News


200-డీఎంఏ పైన 200 షేర్లు..

Thursday 6th December 2018
Markets_main1544086511.png-22701

ముంబై: అనేక షేర్లలో ర్యాలీ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు పలువురు టెక్నికల్‌ అనలిస్టులు సూచిస్తున్నారు. ఇక మూవింగ్‌ యావరేజ్‌ (సగటు కదలికల) ఆధారంగా దాదాపు 300 షేర్లలో బలమైన ర్యాలీకి అవకాశం ఉందని చార్ట్‌వ్యూ ఇండియా డాట్‌ ఇన్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రేడింగ్‌ అడ్వైజరీ చీఫ్‌ స్ట్రాటజిస్‌ మజర్‌ మహ్మద్‌ వెల్లడించారు. 800 షేర్లు 50-రోజుల సగటు కదలికల పైన ఉండగా.. మరో మూడు వందల షేర్లు 200-రోజుల సగటు కదలికల ఎగువకు చేరినట్లు వివరించారు. వీటిలో 245 షేర్లు 50-డీఎంఏను, 200-డీఎంఏకు పైన చేరుకుని ఇన్వెస్టర్లకు ఆకర్షణీయ రాబడిని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు. 3ఎం ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, ఎల్ అండ్ టీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, లూపిన్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హవెల్స్ ఇండియా ఈ జాబితాలో ఉండగా.. సూచీల పరంగా నిఫ్టీ, నిఫ్టీ100, నిఫ్టీ ‍బ్యాంక్‌, నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంకులు బలాన్ని సూచిస్తున్నట్లు వివరించారు. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు 200-డీఎంఏను, యాక్టీవ్‌ ట్రేడర్లు 50-డీఎంఏను పరిశీలించడం ద్వారా రాబడిని పొందవచ్చన్నారు. సగటు కదలికలతో పాటు ట్రెండ్‌ను నిర్ధారించుకోవడం కోసం ఆర్‌ఎస్‌ఐ వంటి సంబంధిత కొలమానాలను చూడమని సూచించారు. You may be interested

రెండంకెల్లో నిఫ్టీ కంపెనీల లాభాల వృద్ధి..!

Thursday 6th December 2018

హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ సీఐఓ ప్రశాంత్ జైన్ వ్యాఖ్య ముంబై: కార్పొరేట్ బ్యాంకులు రికవరీ సాధిస్తుండడం, నూతన మొండి బకాయిల తగ్గుదల ఆధారంగా వచ్చే కొన్నేళ్లలోనే నిఫ్టీ ఎర్నింగ్స్‌ షార్ప్‌ రికవరీని సాధించే అవకాశం ఉందని ప్రశాంత్ జైన్ అన్నారు. నాలుగేళ్ల బలహీన లాభదాయకత తరువాత.. నిఫ్టీ ఈపీఎస్‌ వృద్ధి రేటు రెండంకెల స్థాయిలో ఉండనుందని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దాదాపు రూ.75,000 కోట్ల ఆస్తుల

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌: స్మార్ట్‌ఫోన్లపై అదిరే ఆఫర్లివే..

Thursday 6th December 2018

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌.. బిగ్‌ షాపింగ్‌ డేస్‌లో భాగంగా పలు స్మార్ట్‌ఫోన్లపై మంచి ఆఫర్లను ప్రకటించింది. అవేంటో చూద్దాం..  ♦ రియల్‌ మి 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను రూ.13,990కే పొందొచ్చు. ♦ ఒప్పొ ఎఫ్‌9 (4జీబీ)పై అదనంగా రూ.1,500 డిస్కౌంట్‌ అందిస్తోంది.  ♦ శాంసంగ్‌ ఆన్‌8ను రూ.12,990కే పొందొచ్చు. ♦ పోకో ఎఫ్‌1.. రూ.19,999లకు అందుబాటులో ఉంది.  ♦ మోటొరొలా వన్‌ పవర్‌ (64 జీబీ) ధర ఇప్పుడు రూ.14,999గా ఉంది. రూ.4,000 డిస్కౌంట్‌లో వస్తోంది.  ♦ నోకియా 5.1 ప్లస్‌పై రూ.3,200 డిస్కౌంట్‌ పొందొచ్చు. ♦ శాంసంగ్‌

Most from this category