News


నేటివార్తల్లోని షేర్లు

Thursday 12th March 2020
Markets_main1583990787.png-32426

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు

భారతీ ఎయిర్‌టెల్‌: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు..భారతీ ఎయిర్‌టెల్‌ స్వీయ గణాంకాల విశ్లేషణ ప్రకారం మొత్తం ఏజీఆర్‌ బకాయిలు కింద రూ.13,000 కోట్లు  చెల్లించామని ఈ కంపెనీ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ వెల్లడించారు. 

బయోకాన్‌:  సనోఫీ ఫార్మా కంపెనీ ఇన్సులిన్‌ పరికరం పేటెంట్‌ను అమెరికా కోర్టు రద్దుచేసింది. దీంతో మైలాన్‌ కంపెనీతో కలిసి బయోకాన్‌ తయారు చేసిన సెమగ్లీ అనే ఇన్సులిన్‌ పరికరాన్ని అమెరికా మార్కెట్‌లో  విక్రయించేందుకు లైన్‌ క్లియర్‌ అయింది.

ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌: కోవిడ్‌-19 వ్యాప్తితో  త్రైమాస ఆదాయాలు తగ్గుతాయని ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌ వెల్లడించింది. గత కొద్ది వారాలుగా  వారానికి వారం 15-20 శాతం రోజువారీ బుకింగ్స్‌లో క్షీణత కనిపించిందని, అందువల్లే ఆదాయం తగ్గే అవకాశం ఉందని ఇంటర్‌ గ్లోబ్‌ తెలిపింది.

లార్సన్‌ అండ్‌ టబ్రో:  యస్‌బ్యాంక్‌ జారీచేసిన అడీషనల్‌ టైర్‌ 1 బాండ్లను రద్దు చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించడంతో ..బాండ్లను కొన్న పెట్టుబడిదారులంతా ఈ అంశంపై గురువారం(మార్చి12)న బాంబే హైకోర్టును ఆశ్రయించనున్నారు. అయితే లార్సన్‌ అండ్‌ టబ్రో వెళ్లకపోవచ్చని కంపెనీ తెలిపింది.

యస్‌బ్యాంక్‌: యస్‌బ్యాంక్‌ను పునరుద్దరించేందుకు స్థానిక బ్యాంకులైన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌, యాక్సిస్‌లతో కలిసి స్టేట్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా(ఎస్‌బీఐ) యస్‌బ్యాంక్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.

కెనరా బ్యాంక్‌:బేసల్‌-III కాంప్లియంట్‌ బాండ్ల జారీ ద్వారా రూ.3,000 కోట్ల నిధులను సమీకరించిన్నట్లు కెనరా బ్యాంక్‌ బీఎస్‌ఈకి ఇచ్చిన సమాచారంలో తెలిపింది. 

 You may be interested

17 నెలల కనిష్టానికి రూపాయి

Thursday 12th March 2020

60పైసలు పడిపోయిన దేశీ కరెన్సీ కరోనా వైరస్‌ను ప్రపంచ మహమ్మారి వ్యాధిగా గుర్తిస్తున్నట్లు తొలిసారి అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ఊపందుకున్నాయి. దీనికితోడు యూరోపియన్‌ దేశాల నుంచి ప్రయాణికులను అనుమతించబోమంటూ అమెరికా ప్రెసిడెంట్‌ ప్రకటించడంతో ప్రపంచ ఆర్థిక వృద్ధికి విఘాతం కలగనున్న అంచనాలు పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాసహా ఆసియా వరకూ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ ప్రభావం దేశీ కరెన్సీపైనా పడింది. వెరసి

మల్కాపూర్‌లో ఐఓసీఎల్‌ భారీ టెర్మినల్‌

Thursday 12th March 2020

రూ.611 కోట్ల పెట్టుబడులతో 70 ఎకరాల్లో నిర్మాణం 18 నెలల్లో పూర్తి; 1.80 లక్షల కిలో లీటర్ల సామర్థ్యం రూ.36 కోట్లతో చర్లపల్లి ఎల్‌పీజీ ప్లాంట్‌ విస్తరణ కూడా.. ఇండియన్‌ ఆయిల్‌ ఈడీ శ్రవణ్‌ ఎస్‌ రావు వెల్లడి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌) రూ.3,800 కోట్ల పెట్టుబడులతో చేపడుతున్న పారదీప్‌ – హైదరాబాద్‌ డీజిల్‌ ఎగ్జాస్ట్‌ ఫ్లూయిడ్‌ (డీఈఎఫ్‌) పైప్‌లైన్‌ ప్రాజెక్ట్‌ తుది దశకు చేరుకుంది. ఈ పైప్‌లైన్‌కు అనుసంధానిస్తూ

Most from this category