News


జనవరి సీరిస్‌లో ఓఐ పెరిగిన స్టాకులివే!

Monday 6th January 2020
Markets_main1578287623.png-30699

గత సీరిస్‌తో పోలిస్తే జనవరి డెరివేటివ్‌ సీరిస్‌లో ఓపెన్‌ఇంట్రెస్ట్‌(ఓఐ)లో భారీ మార్పులు వచ్చిన షేర్ల వివరాలు ఇలా ఉన్నాయి...
1. జుబిలాంట్‌ ఫుడ్‌వర్క్స్‌: జనవరి సీరిస్‌లో ఓఐ 35.8 శాతం, షేరు ధర 5.4 శాతం పెరిగింది. ఫుడ్‌టెక్‌ యాప్స్‌ నుంచి పోటీ తగ్గుతోంది. ఈ యాప్స్‌కు రెస్టారెంట్ల డీలిస్టింగ్‌తో ఇబ్బందులు వస్తున్నాయి. అలాగే కమీషన్ల విషయంలో కూడా పొసగడం లేదు. దీంతో వీటి నుంచి కంపెనీకి పోటీ తగ్గింది. ఇది డోమినాస్‌కు పాజిటివ్‌ అంశమని ఎడెల్‌వీజ్‌ అభిప్రాయపడింది. మోతీలాల్‌ఓస్వాల్‌ సైతం దీనిపై బుల్లిష్‌గా ఉంది. 
2. సన్‌టీవీ నెట్‌వర్క్‌: జనవరి సీరిస్‌లో ఓఐ 34.1 శాతం, షేరు ధర 5.4 శాతం తగ్గింది. ట్రాయ్‌ కొత్త నిబంధనలతో షేరులో బేరిష్‌ బెట్స్‌ పెరిగాయి. టెక్నికల్‌ చార్టుల్లో సైతం నెగిటివ్‌ ట్రెండ్‌ కనిపిస్తోంది. లోయర్‌ టాప్‌, లోయర్‌ బాటమ్స్‌ ఏర్పడడం నెగిటివ్‌ సంకేతం. పైస్థాయిలో రూ.445 వద్ద నిరోధం ఎదురవుతుంది. దిగువన రూ.410 వద్ద మద్దతు దొరకవచ్చు.
3. ఐఓసీ: జనవరి సీరిస్‌లో ఓఐ 19.8 శాతం, షేరు ధర 1.4 శాతం పెరిగింది. లాంగ్‌ అన్‌వైండింగ్‌ జరుగుతున్నట్లు కనిపిస్తోంది. చమురు ధరలు పెరగడం కంపెనీకి నెగిటివ్‌ అంశం. మధ్యకాలానికి ఈ ఒత్తిడి కొనసాగవచ్చు. రూ. 120 వద్ద మద్దతు లభిస్తుందని నిపుణుల అంచనా. పైన రూ. 135 వద్ద నిరోధం ఉంది. 
4. టైటాన్‌: జనవరి సీరిస్‌లో ఓఐ 16.9 శాతం, షేరు ధర 4.4 శాతం తగ్గింది. షేరులో షార్ట్స్‌ పెరిగాయి. డిసెంబర్‌ విక్రయాలు తగ్గడం స్వల్పకాలిక నెగిటివ్‌ ప్రభావం చూపుతుంది. మార్కెట్లో డిమాండ్‌ మందకొడిగా ఉన్నందున రెవెన్యూలు క్యు3లో స్తబ్దుగా ఉండొచ్చని అంచనా.
5. అపోలో హాస్పిటల్‌: జనవరి సీరిస్‌లో ఓఐ 16.4 శాతం తగ్గగా, షేరు ధర 7.7 శాతం పెరిగింది. కంపెనీకి చెందిన హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ విభాగంలో హెచ్‌డీఎఫ్‌సీ వాటాలు కొనుగోలు చేయనుందన్న వార్తలు కౌంటర్లో షార్ట్‌కవరింగ్‌కు దారితీశాయి. ఎస్‌ఏపీ వ్యాపార పునర్వ్యస్థీకరణతో మరింత రెవెన్యూ వస్తుందని మోర్గాన్‌స్టాన్లీ అంచనా వేస్తోంది. You may be interested

ఆకాశాన్నంటిన బంగారం ధర

Monday 6th January 2020

రెండురోజుల్లో రూ.1800లు పెరిగిన బంగారం కలిసొచ్చిన ఇరాన్‌ - అమెరికా ఉద్రిక్తతలు  దేశీయ బులియన్‌ మార్కెట్లో బంగారం ధర సోమవారం మరోసారి ఆకాశానికి ఎగసింది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర నేటి ఉదయం సెషన్‌లో ఏకంగా రూ.984లు లాభపడింది. ఉదయం గం.10:15ని.లకు రూ.890ల లాభంతో రూ.41012 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇరాన్‌ - అమెరికా ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 36డాలర్లు ర్యాలీ చేసి ఏడేళ్ల గరిష్టాన్ని అందుకోవడం,

నష్టాల మా‍ర్కెట్లోనూ ఈ షేర్లు రయ్‌రయ్‌

Monday 6th January 2020

డిష్‌మన్‌ కార్బొజెన్‌ టైటన్‌ కంపెనీ సవేరా ఇండస్ట్రీస్‌ ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో ఉదయం 10 ప్రాంతంలో సెన్సెక్స్‌ 448 పాయింట్లు పతనమైంది. 41,016కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 140 పాయింట్లు దిగజారి 12,087 వద్ద ట్రేడవుతోంది. అయితే విభిన్న వార్తల కారణంగా పతన మార్కెట్లోనూ కొన్ని కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వీటిలో బ్లూచిప్‌ కంపెనీ టైటన్‌తోపాటు..

Most from this category