News


నేటి వార్తల్లోని షేర్లు

Monday 3rd February 2020
Markets_main1580705581.png-31462


వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం షేర్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు

ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, అఫ్లే ఇండియా: జీఎస్‌కే ఫార్మా, ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, అఫ్లే ఇండియా, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, హడ్కో, ఎంఆర్‌పీఎల్‌, షాల్బీ, ఎస్‌ఆర్‌ఎఫ్‌, టాటా కెమికల్స్‌ మొదలైన కంపెనీలు మూడో త్రైమాసిక ఫలితాలను ఈ రోజు ప్రకటించనున్నాయి.

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌: పారిశ్రామిక వర్గాలు వెల్లడించిన వివరాలకు మేరకు జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కంపెనీ ఒడిషాలోని నారాయణ్‌ పోషి కంపెనీకి సంబంధించిన 980 టన్నుల ఐరన్‌, ఓర్‌ నిల్వలున్న రెండు గనులను వేలంలో సొంతం చేసుకుంది.

శోభా: ప్రముఖ రియాలిటీ కంపెనీ శోభా కన్సాలిడేటెడ్‌ నికర లాభం 5 శాతం పెరిగి, రూ.73.2 కోట్లకు చేరింది.గతేడాది ఈ త్రైమసికంలో కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.70 కోట్లుగా ఉంది.

టెక్‌ మహింద్రా ఈ కంపెనీ క్యూ3 నికర ఆదాయం 5.1 శాతం పెరిగి 130 కోట్లకు చేరింది.



You may be interested

ఐటీసీ సిగరెట్ల ధరలు పెంచాల్సిందే!

Monday 3rd February 2020

తప్పదంటున్న బ్రోకరేజ్‌లు బడ్జెట్లో సిగరెట్లపై అధిక లెవీలను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించడం ఐటీసీ షేరుపై  నెగిటివ్‌ ప్రభావం చూపింది. శనివారం ఒక్కమారుగా ఐటీసీ షేరు దాదాపు 10 శాతం వరకు పడిపోయి కీలక 220 రూపాయిల దిగువకు వచ్చింది. ఈ ప్రభావం సోమవారం కూడా కొనసాగి షేరు మరో 5 శాతం వరకు పతనమై రూ.205 కనిష్ఠాలను తాకింది. ఐటీసీ లాభాల్లో సిగిరెట్‌ వ్యాపారం కీలకమైనది,

గార్డెన్‌ రీచ్‌ పతనం- థైరోకేర్‌ జూమ్‌

Monday 3rd February 2020

క్యూ3 ఫలితాల ప్రభావం 12 శాతం పడిన గార్డెన్‌ రీచ్‌ 4 శాతం జంప్‌చేసిన థైరోకేర్‌ ఊగిసలాట మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు వెనువెంటనే జోరందుకున్నప్పటికీ తిరిగి డీలాపడ్డాయి. స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య అటూఇటుగా కదులుతున్నాయి. ఉదయం 9.50 ప్రాంతంలో సెన్సెక్స్‌ 18 పాయింట్లు క్షీణించి 39,717కు చేరగా.. నిఫ్టీ 14 పాయింట్లు బలపడి 11,676 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో

Most from this category