News


నేటి వార్తల్లోని షేర్లు

Friday 6th March 2020
Markets_main1583472384.png-32320

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు

జిందాల్‌ స్టెయిన్‌లెస్‌: కార్పొరేట్‌ డెట్‌ రీస్ట్రక్చరింగ్‌(సీడీఆర్‌) ఫ్రేమ్‌వర్క్‌ నుంచి బయటికి వస్తున్నట్లు జిందాయ్‌ స్టెయిన్‌లెస్‌ లిమిటెడ్‌(జేఎస్‌ఎల్‌) వెల్లడించింది.

రైట్స్‌(ఆర్‌ఐటీఈఎస్‌): రైట్స్‌లో ఉన్న 2.38 శాతం ప్రభుత్వ వాటాను సెంకండరీ మార్కెట్‌ ద్వారా ఎల్‌ఐసీ కొనుగోలు చేసింది. దీంతో ఇప్పటిదాక రైల్వే కంపెనీ రైట్స్‌ మొత్తం ఈక్విటీలో 7.83 శాతం  వాటాను ఎల్‌ఐసీ సొంతం చేసుకుంది.

ఎన్‌టీపీసీ: ఈ కంపెనీలోని 3.12 శాతం వాటాను కేం‍ద్ర ప్రభుత్వం సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ద్వారా విక్రయించిందని ఎన్‌టీపీసీ వెల్లడించింది. దీంతో ఎన్‌టీపీసీలో ప్రమోటర్స్‌ వాటా 51.02 శాతానికి తగ్గింది.

జిందాల్‌ స్టీల్‌: సీనియర్‌ అన్‌సెక్యూర్డ్‌ డాలర్‌ నోట్ల పనితీరు బలహీనంగా ఉండడం, భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ కొనుగోలు నిర్వహణలో సమస్యలుండడంతో మూడీస్‌సంస్థ జిందాల్‌ స్టీల్‌ ఆవుట్‌లుక్‌ పాజిటివ్‌ నుంచి స్టేబుల్‌గా మార్చి Ba2  రేటింగ్‌ను ఇచ్చింది.

కడీలా హెల్త్‌కేర్‌: నాన్‌ ఆల్కాహాలిక్‌ ప్యాటీ లివర్‌ సమస్యను ఎదుర్కొనేందుకు జైడస్‌ కడీలా హెల్త్‌కేర్‌ కొత్తగా తయారు చేసిన సర్గోలిట్జర్‌కు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) ఆమోదం తెలిపింది. 

డీఎల్‌ఎఫ్‌: మార్పిడి రహిత డిబెంచర్లు(ఎన్‌సీడీ) ద్వారా రూ.1,000 కోట్ల నిధులు సమీకరించాలని డీఎల్‌ఎఫ్‌ భావిస్తోంది. ఈమేరకు కంపెనీ ఫైనాన్స్‌ కమిటీ బోర్డు డైరెక్టర్లు మార్చి 7న సమావేశం కానున్నారని డీఎల్‌ఎఫ్‌ రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారంలో తెలిపింది.

కోల్‌ఇండియా: ఈ ఆర్థిక సంవత్సరంలో మొదట అనుకున్న డివిడెండ్‌ టార్గెట్‌ రూ.9,000 కోట్లను మించి రూ.10,000 కోట్లను డివిడెండ్‌ కింద కోల్‌ ఇండియా ఇవ్వొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

లుపిన్‌: అమెరికాలో ఆర్థరైటీస్‌కు ఉపయోగించే విమోఓ ట్యాబ్‌లెట్లకు జెనరిక్‌ వెర్షన్‌ను విడుదల చేస్తున్నట్లు లుపిన్‌ లిమిటెడ్‌ వెల్లడించింది.

జెట్‌ ఎయిర్‌వేస్‌: జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ వ్యవస్థాపకులు నరేష్‌ గోయల్‌తోపాటు అతని భార్య అనితాలను  మానీలాండరింగ్‌ కేసులో వారిపై ఉన్న ఆరోపణల గురించి గురువారం ఈడీ 6 గంటలకు పైగా విచారించింది.
 You may be interested

శ్రీమంతులు పెరిగారు!

Friday 6th March 2020

ప్రస్తుతం దేశంలో యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ సంఖ్య 5,986 2024 నాటికి 73 శాతం వృద్ధితో 10,534లకు చేరిక ఈక్విటీలే ప్రధాన ఇన్వెస్ట్‌మెంట్స్‌; ఆ తర్వాత బాండ్లు, రియల్టీలో..  అత్యంత ఖరీదైన నగరాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు గ్లోబల్‌ నైట్‌ఫ్రాంక్‌ వెల్త్‌ రిపోర్ట్‌–2020 వెల్లడి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా హైనెట్‌ వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) సంఖ్య వేగంగా పెరుగుతోంది. భౌగోళిక రాజకీయ అస్థిరతలు, మందగించిన ఆర్థికాభివృద్ధి వంటివి శ్రీమంతుల సంపద వృద్ధికి విఘాతాన్ని కలిగించడం లేదు. ప్రస్తుతం

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 5.75శాతం క్రాష్‌..!

Friday 6th March 2020

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభమైన గంటలోపే ఏకంగా 5.75శాతం నష్టాన్ని చవిచూసింది. యస్‌ బ్యాంక్‌ సంక్షోభానికి తోడు కరోనా వైరస్‌ వ్యాధి భయాల ఈక్విటీ మార్కెట్లోలో నెలకొన్న అమ్మకాలు ఇండెక్స్‌ భారీ పతనానికి కారణమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు క్రితం ముగింపు(28,815.35)తో పోలిస్తే 4శాతం (1165 పాయింట్లు) నష్టంతో 27,649.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ఆరంభంలో

Most from this category