News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 7th June 2019
Markets_main1559881742.png-26144

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
విప్రో:-
విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పదవులను నుంచి అజీమ్ ప్రేమ్‌జీ పదవీ విరమణ చేయనున్నారు. జూలై 30 నుంచి రాజీనామా అమల్లోకి రానుంది. అయితే కంపెనీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డెరెక్టర్‌గా మరో 5ఏళ్లు కొనసాగుతారు. ఆయన స్థానంలో తనయుడు రిషద్‌ ప్రేమ్‌జీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 2024 జూలై 30 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
లిండే ఇండియా:- కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పదవికి మోలై బెనర్జీ రాజీనామా చేశారు. ఇంద్రనీల్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా ఎన్నికయ్యారు. 
ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌:- ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ కంపెనీ బాండ్ల ఇష్యూకు రేటింగ్‌ కేటాయించింది. రూ.2000 కోట్ల ఇన్ఫ్రా బాండ్ల ఇష్యూకు ఎఎ(+) స్థిరత్వం రేటింగ్‌ను, రూ.4000 కోట్ల విలువైన అదనపు టైర్‌-I బాండ్ల ఇష్యూకు ఎఎ/స్థిరత్వం రేటింగ్‌ను కేటాయించింది.  
బాంబే రేయాన్‌ ఫ్యాషన్స్‌:- కంపెనీ స్వతంత్ర డెరెక్టర్‌ పదవికి అరుణాచలం అరుముగమ్‌ రాజీనామాకు బోర్డు ఆమోదం తెలిపింది. 
అలెంబిక్‌ ఫార్మా:- ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్దతిలో జూన్‌ 12న నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది. 
జీహెచ్‌సీఎల్‌:- కంపెనీ ఛైర్మన్‌కు సంబంధించిన స్విస్‌ బ్యాంక్‌ ఖాతాలపై విచారణ జరుగుతుంది అనే మీడియా వార్తలను కంపెనీ ఖండించింది. 
రిలయన్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌:- రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలో 13.82 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించేందుకు ప్రతి షేరు ధర రూ.230గా నిర్ణయించింది.
సైయెంట్‌:- ఇస్రాయిల్‌కు చెందిన సిలస్‌ కంపెనీలో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టింది. సిలస్‌ కంపెనీ రైల్వే పరిశ్రమలో సైబర్‌ సేవలను అందిస్తుంది.
ఇండియబుల్స్‌రియల్‌ఎస్టేట్‌:- కంపెనీ ధీర్ఘకాలిక ఆర్థిక సేవలపై ప్రమోటర్ల దృష్టి సారించారు. కంపెనీలో 14శాతం వాటాను థర్డ్‌ పార్టీ పెట్టుబడిదారులకు
 విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 
భారతీ ఎయిర్‌టెల్‌:- ఓయో హోటల్స్‌, హోమ్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌ భాగస్వామ్యంలో ఎయిర్‌ థ్యాంక్స్‌ యాప్‌లో ఓయో స్టోర్‌ రూపొందిస్తున్నట్లు ఇరు కంపెనీలు ప్రకటించాయి. 
హెచ్‌పీసీఎల్‌:- ప్రభుత్వ నామినీ డైరెక్టర్‌గా సునీల్‌ కుమార్‌ నియామకానికి బోర్డు ఆమోదం తెలిపింది.
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌:-  పింబినో స్టీల్ లిమిటెడ్ ను  చెల్లింపు వాటా కొనుగోలు ద్వారా విలీనం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. 
జై కార్పోరేషన్‌:- కంపెనీ అదనపు డైరెక్టర్‌ బోర్డు సభ్యులుగా ప్రియాంక ఎస్‌ ఫదై, కౌషిక్‌ దేవా నియమితులయ్యారు. You may be interested

పసిడిలో లాభాల స్వీకరణ

Friday 7th June 2019

ఏడు రోజుల వరుస ర్యాలీ అనంతరం పసిడి ఫ్యూచర్లో శుక్రవారం లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఆసియా ట్రేడింగ్‌లో ఉదయం ఔన్స్‌ పసిడి ధర 5.50డాలర్లు నష్టంతో 1,337.15డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల కోత అంచనాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతల పరిస్థితులు పసిడి ధరకు ఇప్పటికీ మద్దతుగా నిలుస్తున్నాయని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేటి రాత్రి అమెరికాలో ఉద్యోగ గణాంకాల విడుదల కానున్న

లాభాల ప్రారంభం...వెంటనే నష్టాల్లోకి

Friday 7th June 2019

క్రితంరోజు భారీ నష్టాల్ని చవిచూసిన స్టాక్‌ మార్కెట్‌... శుక్రవారం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, కొద్ది నిముషాల్లోనే నష్టాల్లోకి జారుకుంది. 50 పాయింట్ల లాభంతో 39,581పాయింట్ల వద్ద మొదలైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ వెనువెంటనే 100 పాయింట్ల నష్టంతో 39,425  పాయింట్ల వద్దకు తగ్గింది. 20 పాయింట్ల లాభంతో 11,865 పాయింట్ల వద్ద మొదలైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచి..కొద్ది నిముషాల్లోనే 30 పాయింట్ల నష్టంతో 11,814  పాయింట్ల వద్దకు పడిపోయింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, వేదాంత, విప్రోలు

Most from this category