STOCKS

News


నేటి వార్తల్లోని షేర్లు

Friday 7th February 2020
Markets_main1581052693.png-31590


వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం స్టాక్‌మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు

యస్‌ బ్యాంక్‌:  ప్రవేటు రంగ రుణదాత యస్‌బ్యాంక్‌ శుక్రవారం ముంబైలో ఈజీఎంను నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో అధీకృత మూలధనాన్ని రూ.800 కోట్ల నుంచి రూ.1,100 కోట్లకు పెంచడం, మెమోరాండం ఆఫ్‌ అసోసియేషన్‌ క్లాజ్‌ -5లో సవరణలు వంటి అంశాలపై చర్చించనున్నారు.

ఐడీఎఫ్‌సీ: డిసెంబర్‌తో ముగిసిన క్యూ3లో ఐడీఎఫ్‌సీ కన్సాలిడేటెడ్‌ నికర నష్టం రూ.342.67 కోట్లుగా నమోదైందని ఐడీఎఫ్‌సీ తెలిపింది. కాగా క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర నష్టం రూ.671 కోట్లుగా ఉంది.

అరబిందో ఫార్మా: ఈ ఆర్థిక సంవత్సరం మూడోత్రైమాసికంలో అరబిందో ఫార్మా  నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ3తో పోలిస్తే  నామమాత్రంగా తగ్గి రూ.712.2 కోట్ల నుంచి రూ.705.3 కోట్లకు చేరిందని కంపెనీ ప్రకటించింది. 

యూకో బ్యాంక్‌: ఈ బ్యాంక్‌ క్యూ3 నికర నష్టం గత ఆర్థిక సంవత్సరం క్యూ3తో పోలిస్తే తగ్గి రూ.998.74 కోట్ల నుంచి రూ.960.17 కోట్లకు చేరింది.

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌: ఒడిషాలో జరుగుతున్న  వేలంలో 39 మిలియన్‌ టన్నుల ఐరన్‌ ఓర్‌ నిల్వలు కలిగిన జజంగ్‌ బ్లాక్‌ను జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ సొంతం చేసుకుంది. 

జీఎస్‌కే కన్జూమర్‌: క్యూ3లో  కంపెనీ స్టాండేలోన్‌ నికర లాభం 25.13 శాతం పెరిగి రూ.276.63 కోట్లకు చేరిందని జీఎస్‌కే కన్జూమర్‌ వెల్లడించింది.

ఇంద్రప్రస్థ గ్యాస్‌: గ్యాస్‌ విక్రయాలు పెరగడంతో క్యూ3లో నికర లాభం 43 శాతం పెరిగిందని ఇంద్రప్రస్థ గ్యాస్‌ తెలిపింది.

ఎన్‌ఎండీసీ: ఆదాయం తగ్గడంతో క్యూ3లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 12.75 శాతం తగ్గి రూ.1,375 కోట్లకు చేరిందని ఎన్‌ఎండీసీ వెల్లడించింది.

వొడాఫోన్‌ ఐడియా: వొడాఫోన్‌ఐడియా కంపెనీ త్వరలో పోస్ట్‌పెయిడ్‌ సర్వీసుల నుంచి బ్రాండ్‌ పేరు ‘ఐడియా’ ను తొలగించనుంది.

కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌: కాఫీడే వ్యవస్థాపకులు, మాజీ చైర్మన్‌ వీజీ సిద్దార్థ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై త్వరలో ఒక నివేదికను విడుదల చేయనున్నట్లు కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ వెల్లడించింది.You may be interested

ఈ మిడ్‌ క్యాప్స్‌ మీ దగ్గరున్నాయా?!

Friday 7th February 2020

బ్రోకింగ్‌ సంస్థల సిఫారసులు బయ్‌, హోల్డ్‌, సెల్‌ రేటింగ్స్‌ జాబితాలో సౌత్‌ బ్యాంక్‌, బేయర్‌ క్రాప్‌ థెర్మాక్స్‌, బెర్జర్‌ పెయింట్స్‌, కేడిలా.. వరుసగా నాలుగు రోజులపాటు ర్యాలీ బాటలోసాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు కొంతమేర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ అవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బ్రేకవుట్‌ కావచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని బ్రోకింగ్‌ సంస్థలు విభిన్న రంగాలకు చెందిన కొన్ని మిడ్‌ క్యాప్‌

ఎల్‌టీఆర్‌ఓతో ఏంటి ప్రయోజనం??

Friday 7th February 2020

ద్రవ్యపరపతి విధానాలు మరింత మెరుగ్గా దిగువ రంగాలకు బదిలీ అయ్యేందుకు ఆర్‌బీఐ గురువారం ఎల్‌టీఆర్‌ఓ(లాంగ్‌టర్మ్‌ రెపో ఆపరేషన్‌)ను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో అసలు ఎల్‌టీఆర్‌ఓఎలా ప్రభావం చూపుతుంది? చూద్దాం... = ఆర్‌బీఐ ఒకేడాది, మూడేళ్ల కాలపరిమితితో రూ. లక్ష కోట్ల వరకు ఉండే టర్మ్‌ రెపోలను పాలసీ రెపో రేట్‌ వద్ద నిర్వహిస్తామని ప్రకటించింది. దీన్నే ఎల్‌టీఆర్‌ఓ అంటారు. = బ్యాంకులకు సరైన లిక్విడిటీ, సరైన రేట్ల వద్ద అందించేందుకు, బ్యాంకులు వడ్డీరేట్ల

Most from this category