News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 18th January 2019
Markets_main1547783269.png-23646

వివిధ వార్తల‌కు అనుగుణంగా శుక్రవారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు
అర‌బిందో ఫార్మా:- అంకాలజీ వ్యాధి నివార‌ణ‌లో వినియోగించే ఏడు ఇంజెక్షన్‌ల‌ను అమెరికాకు చెందిన స్పెక్ట్రమ్ ఫార్మాస్యూటిక‌ల్స్ నుంచి కొనుగోలు చేసింది. మార్కెట్లో వీటి విలువ సుమారు రూ.2,134 కోట్లు ఉంటుంది.
లుపిన్‌:- ఇటీవ‌ల పీతాంబ‌రం యూనిట్లో త‌నిఖీలు పూర్తి యూఎస్ఎఫ్డీఏ అభ్యంత‌ర లెట‌ర్‌ను జారీ చేసిన‌ట్లు మీడియా వార్తలు వెలువ‌డ్డాయి.
జెట్ ఎయిర్‌వేస్‌:- రెజుల్యూష‌న్ ప్రణాళిక‌లో భాగంగా ఎస్‌బీఐ ఆధ్వర్యంలో కన్షారియంకు న‌రేష్ గోయ‌ల్ కంపెనీలో త‌న ప్రాధాన్యత‌ను వివరించారు.
ఐఎల్ఎఫ్ఎస్‌:- జ‌మ్మూ కాశ్మీర్ జోలిలా ట‌న్నెల్ ప్రాజెక్ట్‌ను ర‌ద్దు చేస్తున్నట్లు జ‌న‌వ‌రి 15న ప్రక‌టించింది.
డీహెచ్ఎఫ్ఎల్‌:- రూ.1375 కోట్ల విలువైన పీటీసీ బాండ్లకు బ్రిక్‌వర్క్స్‌ రేటింగ్‌ బిబిబి+ రేటింగ్ కేటాయించినట్లు కంపెనీ తెలిపింది.
బ‌జాజ్ హోల్డర్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌:- మ‌హారాష్ట్ర డెవెల‌ప్‌మెంట్ కార్పోరేష‌న్ లిమిటెడ్‌లోని మ‌హారాష్ట్ర స్కూట‌ర్స్ లిమిటెడ్‌కు చెందిన 30ల‌క్షల ఈక్వీటీ షేర్లను కొనుగోలు చేసింది.
యూకో బ్యాంక్‌:- ప్రిఫ‌రెన్షియ‌ల్ బేసిస్ ప‌ద్ధతిలో టైర్‌-2 బాండ్ల జారీ ద్వారా రూ.500 కోట్ల స‌మీక‌ర‌ణ‌కు, అర్హత క‌లిగిన సంస్థాగ‌త ఇన్వెస్టర్లకు ఈక్వీటీ షేర్లను జారీ చేసి రూ.1000 కోట్లను స‌మీక‌రించేందుకు సైతం ప్రణాళిక‌లు సిద్దం చేసింది.
పీవీవీ ఇన్ఫ్రా:- ప్రమోట‌ర్లకు ప్రతి షేరు ధ‌ర రూ.21లు చొప్పున 5లక్షల ఈక్వీటీ షేర్లతో పాటు, 4.70ల‌క్ష‌ల క‌న్వర్టబుల్ ఈక్విటీ షేర్లను జారీ చేసింది. అలాగే నాన్-ప్రమోట‌ర్లకు సైతం ప్రతి షేరు ధ‌ర రూ.21లు చొప్పున 3.30లక్షల ఈక్వీటీ షేర్లతో పాటు, 6 ల‌క్ష‌ల క‌న్వర్ట‌బుల్ ఈక్విటీ షేర్లను జారీ చేసింది.
ర్యాలీస్‌ ఇండియా:- తన అనుబంధ సంస్థ మెటాహెక్స్ లైఫ్ సైన్సెస్‌ విలీనానికి బోర్డు ఆమోదం తెలిపింది.
ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌:- ఎంటర్‌ప్రైజెస్‌ సేవలు అందించేందుకు సీఆర్‌ఎం సెల్యూషన్స్‌ ప్రొడవైడర్‌ రులెట్రోనిక్స్‌ను రూ.53 కోట్లకు కొనుగోలు చేసింది.
బీఏఎస్‌ఎఫ్‌ ఇండియా:- అదానీ గ్రూప్‌తో భాగస్వామ్యంలో ముంద్రా పెట్రోకెమిలక్స్‌ ప్లాంట్‌లో రూ.14000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.
నేడు క్యూ3 ఫ‌లితాల‌ను ప్రక‌టించే కొన్ని ప్రధాన కంపెనీలు
విప్రో, అతుల్‌, ఎంపీఎస్‌, ఎన్ ఐ ఐ టీ టెక్నాల‌జీస్‌, ముత్తూట్ క్యాపిట‌ల్ ఫైనాన్స్‌, జీ లెర్న్‌, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్‌, క‌జారియా సిరామిక్స్‌, ఓమెక్స్ అటో, ఎం టీ ఎడ్యూకేర్‌, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ధ‌న‌లక్ష్మీ బ్యాంక్‌, 3ఐ ఇన్ఫోటెక్‌ ఐసీఐసీఐ లాంబార్డ్ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ కంపెనీ.You may be interested

రిలయన్స్‌ అప్‌....పాజిటివ్‌ ఓపెనింగ్‌

Friday 18th January 2019

అంతర్జాతీయ సానుకూల మార్కెట్లకు తోడు, క్రితం రోజు మార్కెట్‌ ముగిసిన తర్వాత వెల్లడైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫలితాలు ఇన్వెస్టర్లను ఉత్సాహపర్చడంతో శుక్రవారం భారత్‌ సూచీలు పాజటివ్‌గా మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 49 పాయింట్ల పెరుగుదలతో 36,429 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 10,924 పాయింట్ల వద్ద మొదలయ్యింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 1.5 శాతం లాభంతో రూ. 1150 వద్ద ప్రారంభమయ్యింది. ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌, ఓఎన్‌జీసీలు

ఆర్‌డీ చేస్తున్నారా...? మరోసారి ఆలోచించండి!

Thursday 17th January 2019

దీర్ఘకాలంలో మంచి పొదుపు సాధనం గురించి అడిగితే తల్లిదండ్రులు రికరింగ్‌ డిపాజిట్‌(ఆర్‌డీ) గురించి చెబుతారు. ఆర్‌డీ పోస్టాఫీసుతోపాటు బ్యాంకుల్లోనూ ప్రారంభించి ప్రతీ నెలా ఇన్వెస్ట్‌ చేసుకుంటూ వెళ్లొచ్చు. వడ్డీ రేటు ఎప్పటికప్పుడు మారుతుంటుంది. బ్యాంకును బట్టి ఇది కొంచెం వేర్వేరుగానూ ఉండొచ్చు. ప్రస్తుతం ఓ ప్రముఖ బ్యాంకులో ఆర్‌డీపై వడ్డీ రేటు 7 శాతంగా ఉంది. మరి ఇది నిజంగా మంచి రాబడినిచ్చే సాధనమేనా? అని ప్రశ్నించుకోండి. సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌

Most from this category