News


బుధవారం వార్తల్లో షేర్లు(1-1-20)

Wednesday 1st January 2020
Markets_main1577850977.png-30578

కొత్త ఏడాది సందర్భంగా దాదాపు ప్రపంచ స్టాక్‌ మార్కెట్లన్నీ సెలవులో కొనసాగుతున్నాయి. దీంతో నేడు దేశీయంగా యాక్టివిటీ తక్కువగా నమోదయ్యే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కొన్ని కంపెనీల కౌంటర్లు వార్తల కారణంగా ట్రేడర్లను, ఇన్వెస్టర్లను ఆకట్టుకునే వీలున్నట్లు చెబుతున్నారు. తాజాగా వార్తలలో నిలిచిన ఆయా కంపెనీల వివరాలు చూద్దాం..

యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌
వాహత్‌ అల్‌ అమన్‌ హోమ్‌ హెల్త్‌కేర్‌లో వాటా కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఆరోగ్యపరిరక్షణ రంగ కంపెనీ యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ పేర్కొంది. దీనిలో భాగంగా ఈ హెల్త్‌కేర్‌ కంపెనీలో 100 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు యాస్టర్‌ డీఎం తెలియజేసింది.

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌
ప్రిఫరెన్షియల్‌ కేటాయింపుల ద్వారా రూ. 676 కోట్లను సమీకరించినట్లు ప్రయివేట్‌ రంగ సంస్థ ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ తెలియజేసింది. తద్వారా మొత్తం రూ. 2701 కోట్లను సమకూర్చుకున్నట్లు వివరించింది. షేరుకి రూ. 340.70 ధరలో 1.98 కోట్ల షేర్లను కేటాయించినట్లు వెల్లడించింది. 

స్కిప్పర్‌ లిమిటెడ్‌
కంపెనీ దీర్ఘకాలిక బ్యాంక్‌ సౌకర్యాల(రుణ చెల్లింపు సామర్థ్యం) రేటింగ్‌ను.. రేటింగ్‌ సంస్థ కేర్‌ డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు స్కిప్పర్‌ లిమిటెడ్‌ పేర్కొంది. గతంలో ఇచ్చిన ప్రతికూల ఔట్‌లుక్‌తో కూడిన A రేటింగ్‌ను తాజాగా స్థిరత్వంతో కూడిన BBB+గా సవరించినట్లు తెలియజేసింది. 

యస్‌​బ్యాంక్‌
బ్యాంక్‌కు చెందిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్ల రేటింగ్‌ను కేర్‌ డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ పేర్కొంది. గతంలో ఇచ్చిన A+ క్రెడిట్‌ వాచ్‌ డెవలపింగ్‌ రేటింగ్‌ను తాజాగా A ప్రతికూల ఔట్‌లుక్‌గా సవరించినట్లు తెలియజేసింది.

స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌
కంపెనీ ప్రమోటర్లు డిసెంబర్‌ 31కల్లా రూ. 1,000 కోట్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ పేర్కొంది. మిగిలిన రూ. 1644 కోట్ల రుణాలను సైతం రానున్న మూడు త్రైమాసికాలలో చెల్లించనున్నట్లు తెలియజేసింది.

బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌
ఈ నెల 6న కంపెనీ బోర్డు సమావేశంకానున్నట్లు ప్రయివేట్‌ రంగ సంస్థ బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ వెల్లడించింది. నిధుల సమీకరణకు వీలుగా మార్పిడి రహిత డిబెంచర్లు, తదితర సెక్యూరిటీల జారీ అంశాన్ని బోర్డు చర్చించనున్నట్లు తెలియజేసింది.



You may be interested

కొత్త ఏడాది తొలిరోజున శుభారంభం

Wednesday 1st January 2020

బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు 12200 పైన ప్రారంభమైన నిఫ్టీ  కొత్త ఏడాది తొలిరోజున భారత మార్కెట్‌ శుభారంభం చేసింది. నూతన సంవత్సరానికి సూచీలు లాభాలతో స్వాగతం పలికాయి. అన్ని రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బుధవారం సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 96 పాయింట్లు లాభంతో 41349 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 12200పై 12,202.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు

0.9 శాతానికి తగ్గిన కరెంటు ఖాతా లోటు

Wednesday 1st January 2020

ముంబై: జీడీపీలో కరెంటు ఖాతా లోటు (క్యాడ్‌) సెప్టెంబర్‌ త్రైమాసికంలో 0.9 శాతానికి (6.3 బిలియన్‌ డాలర్లు) తగ్గినట్టు ఆర్‌బీఐ తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి క్యాడ్‌ 2.9 శాతంగా ఉండడం గమనార్హం. విదేశీ మారకం రూపంలో నిధుల రాక, పోకల మధ్య అంతరాన్ని క్యాడ్‌గా పేర్కొంటారు. వాణిజ్య లోటు తక్కువగా 38.1 బిలియన్‌ డాలర్లుగా ఉండడమే క్యాడ్‌ తగ్గేందుకు తోడ్పడినట్టు ఆర్‌బీఐ తెలిపింది. మరి క్రితం

Most from this category