News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 31st October 2019
news_main1572495741.png-29252

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ‍ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 

బంధన్‌ బ్యాంక్‌:- విలీన పథకంలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ బ్యాంక్‌ 9.89శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీకి 15.93 కోట్ల ఈక్విటీ షేర్లను బదిలీ చేసినట్లు బ్యాంకు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది.

వోడాఫోన్‌ ఐడియా:- 14 బిలియన్‌ డాలర్ల నికర రుణం, పెరుగుతున్న నష్టాలు, క్షీణిస్తున్న చందదారులు లాంటి సమస్యల పరిష్కారానికి రుణదాతులతో సమావేశం జరుపుతునట్లు తెలుస్తోంది. 

జీ లిమిటెడ్‌:- సంస్థలలో అదనపు వాటా అమ్మకాలకు సంబంధించిన సమాచారం లేకపోవడంతో రుణదాతలు ఎస్సెల్‌ గ్రూప్‌ ప్రమోటర్లపై అనుమానాలు వ్యక్తం చేశారు. లావాదేవీ పూర్తయ్యే వరకు ఎస్క్రో ఖాతాలో ప్రమోటర్ వాటాను పార్క్ చేయాలనే ప్రతిపాదన తొలిగించారు.

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌:- స్టాండర్డ్‌ లైఫ్‌ ఈ కంపెనీలో  4.95శాతం వాటాకు సమానమైన 10 కోట్ల ఈక్విటీ షేర్లను ఓపెన్‌ మార్కెట్‌ పద్దతిలో ప్రతి షేరు ధర రూ.575.15లు చొప్పున విక్రయించింది.
భెల్‌ లిమిటెడ్‌:- కేంద్రం కంపెనీలో వాటాను విక్రయించి వ్యాల్యూను అన్‌లాక్‌ చేయడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పలు బ్రోకరేజ్‌ సంస్థలు ఈ షేర్ల రేటింగ్‌ను ‘‘సెల్‌’’ నుంచి ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించాయి.
ఐసీఐసీఐ లాంబార్డ్‌:- బీమా ఉత్పత్తుల అమ్మకం కోసం కరూర్ వైశ్యా బ్యాంక్‌తో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఐసీఐసీఐ లాంబార్డ్ తెలిపింది.
క్వెస్‌ కార్ప్‌:- తన అనుబంధ సంస్థ వేదాంగ్‌ సెల్యూలార్‌ సర్వీసెస్‌లో వాటాను 18.71శాతానికి పెంచుకునేందుకు బోర్డు ఆమోదం తెలిపినట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది.
టీవీఎస్‌ మోటర్‌:- సెంట్రల్‌ అమెరికాలో అమ్మకాలను పెంచుకునే ఎత్తుగడలో భాగంగా కంపెనీ కాడిసా గ్రూప్‌తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- దేశవ్యాప్తంగా ఇండియా ఫైబర్ ఇన్విట్, జియో డిజిటల్ ఫైబర్ యొక్క నియంత్రణ వాటా కోసం మార్క్ ఫైనాన్షియల్ ఇన్వెస్టర్ల బృందం, సావరిన్ వెల్త్ ఫండ్ల మధ్య చర్చలు నిలిచిపోయినట్లు కనిపిస్తోంది. 
నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించనున్న కొన్ని ప్రధాన కంపెనీలు:- ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌, ధనలక్ష్మీ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌, బ్లూ డార్క్‌, తిరుమలై కెమికల్స్‌.You may be interested

ఎస్‌బీఐపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Thursday 31st October 2019

సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం ఎస్‌బీఐ షేరుపై పలు బ్రోకరేజ్‌లు పాజిటివ్‌ ధృక్పధాన్ని వెలిబుచ్చుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరకు బ్యాంకు స్లిపేజ్‌లు కట్డడి చెందుతాయని అంచనా వేస్తున్నాయి.  సీఎల్‌ఎస్‌ఏ: అధిక రేట్లు ఆఫర్‌ చేయకుండానే బ్యాంకు మార్కెట్‌వాటా కొల్లగొడుతోంది. డిజిటల్‌ ప్లా్‌ట్‌ఫామ్స్‌ ఇతర బ్యాంకులతో పోలిస్తే ముందుంది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే బ్యాంకు ఎర్నింగ్స్‌ రికవరీ ఆరంభమవుతుంది. సేవింగ్స్‌ డిపాజిట్స్‌ వృద్ధి 7 శాతానికి చేరడం విశేషం. పీఎస్‌యూ బ్యాంకుల్లో

12 పైసలు బలపడిన రూపీ

Thursday 31st October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో గురువారం సెషన్‌లో 12 పైసలు బలపడి 70.77 వద్ద ప్రారంభమైంది. కాగా ఫెడ్‌ వడ్డీ రేట్ల నిర్ణయానికి ముందు ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించారు. ఫలితంగా గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 5 పైసలు బలహీనపడి 70.89 వద్ద ముగిసింది. ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ బుధవారం వడ్డీ రేట్లను 25 బేసిష్‌ పాయింట్లను తగ్గించింది. దీంతో వడ్డీ రేటు  2 శాతం నుంచి

Most from this category