. జనవరిలో ఏర్పరిచిన టాప్‌ను దాటేయడం ద్వారా ఇంకొకమారు జీవిత కాల గరిష్ఠాలను చేరేందుకు తయారైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చిన్నపాటి అవరోధాలున్నా, త్వరలో టార్గెట్‌ను చేరవచ్చు. You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం డౌన్‌

Monday 25th March 2019

మార్కెట్లో జరిగిన అమ్మకాలతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం 1శాతం నష్టపోయింది. ఇంట్రాడేలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడం ఇండెక్స్‌ను భారీగా నష్టపోయింది. ముఖ్యంగా ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ షేర్లైన ఐసీఐసీఐ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ షేర్ల 2శాతం పతనం ఇండెక్స్‌ను భారీగా దెబ్బతీశాయి. అలాగే ఫెడరల్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎస్‌బీఐ బ్యాంక్‌, పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌,

భరోసా ఇస్తోందా? భయపెడుతోందా?

Monday 25th March 2019

ఫెడ్‌ వ్యాఖ్యలపై అయోమయం యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్లను పెంచనని గత డిసెంబర్‌లో నిర్ణయం తీసుకున్నప్పటినుంచి ఈక్విటీలు ర్యాలీ జరుపుతున్నాయి. కానీ గతవారం ఫెడ్‌ వ్యాఖ్యలు మార్కెట్లలో భయాలు రేకెత్తించాయి. రేట్ల పెంపుదలపై ఫెడ్‌ తీసుకున్న యూటర్న్‌ మార్కెట్లలో ఆయోమయం రేకెత్తిస్తోంది. రేట్లు పెంచరని ఆనందించాలా? మాద్యం తప్పదన్న సంకేతాలకు భయపడాలా? మదుపరులు తేల్చుకోలేకపోతున్నారు. ఈ ఏడాది రేట్ల పెంపు ఉండదని, బాండ్‌ కొనుగోలు కార్యక్రమానికి కత్తెరింపులు ఉండవని ఫెడ్‌ తాజాగా ప్రకటించింది.

Most from this category