News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 17th July 2019
Markets_main1563336474.png-27111

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
పంజాజ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌:-
ఏడాది కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్‌పై వడ్డీరేట్లను 8.70శాతానికి పెంచింది. జూన్‌ 16 నుంచి సవరించిన వడ్డీరేట్ల అమల్లోకి రానున్నాయి. 
ఐఎల్‌ఎఫ్‌సీ ఇంజనీరింగ్స్‌:- ఆడిట్‌ ఫీజు పేమెంట్‌ చెల్లింపు విఫలమవడంతో బీఎస్‌ఆర్‌ అండ్‌ అసోసియేట్స్‌ అడిటర్‌ సంస్థ రాజీనామా పత్రాన్ని సమర్పించింది. 
ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్స్‌:- కార్పొరేట్ పాలన లోపం గురించి రాకేష్‌ గంగ్వాల్‌ లేవనెత్తిన ఆరోపణలపై కార్పోరేషన్‌ మంత్రిత్వశాఖ వివరణ కోరింది. 
మనక్షియా:- కంపెనీ చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసరుగా భరత్‌ బెగ్వానీ నియమితులయ్యారు.
ఆస్ట్రాన్‌ పేపర్స్‌ అండ్‌ బోర్డ్‌ మిల్‌:- విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగడంతో గుజరాత్లోని హల్వాడ్ ప్లాంట్‌ను వారంరోజుల పాటు మూసివేస్తున్నట్లు తెలిపింది.
కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక‌్షన్స్‌:- నవయుగ ఇంజనీరింగ్స్‌ కంపెనీ  నుంచి రూ.874.34 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.
కేఆర్‌బీఎల్‌:- రూ.700 కోట్ల వాణిజ్య పేపర్లపై కేర్‌ రేటింగ్స్‌ సంస్థ నెగిటివ్‌ రేటింగ్‌ కేటాయించింది.
క్విక్‌ హీల్‌ టెక్నాలజీస్‌:- కంపెనీ స్వతంత్ర డైరెక్టర్‌గా అమితాబ్‌ ముఖేష్‌పాండియన్ నియమితులయ్యారు. 
అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌:- అన్‌సెక్యూర్డ్‌ నోట్ల జారీ ద్వారా 650 కోట్ల మిలియన్‌ డాలర్లను సమీకరిస్తున్నట్లు తెలిపింది. 
నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు: విప్రో, యస్‌ బ్యాంక్‌, మైండ్‌ ట్రీ, మీనన్‌ బేరింగ్స్‌, డీఎఫ్‌ఎం ఫుడ్స్‌, ధనలక్ష్మీ బ్యాంక్‌, ఆదిత్యా బిర్లా మనీ, టాటా ఎలాక్సీ, సీఈఎల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీ.



You may be interested

భారీ పతనం తర్వాత స్థిరంగా చమురు

Wednesday 17th July 2019

అమెరికా చమురు నిల్వలు అంచనాల కంటే తక్కువ పడిపోవడంతో పాటు, అమెరికా ఇరాన్‌ మధ్య ఘర్షణ వాతవారణం కారణంగా చమురు  ధరలు బుధవారం ట్రేడింగ్‌లో(జులై 17) స్థిరంగా ఉన్నాయి.  బెంచ్‌మార్క్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 0.3 శాతం పెరిగి బ్యారెల్‌కు 64.51 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 1 శాతం పెరిగి బ్యారెల్‌కు 57.63 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. గత సెషన్‌లో డిమాండ్‌ భయాల కారణంగా బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 3.2

పాజిటివ్‌ ఓపెనింగ్‌

Wednesday 17th July 2019

అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా వున్నా, బుధవారం భారత్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. ఇలా పాజిటివ్‌ ప్రారంభాన్నివ్వడం వరుసగా ఇది మూడో రోజు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 40 పాయింట్ల లాభంతో 39,141 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 11,670 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. యూపీఎల్‌, జీ టెలిఫిల్మ్‌, కోటక్‌బ్యాంక్‌, టెక్‌ మహింద్రా, ఆసియన్‌ పెయింట్స్‌ షేర్లు 1-2 శాతం మధ్య లాభాలతో మొదలయ్యాయి. మరోవైపు గెయిల్‌, టాటా

Most from this category