News


నేటి వార్తల్లోని షేర్లు

Wednesday 4th March 2020
Markets_main1583299112.png-32265

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు 

ఎన్‌బీసీసీ: జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను సొంతం చేసుకునేందుకు ఎన్‌బీసీసీ తీర్మానం చేసిన ప్రణాలికను నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యూనల్‌ ఆమోదించింది. జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ మాతృ సంస్థ జయప్రకాశ్‌ అసోసియేట్స్‌ సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో జమ చేసిన రూ.750 కోట్లు తీర్మాన ప్రణాళికలో భాగంగా ఉండాలని ఆదేశించింది.

యునైటెడ్‌ బ్రూవరీస్‌: విజయ్‌ మాల్యా చెల్లించాల్సిన మొత్తంలో  కొంత మేర రికవరీ చేసేందుకు యూనైటెడ్‌ బ్రూవరీస్‌లో 2.8 శాతం వాటాను బీర్ల తయారీ అతిపెద్ద హెన్‌కైన్‌ కంపెనీకీ విక్రయించేందుకు  ఎస్‌బీఐ నేతృత్వంలోని రుణదాతలు ప్రణాళికను సిద్ధం చేశారు.

యస్‌బ్యాంక్‌: 300-500 డాలర్ల నిధులను సమీకరించేందుకు యస్‌ బ్యాంక్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ను సంప్రదించనుంది.

ఎల్‌అండ్‌టీ: విద్యుత్‌ ప్రసారం, ఉద్యోగాల పంపిణీకోసం ఎల్‌అండ్‌ టీ కంపెనీ రూ.1,000-2,5000 కోట్ల ఆర్డర్లను పొందినట్లు కంపెనీ తెలిపింది.

సన్‌ఫార్మా: సన్‌పార్మాకు చెందిన 19.8 లక్షల షేర్లను బహిరంగ మార్కెట్‌లో  ప్రమోటింగ్‌ కంపెనీ  షంగ్వీ ఫైనాన్స్‌ కొనుగోలు చేసింది.

వేదాంత: వేదాంత రీసోర్సెస్‌ లిమిడెట్‌ కార్పొరేట్‌ ఫ్యామిలీ రేటింగ్‌(సీఎఫ్‌ఆర్‌)ను మూడీస్‌ సంస్థ B1 నుంచి  Ba3కు తగ్గించింది. 



You may be interested

ఆందోళనలకు త్వరలో చెక్‌- నిఫ్టీ రీబౌండ్‌

Wednesday 4th March 2020

కరోనా వైరస్‌ వ్యాప్తితో ఇన్వెస్టర్లలో పెరిగిన ఆందోళనలు నెల రోజుల్లో 15 శాతం పతనమైన ప్రపంచ మార్కెట్లు నెల- రెండు నెలల్లో మార్కెట్లు రికవరీ బాట పట్టే చాన్స్‌ ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనాలు చైనాలో పుట్టినప్పటికీ కొవిడ్‌-19.. ప్రపంచాన్ని వణికిస్తుండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరుగుతున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ పేర్కొంది. ఇది ఎంతవరకూ ప్రభావం చూపుతుందన్న అంశంపై అంచనాలు లేకపోవడంతో ఇన్వెస్టర్లు భయాలకు లోనవుతున్నట్లు ఒక నివేదికలో తెలియజేసింది. అయితే దేశీయంగా రెండు లేదా మూడు నెలల్లోనే

ఆర్‌కామ్‌ దివాలా ప్రణాళికకు ఎస్‌బీఐ బోర్డు ఆమోదం

Wednesday 4th March 2020

న్యూఢిల్లీ: రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ దివాలా పరిష్కార ప్రణాళికకు ఎస్‌బీఐ బోర్డు ఆమోదం తెలిపింది. ఆర్‌కామ్‌ రుణదాతల కమిటీ (సీవోసీ)లోనూ ఎస్‌బీఐ బోర్డు సానుకూలంగా ఓటు వేయనుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. సీవోసీలో ఆర్‌కామ్‌ పరిష్కార ప్రణాళికపై ఓటింగ్‌ మొదలైందని, ఈ నెల 4న ముగుస్తుందని పేర్కొన్నాయి. పరిష్కార ప్రణాళిక కింద బ్యాంకులకు రూ.23,000 కోట్లు వసూలు కానున్నాయి. యూవీ అస్సెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ రూ.14,700 కోట్లకు

Most from this category