News


ఈ స్టాకుల్లో పెరిగిన ఓపెన్‌ఇంట్రెస్ట్‌

Tuesday 5th November 2019
Markets_main1572927346.png-29357

నవంబర్‌ సీరిస్‌లో సూచీలు కొత్త గరిష్ఠాలను చేరతాయని ఎక్కువమంది అంచనా వేస్తున్నారు. అయితే ర్యాలీ విస్తృతస్థాయిలో ఉండకపోవచ్చని, కొన్ని స్టాకులకే పరిమితం కావచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్‌ సీరిస్‌లో ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగిన షేర్లపై ఒక విశ్లేషణ...
1.జిందాల్‌స్టీల్‌ అండ్‌ పవర్‌: నవంబర్‌ సీరిస్‌లో ఓఐ 9.6 శాతం పెరిగింది. ఇదే సమయంలో ధర 18 శాతం పెరిగింది. కంపెనీ గారెపల్మా కోల్‌బ్లాక్‌ను తాజా వేలంలో గెలుచుకోవడంతో ట్రేడర్లు ఈ షేరుపై బుల్లిష్‌గా మారారు. స్టాక్‌ సమీపంలో రూ.145 వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. రూ. 130 వద్ద షేరుకు మద్దతు ఉంది. 
2. ఇన్ఫోసిస్‌: నవంబర్‌ సీరిస్‌లో ఓఐ 4.8 శాతం, ధర 3.4 శాతం మేర పెరిగాయి. తమపై వచ్చిన అనైతిక ఆరోపణలకు సరైన సాక్ష్యాలు లేవంటూ కంపెనీ ప్రకటించడంతో ఈ షేరుపై ఇన్వెస్టర్ల మక్కువ పెరిగింది. గత నెల ఈ షేరు దాదాపు 13 శాతం పతనమైంది. తాజా ర్యాలీలో రూ. 730- 740 వరకు షేరు పెరగవచ్చని అంచనా.
3. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌: నవంబర్‌ సీరిస్‌లో ఓఐ 19.5 శాతం, ధర 7 శాతం పెరిగాయి. కంపెనీ క్యు2లో మంచి ఫలితాలు ప్రకటించడంతో షేరు కౌంటర్లో కొనుగోళ్లు పెరిగాయి. పలు బ్రోకరేజ్‌లు షేరుపై బుల్లిష్‌ అభిప్రాయంతో ఉన్నాయి. 
దిగువన పేర్కొన్న రెండు షేర్లలో ధర పెరిగి, ఓఐ తగ్గడం జరిగింది.
4. అపోలో టైర్స్‌: నవంబర్‌ సీరిస్‌లో ఈ షేరు 32.6 శాతం పెరిగింది. కానీ ఓఐ 2.5 శాతం మేర తగ్గింది. షేరు ఇటీవల కాలంలో బాగా ర్యాలీ జరపడంతో కొంత ప్రాఫిట్‌ బుకింగ్‌ జరుగుతోంది. షేరుకు రూ.180 వద్ద మద్దతు ఉందని, ఈ స్థాయిల్లో కొనుగోళ్లు జరపవచ్చని నిపుణుల సూచన. 
5. కాడిలా హెల్త్‌కేర్‌: నవంబర్‌ సీరిస్‌లో ఈ షేరు ధర దాదాపు 13 శాతం పెరిగింది. కానీ ఓఐ 4 శాతం తగ్గింది. షేరులో షార్ట్‌ పొజిషన్లు పెరుగుతున్నాయనేందుకు ఇది నిదర్శనంగా నిపుణులు భావిస్తున్నారు. కంపెనీ తాజాగా యూఎస్‌ నియంత్రణా సంస్థల నుంచి వార్నింగ్‌ లెటర్‌ అందుకుంది. ఈ నేపథ్యంలో రూ. 230 మద్దతు కోల్పోతే క్రమంగా 210-220 వరకు పతనం ఉండొచ్చని అంచనా.



You may be interested

యస్‌ బ్యాంక్‌ 9 శాతం అప్‌!

Tuesday 5th November 2019

ఈ ఏడాది చివరినాటికి 1 బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించనున్నామని యస్‌ బ్యాంక్‌ యాజమాన్యం ప్రకటించడంతో ఈ బ్యాంక్‌ షేరు గత కొన్ని సెషన్‌ల నుంచి కోలుకుంటుంది. అంతేకాకుండా సీనియర్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా బల్క్‌ డీల్‌లో భాగంగా రూ. 86.89 కోట్ల విలువైన 1.30 కోట్ల షేర్లు లేదా 0.51 శాతం వాటాను సోమవారం కొనుగోలు చేశారు. ఈ అంశం కూడా బ్యాంక్‌ షేరుపై సానుకూల ప్రభావాన్ని చూపడంతో

బలహీనపడిన రూపీ

Tuesday 5th November 2019

దేశీయ కరెన్సీ రూపీ డాలర్‌ మారకంలో మంగళవారం సెషన్‌లో 8 పైసలు బలహీనపడి 70.85 వద్ద ప్రారంభమైంది. కాగా యుఎస్‌-చైనా మధ్య పాక్షిక వాణిజ్య ఒప్పందం కుదురుతుందనే అంచనాలతో పాటు, విదేశీ నిధుల ఇన్‌ఫ్లో కొనసాగడంతో దేశీయ కరెన్సీ రూపీ డాలర్‌ మారకం‍లో గత సెషన్‌ ప్రారంభంలో బలపడింది. కానీ ప్రారంభ లాభాలు కోల్పోవడంతో స్వల్పంగా పెరిగి 70.77 వద్ద ముగిసింది. డాలర్‌ ఇండెక్స్‌ కీలక మద్ధతు స్థాయి 97

Most from this category