News


నేటి వార్తల్లోని షేర్లు

Wednesday 29th January 2020
Markets_main1580277047.png-31296


 

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం స్టాక్‌మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌: దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ కు చెందిన వివిధ రకాల ఆస్తుల విక్రయానికి ఆర్బీఐ నియమించిన కమిటీ బిడ్స్‌ను ఆహ్వానించింది. 

మహీంద్ర అండ్‌ మహీంద్ర ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌: డిసెంబర్‌ 31న ముగిసిన క్యూ3లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 16 శాతం పెరిగి రూ.475 కోట్లకు చేరిందని మహీంద్ర అండ్‌ మహీంద్ర ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వెల్లడించింది.

యస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ పవర్‌: రిలయన్స్‌ పవర్‌కు చెందిన రూ.5.7 కోట్ల విలువైన షేర్లను యస్‌ బ్యాంక్‌ ఓపెన్‌ మార్కెట్‌లో విక్రయించింది. రిలయన్స్‌ పవర్‌లో 1.07 శాతం వాటా కలిగిన 3,02,59,855 షేర్లను విక్రయించింది.

కేఈఐ ఇండస్ట్రీస్‌:  ఎల్‌ అండ్‌ టీ మ్యూచువల్‌ ఫండ్‌, డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌, సుందరం మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి కేఈఐ ఇండస్ట్రీస్‌ రూ.500 కోట్లను సమీకరించినట్లు వెల్లడించింది. రూ.900 కోట్లు బిడ్లు రావడంతో ఇష్యూ ఓవర్‌ సబ్‌స్ర్కైబ్‌ అయినట్లు కంపెనీ తెలిపింది.

ఫెర్టిలైజర్‌ స్టాక్స్‌: బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీని 20 శాతం పెంచి రూ.1 లక్షకోట్లు కేటాయించాలని రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖ కేం‍ద్ర ప్రభుత్వాన్ని కోరింది.

కెమికల్‌ స్టాక్స్‌: చైనాలో డై, ఫార్మా పరిశ్రమల్లో వాడే రసాయనాలను ఇండియాలో డంప్‌ చేస్తున్నారని దానిపై చర్యలు తీసుకోమని గుజరాత్‌ నర్మదా వ్యాలీ ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్‌ లిమిటెడ్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రేడ్‌ రెమెడీస్‌(డీజీటీఆర్‌)కు ఫిర్యాదు చేయడంతో భారత ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్‌ను ప్రారంభించింది.

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా:  ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచుకోవడంతో క్యూ3  స్టాండేలోన్‌ నికర లాభం రూ.155 కోట్లకు చేరిందని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. కాగా గతేడాది ఈ త్రైమాసికంలో నికర నష్టం రూ.718 కోట్లుగా నమోదైంది.

జేకే లక్ష్మీ సిమెంట్‌: ఖర్చులు తగ్గించడంతో 2019-20 ఆర్థిక సంవత్సరం క్యూ3 కన్సాలిడేటెడ్‌ నికర లాభం భారీగా పెరిగి రూ.51 కోట్లకు చేరిందని జేకే లక్ష్మీ సిమెంట్‌ వెల్లడించింది. కాగా గతేడాది అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్యకాలంలో ఆదాయం రూ.3.22 కోట్లుగా ఉందని ఎక్సెంజ్‌కి ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది.

మాస్టెక్‌: ఐటీ రంగానికి చెందిన మాస్టెక్‌ కంపెనీ క్యూ3లో నికర లాభం 2 శాతం తగ్గి రూ.26 కోట్లకు చేరిందని ప్రకటించింది. గతేడాది క్యూ3లో నికర లాభం రూ.26.5 కోట్లుగా ఉంది.


 



You may be interested

కోకాపేటలో ఐదెకరాలు కొన్న సాలార్‌పురియా

Wednesday 29th January 2020

ఒమాక్సె నుంచి రూ.650 కోట్లకు కొనుగోలు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బెంగళూరుకు చెందిన ప్రముఖ నిర్మాణ రంగం సంస్థ సాలార్‌పురియా సత్వా కోకాపేటలో 25 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. న్యూఢిల్లీకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ ఒమాక్సె గ్రూప్‌ నుంచి రూ.650 కోట్ల వ్యయంతో ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలిసింది. సాలార్‌పురియా ప్రస్తుతం హైదరాబాద్‌లో 1.3 కోట్ల చ.అ.ల్లో కమర్షియల్‌ స్పేస్‌ను అభివృద్ధి చేస్తోంది. వచ్చే రెండేళ్లలో

మణప్పురం ఫైనాన్స్‌ లాభం 63 శాతం అప్‌

Wednesday 29th January 2020

రూ.398 కోట్లకు పెరిగిన నికర లాభం  స్వల్పంగా తగ్గిన మొండి బకాయిలు  ముంబై: బంగారం తాకట్టు రుణాలిచ్చే మణప్పురం ఫైనాన్స్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో 63 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.244 కోటుల్గా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ3లో రూ.398 కోట్లకు పెరిగిందని మణప్పురం ఫైనాన్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం 29 శాతం వృద్ధితో రూ.1,399 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నిర్వహణ

Most from this category