News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 5th September 2019
Markets_main1567656390.png-28205

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
ఎంసీఎక్స్‌ ఇండియా:-
షాంగ్యూ కమోడిటీ ఎక్చ్సేంజీతో ఎంఓయూ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
విప్రో లిమిటెడ్‌:- ఐసీఐసీఐ బ్యాంక్‌కు 7ఏళ్లపాటు సాంకేతిక సేవలు అందించడానికి 300 మిలియన్ డాలర్ల విలువైన వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
శంకర బిల్డింగ్‌ ప్రాడెక్ట్స్‌ లిమిటెడ్‌:- ఇండియా రేటింగ్స్‌ సంస్థ కంపెనీ రేటింగ్‌ను ఇండియాఎ(-)కు, నెగిటివ్‌ అవుట్‌లుక్‌ను కేటాయించింది.
ఐసీఐసీఐ లాంబార్డ్‌:- సాండర్డ్‌ ఛార్టెడ్‌ బ్యాంక్‌తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
ఉషా మార్టిన్‌ ఎడ్యూకేషన్‌:- కంపెనీ స్వతంత్ర డెరెక్టర్‌గా నిపేంద్ర కుమార్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా త్రివిక్రమ్‌ ఖైతిన్‌ నియమితులయ్యారు. 
యూనిటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా:- సెప్టెంబర్‌6న జరిగే సమావేశంలో పీఎన్‌బీతో విలీనం అంశాన్ని చర్చించడం లేదని స్పష్టం చేసింది.
అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌:- కంపెనీ మేనిజింగ్‌ డైరెక్టర్‌గా కైలాష్‌ చంద్ర ఝన్‌వార్‌ నియమితులయ్యారు. 
అవెన్యూ సూపర్‌మార్ట్‌:- క్రిసెల్‌ ఏజెన్సీ సర్వీసెస్‌ రూ.200 కోట్ల నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ ఇష్యూకు ఎఎ(+)/స్థిరత్వం రేటింగ్‌ను కేటాయించింది
ఎన్‌ఎండీసీ:- ఆగస్ట్‌లో ఉత్పత్తి 1.41 మెగా టన్నులుగానూ, మొత్తం అమ్మకాలు 1.49 టన్నులుగా ఉన్నాయి. 
ఎలెకాన్‌ ఇంజనీరింగ్స్‌:- రూ.50 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది. 
ఐఎఫ్‌జీఎల్‌ రీఫ్రాక్ట్స్‌:- బ్యాంకు రుణ సౌకర్య సదుపాయాలకు ధీర్ఘకాలిక రేటింగ్‌ను ఎ(+)గానూ, స్వల్పకాలిక రేటింగ్‌ను ఎ1(+)గానూ కేటాయించింది. 
పీఎన్‌బీ:- మూడీస్‌ రేటింగ్‌ సంస్థ బ్యాంకు రేటింగ్‌ను పాజిటివ్‌ నుంచి అవుట్‌లుక్‌ కేటాయించింది. 
బ్యాంకింగ్‌ రంగ షేర్లు:- బ్యాంకింగ్‌ రుణ రేట్లు అన్నీ రెపోతో సహా ద్రవ్య విధాన నిర్ణయ రేట్లకు, ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌కు అనుసంధానం కావాల్సిందేనని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. 



You may be interested

పెరిగిన యుఎస్‌ చమురు నిల్వలు..తగ్గిన చమురు

Thursday 5th September 2019

గత వారానికి సంబంధించి యుఎస్‌ చమురు నిల్వలు పెరగడంతో గురువారం ట్రేడింగ్‌లో చమురు ధరలు పడిపోయాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 0.3 శాతం పడిపోయి బారెల్‌ 60.52 డాలర్లకు, డబ్యూటీఐ క్రూడ్‌ 0.4 శాతం తగ్గి బారెల్‌ 56.03 డాలర్లకు చేరుకున్నాయి. అగష్టు 30 తో ముగిసిన వారానికిగాను యుఎస్‌ చమురు నిల్వలు తగ్గుతాయని విశ్లేషకులు అంచనాల నేపథ్యంలో, గత సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ 4.2 శాతం, డబ్యూటీఐ క్రూడ్‌ 4.3

లాభాల ప్రారంభం

Thursday 5th September 2019

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలు అక్టోబర్‌ నుంచి పునర్‌ప్రారంభంకానున్నట్లు చైనా ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్‌కు అనుగుణంగా గురువారం భారత్‌ స్టాక్‌ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌100 పాయింట్ల లాభంతో 36,825 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ16 పాయింట్ల లాభంతో 10,861 పాయింట్ల వద్ద ఆరంభమయ్యాయి. 

Most from this category