News


గురువారం వార్తల్లోని స్టాక్స్‌

Thursday 2nd January 2020
Markets_main1577937994.png-30606

కొత్త ఏడాది(2020) ప్రారంభం​సందర్భంగా అమెరికా, యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు సెలవుల్లో కొనసాగుతున్నాయి. అయితే ఆసియాలో జపాన్‌ మినహా మిగిలిన మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ఏడాదిన్నర కాలంగా నలుగుతున్న వాణిజ్య వివాదాల పరిష్కారానికి వీలుగా ఈ నెల 15న చైనాతో​ ప్రాథమిక ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు అమెరికన్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పేర్కొనడంతో సెంటిమెంటు మెరుగుపడింది. దీంతో చైనాసహా పలు ఆసియా మార్కెట్లు 1.3-0.3 శాతం మధ్య ఎగశాయి. దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం సానుకూలం‍గా కదిలే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు విభిన్న వార్తల ఆధారంగా యాక్టివ్‌గా కదిలే వీలున్న కంపెనీల వివరాలివి....

టాటా మోటార్స్‌
దేశీ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్‌ వాహన అమ్మకాలు డిసెంబర్‌(2019) నెలలో దాదాపు 14 శాతం క్షీణించి 46,903 యూనిట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం అంటే 2018 డిసెంబర్లో కంపెనీ 54,439 వాహనాలను విక్రయించింది.

ఐషర్‌ మోటార్స్‌
దేశీ ఆటో రంగ కంపెనీ ఐషర్‌ మోటార్స్‌(VECV) వాహన అమ్మకాలు డిసెంబర్‌(2019) నెలలో 19 శాతం క్షీణించి 5,042 యూనిట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం అంటే 2018 డిసెంబర్లో కంపెనీ 6,236 వాణిజ్య వాహనాలను విక్రయించింది.

జేబీఎం ఆటో
అనుబంధ సంస్థలు జేబీఎం ఆటో సిస్టమ్‌, జేబీఎం ఎంఏ ఆటోమోటివ్‌లను జనవరి 1 నుంచి కంపెనీలో విలీనం చేసుకున్నట్లు ఆటో విడిభాగాల కంపెనీ జేబీఎం ఆటో లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది.

ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌
రానున్న ఐదేళ్ల కాలంలో స్థిరమైన సరఫరాలకు వీలుగా దీర్ఘకాలిక కోల్‌ లింకేజెస్‌ను పొందినట్లు ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌ తెలియజేసింది. తద్వారా ఐదో ‍స్పాంజ్‌ ఐరన్‌ యూనిట్‌ కోసం వార్షికంగా 1.69 ఎంటీ బొగ్గు సరఫరాలను పొందనున్నట్లు తెలియజేసింది. 

అబాన్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌
లైఫ్‌సర్జ్‌ బయోసైన్సెస్‌ కంపెనీలో పూర్తి(100 శాతం) ఈక్విటీ కొనుగోలును నగదు చెల్లింపు ద్వారా పూర్తి చేసినట్లు అబాన్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తాజాగా పేర్కొంది.

ముత్తూట్‌ కేపిటల్‌ సర్వీసెస్‌
రూ. 145.4 కోట్లమేర సెక్యూరిటైజేషన్‌ లావాదేవీని 2019 డిసెంబర్‌ 31కల్లా పూర్తి చేసినట్లు ఎన్‌బీఎఫ్‌సీ.. ముత్తూట్‌ కేపిటల్‌ సర్వీసెస్‌ వెల్లడించింది.
 

వా టెక్‌ వాబాగ్‌
గంగా ప్రక్షాళన పథకంలో భాగంగా బీహార్‌ ప్రభుత్వం నుంచి రూ. 1187 కోట్ల విలువైన కాంట్రాక్టు లభించినట్లు ఇంజినీరింగ్‌ దిగ్గజం వా టెక్‌ వాబాగ్‌ పేర్కొంది.

సన్‌ టీవీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌
టెలికం నియం‍త్రణ సంస్థ ట్రాయ్‌ తాజాగా కేబుల్‌ టీవీ టారిఫ్‌లను సవరించింది. దీనిలో భాగంగా కేబుల్‌ ఆపరేటర్లు రూ. 153 కనీస ధరపై 200 చానళ్లను అందించవలసి ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేడు సన్‌ టీవీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, డిష్‌ టీవీ తదితరాలు యాక్టివ్‌గా ట్రేడ్‌కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.You may be interested

జువెలర్స్‌కు ఐటీ రికవరీ నోటీసులు

Thursday 2nd January 2020

దేశవ్యాప్తంగా పలు జువెలరీ సంస్థలకు ఆదాయపన్ను శాఖ రికవరీ నోటీసులు జారీ చేసింది. 2016-17 కాలంలో నోట్ల రద్దు తర్వాత చేసిన డిపాజిట్లకు సంబంధించి ఐటీ శాఖ ఈ నోటీసుల్లో రికవరీలు చెల్లించాలని ఆదేశించిందని బిజినెస్‌ స్టాండర్డ్‌ ఒక నివేదికలో పేర్కొంది. అయితే కొన్ని నెలలుగా డిమాండ్‌ స్తబ్దుగా ఉండడంతో జువెలరీ సంస్థల రెవెన్యూ అంతంతమాత్రంగా ఉంది. ఈ సమయంలో జరిమానాలు చెల్లించడం పలు జువెలరీ సంస్థలకు సాధ్యం కాకపోవచ్చని

‘నల్లబంగారం’ ఇక జిగేల్‌!

Thursday 2nd January 2020

వేగం పుంజుకోనున్న బొగ్గు ఉత్పత్తి... వచ్చే ఐదేళ్లలో వేలానికి 200 బొగ్గు బ్లాకులు ప్రైవేటు రంగానికి భారీ అవకాశాలు... 2024 నాటికి దిగుమతులకు చెక్‌... న్యూఢిల్లీ: దేశంలో అపారంగా బొగ్గు నిక్షేపాలు ఉండి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. కోల్‌ ఇండియా ఒక్కటీ దేశ అవసరాల్లో అధిక శాతం తీరుస్తోంది. అయినా, అవసరానికంటే ఉత్పత్తి తక్కువగానే ఉంటోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు, దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచడం ద్వారా దిగుమతుల భారానికి కళ్లెం వేసేందుకు ప్రైవేటు

Most from this category