News


నేటి వార్తల్లోని షేర్లు

Thursday 19th March 2020
Markets_main1584595236.png-32575

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌: నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ ఆమోదం తెలిపిన తర్వాత రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌లో డెట్‌ బాధ్యతలను తీసుకోనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించింది.

యస్‌బ్యాంక్‌: యస్‌బ్యాంక్‌లో అతిపెద్ద ప్రమోటర్‌గా ఉన్న వ్యవస్థాపక చైర్మన్‌ అశోక్‌ కపూర్‌ భార్య మధు కపూర్‌ ప్రస్తుతం యస్‌బ్యాంక్‌లో  6.87 శాతం వాటాతోపాటు తాజాగా 25 లక్షల షేర్ల వాటాను కొనుగోలు చేయనున్నారు. 

ఐటీసీ: ఐటీసీ తొలిసారి షేర్‌హోల్డర్లకు డివిడెడ్‌ను నిష్పత్తిని నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్‌లన్నీ పోగా 80 నుంచి 85 శాతంగా డివిడెండ్‌ నిష్పత్తిని నిర్ణయించింది.

టాటా కమ్యూనికేషన్స్‌: టాటా కమ్యూనికేషన్స్‌లోని లక్ష షేర్లను టాటాసన్స్‌ ఎక్సిక్యూటివ్‌ చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ సెకండరీ మార్కెట్‌ ద్వారా కొనుగోలు చేసినట్లు రెగ్యులేటరికి ఇచ్చిన సమాచారంలో వెల్లడించారు.

గెయిల్‌: ఏసీఎంఈ సోలార్‌ హోల్డింగ్స్‌లో వాటాను కొనుగోలు చేసేందుకు గెయిల్‌ చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయం వర్గాలు వెల్లడించాయి.

అశోక్‌ లేలాండ్‌: అశోక్‌ లేలాండ్‌ అనుబంధ సంస్థ హిందుజా లేలాండ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎల్‌ఎఫ్‌ఎల్‌)లో 19 శాతం వాటాను రూ.1,200 కోట్లవరకు వెచ్చించి కొనుగోలు చేయనున్నట్లు అశోక్‌ లేలాండ్‌ వెల్లడించింది.

పీవీఆర్‌: కోవిడ్‌-19 కారణంగా ప్రభుత్వాలు సినిమా థియేటర్లు మూసివేయాలనీ ఆదేశించినప్పటికి పీవీఆర్‌కు పాజిటివ్‌ రేటింగ్‌ను ఇస్తున్నట్లు ఐసీఆర్‌ఏ వెల్లడించింది.

అలెఫేగో: ఒడిషాలోని మహానంది బేసిన్‌, ఓఏఎల్‌పీ ప్రాంతాలంలో 2డీ, 3డీ సిసమిక్‌ డేటాను నిర్వహించి సొంతం చేసుకునేందుకు అలెఫేగోకు ఆయిల్‌ ఇండియా నుంచి కాంట్రాక్ట్‌ లభించింది. 
ఎన్‌ఎల్‌సీ ఇండియా: రూ.6,000 కోట్లవరకు వాణిజ్య పేపర్లను జారీ చేసేందుకు ఈ కంపెనీ ఆమోదం తెలిపింది.

జెట్‌ఎయిర్‌వేస్‌: జెట్‌ఎయిర్‌వేస్‌ దివాలా ప్రక్రియ గడువును మరో 90 రోజులు పొడిగించేందుకు  ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది.

హెచ్‌పీసీఎల్‌: హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన లిమిటెడ్‌(హెపీసీఎల్‌) తన మొదటి పెట్రోల్‌ పంప్‌ను బూటాన్‌లో ప్రారంభించింది. 

కరూర్‌ వైశ్యా బ్యాంక్‌: బంగారం, వెండి ఆభరణాల వ్యాపారంలోకి అడుగు పెడుతున్నట్లు కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ వెల్లడించింది. సుమారు 6,000 మంది అభరణ తయారీదారులకు తన సేవలను అందించనున్నట్లు అధికారికంగా వెల్లడించింది.


 You may be interested

భారీగా తగ్గిన పసిడి!

Thursday 19th March 2020

 ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య అధికమవుతుండడంతో గురువారం బంగారం  ధర స్వల్పంగా పతనమై రూ.40,000 దిగువకు చేరింది.దేశంలో క్రమంగా కరోనా కేసులు పెరగడం, రూపాయి బలహీనపడడంతో గురువారం దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే రూ.727 తగ్గి 10 గ్రాముల పసిడి రూ.39,227.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది.అంతర్జాతీయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే 24డాలర్లు పతనమై ఔన్స్‌ బంగారం 1,476 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. (బుధవారం (స్పాట్‌) ముగింపు

అమ్మకాల షాక్‌ -39 నెలల కనిష్టం

Thursday 19th March 2020

1892 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్‌ 522 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ 27,000 పాయింట్ల స్థాయి దిగువకు సెన్సెక్స్‌ 8,000 పాయింట్ల మైలురాయినీ కోల్పోయిన నిఫ్టీ 2016 డిసెంబర్‌ స్థాయికి స్టాక్‌ మార్కెట్లు మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 5 శాతం చొప్పున పతనం ప్రపంచవ్యాప్తంగా కోరలు చాస్తున్న కరోనా దెబ్బకు స్టాక్‌ మార్కెట్లు పిట్టల్లా వణుకుతున్నాయి. బుధవారం అమెరికా, యూరోప్‌ మార్కెట్లు 6 శాతం చొప్పున కుప్పకూలగా.. ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లు 8-3 శాతం మధ్య పతనమయ్యాయి. ఈ ప్రభావంతో

Most from this category