News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 18th July 2019
Markets_main1563422581.png-27136

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
మైండ్‌ ట్రీ:-
నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ అనిల్‌ కుమార్‌ మణిభాయ్‌ నాయక్‌ ఎన్నికయ్యారు. 
పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌:- భూషణ్‌ పవర్‌ రూ.238 కోట్లను మోసానికి పాల్పడినట్లు ఆర్‌బీఐకు సమాచారం ఇచ్చింది.
యాక్సిస్‌ బ్యాంక్‌:- తాత్కలిక నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా సంజీవ్‌ మిశ్రా నియమానికి రద్దు చేశారు. ఆయన స్థానంలో రాకేష్‌ మఖిజా పదవి బాధ్యతలు స్వీకరించవచ్చు.
సుజ్లాన్‌ ఎనర్జీ:- కంపెనీ రుణాల పరిష్కారానికి సంపూర్ణంగా కృషి చేస్తున్నట్లు తెలిపింది. అందులో భాగంగా షేర్‌ హోల్డర్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.
ఫస్ట్‌సోర్స్‌ సెల్యూషన్స్‌:- కంపెనీ ఎండీ, సీఈఓగా విపుల్‌ కన్నా నియమితులయ్యారు. 
దివాన్‌ హౌజింగ్‌:- ఈనెల 16లోపు ఎన్‌సీడీలపై రూ.23.75 కోట్ల వడ్డీ చెల్లింపులో విఫలమైంది.
ఎన్‌ఎండీసీ:- కర్నాటకలోని దోనిమలై గనిలో దాదాపు 8 నెలల తర్వాత ఇనుప ఖనిజం తవ్వకాలను తిరిగి ప్రారంభించింది.
స్ట్రైడ్స్‌ ఫార్మా:- పుదుచ్చేరి ప్లాంట్‌కు సంబంధించి యూఎస్‌ఎఫ్‌డీఏ వార్నింగ్‌ లెటర్‌ను జారీ చేసినట్లు తెలిపింది.
నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- ఏసీసీ, సియెంట్‌, జీకేడబ్ల్యూ, సన్‌కో ఇండస్ట్రీస్‌, డీబీ కార్పో, ఉత్తమ్‌ గాల్వా స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌, హాట్సన్‌ అగ్రో ప్రాడెక్ట్స్‌, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌, 8కె మైల్స్‌ సాఫ్ట్‌వేర్‌ సర్వీసెస్‌, ర్యాలీస్‌ ఇండియా, కాల్గేట్‌ పాలిమోలివ్‌, సస్కేన్‌ టెక్నాలజీస్‌, ట్రిడెంట్‌, ఇన్ఫీబీన్స్‌ టెక్నాలజీస్‌.You may be interested

తగ్గిన చమురు

Thursday 18th July 2019

డిమాండ్‌ సీజన్‌లో కూడా చమురు డిమాండ్‌ బలహీనంగా ఉండడంతో పాటు, అమెరికా చమురు ఉత్పత్తి తిరిగి గాడిలో పడడంతో గురువారం ట్రేడింగ్‌లో చమురు ధరలు నష్టాల్లో ఉన్నాయి. వీటితో పాటు గత వారం గ్యాసోలిన్‌ ఉత్పత్తి పెరగడంతో  బ్రెంట్‌ క్రూడ్‌ 0.2 శాతం నష్టపోయి బ్యారెల్‌కు 63.51 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.5 శాతం తగ్గి  బ్యారెల్‌కు 56.52 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. గత సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌

నెగిటివ్‌ ఓపెనింగ్‌

Thursday 18th July 2019

ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతల కారణంగా గురువారం భారత్‌ సూచీలు స్వల్పనష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 11 పాయింట్ల నష్టంతో 39,204 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12 పాయింట్ల నష్టంతో 11,675 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. క్రితం రోజు ఆర్థిక ఫలితాల్ని వెల్లడించిన విప్రో ట్రేడింగ్‌ ప్రారంభంలో 2.5 శాతం గ్యాప్‌అప్‌తో ప్రారంభంకాగా, యస్‌బ్యాంక్‌ 9 శాతం పతనమయ్యింది. 

Most from this category