News


నేటి వార్తల్లోని షేర్లు

Wednesday 18th March 2020
Markets_main1584510786.png-32556

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు

ఒబేరాయ్‌ రియాల్టి: ఈ కంపెనీకి చెందిన రూ.220 కోట్ల విలువైన  50,24,217 ఈక్విటీ షేర్లను ఇనెవెస్కో గ్లోబల్‌ స్మాల్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ గ్రోత్‌ ఫండ్‌ బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసింది.

వొడాఫోన్‌ ఐడియా: ప్రభుత్వం వొడాఫోన్‌ ఐడియా వ్యక్తిగత అంచనాల సంఖ్యను ఒప్పుకున్నట్లయితే వొడాఫోన్‌ ఐడియా, ఆదిత్యా బిర్లా గ్రూపు ప్రమోటర్లు 1.5 బిలియన్‌ డాలర్లను వొడాఫోన్‌ఐడియాలో పెట్టుబడిగా పెట్టెందుకు సిద్దంగా ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇమామీ: ఇమామీ కంపెనీ  తనసొంత ఈక్విటీ షేర్లను కొనుగోలు(బైబాక్‌)చేసేందుకు రూ.900-1,000 కోట్ల రూపాయలు వెచ్చించనుంది. కాగా కంపెనీలో ప్రమోటర్లకు 53 శాతం వాటా ఉండగా, 40 శాతం వాటా తనఖా పెట్టారు.

మెట్రోపోలీస్‌ ల్యాబ్స్‌: కరోనా వైరస్‌ను పరీక్షించేందుకు మెట్రోపోలీస్‌ ల్యాబ్‌ను కుటుంబ సంక్షేమ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిన తరువాత మెట్రోపోలీస్‌ ల్యాబ్‌ కరోనా సంక్రమణ పరీక్షలు చేయనుంది.

యస్‌బ్యాంక్‌: యస్‌బ్యాంక్‌పై ఆర్బీఐ విధించిన మారటోరియం బుధరవారం ఎత్తివేయనుంది. దీంతో బ్యాంక్‌ ఖాతాదారులు అధిక మొత్తంలో నగదును విత్‌డ్రాచేసే అవకాశం ఉంది.

లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌: భద్రతా పరమైన నిబంధనలు పాటించకుండా రుణాలు మంజూరు చేశారన్న ఆరోపణలతో  లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌కు చెందిన ముగ్గురు సీనియర్‌ ఎక్సిక్యూటివ్‌లపై బ్యాంకు యాజమాన్యం చర్యలు చేపట్టింది.

ఎన్‌టీపీసీ,పవర్‌ గ్రిడ్‌: ఎన్‌టీపీసీ, పవర్‌ గ్రిడ్‌ ఇండెక్స్‌లో షేర్ల విలువ తగ్గుతున్నప్పటికీ, కరోనా వ్యాప్తితో మళ్లీ పుంజుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇండియన్‌ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌: అలహాబాద్‌ బ్యాంక్‌లోని ప్రతి వెయ్యి షేర్లలో 115 షేర్లను ఇండియన్‌ బ్యాంక్‌ జారీ చేస్తుందని ఎక్సెంజ్‌కు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది.

ఎస్‌బీఐ: షేర్ల కొనుగోలు ఒప్పందం ద్వారా 6.82 శాతం వాటాను ఎస్‌బీఐ సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది.

ఐసీఐసీఐ బ్యాంక్‌: యస్‌బ్యాంక్‌లో రూ.1000 కోట్ల పెట్టుబడి ద్వారా 7.97 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ వెల్లడించింది.

టాటాస్టీల్‌:  సుకింద క్రోమైట్‌లోని 95.81మిలియన్‌టన్నుల నిల్వలు కలిగిన గనులను టాటా స్టీల్‌ 50 సంవత్సరాలకు గాను లీజుకు తీసుకుంది. ఇందుకోసం  ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైనింగ్‌ నిర్ణయించిన సగటు ధర 93.75 శాతంను ఒడిషా ప్రభుత్వానికి చెల్లించనుంది.


 You may be interested

ఏడాది కనిష్టానికి 543 షేర్లు

Wednesday 18th March 2020

బుధవారం ఎన్‌ఎస్‌ఈలో 543 షేర్లు 52 వారాల కనిష్టానికి పతనమైయ్యాయి. వీటిలో 3పీ ల్యాండ్‌ హోల్డింగ్స్‌, ఏ2జెడ్‌ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, ఆర్వీ డెనిమ్స్‌ అండ్‌ ఎక్‌పోర్ట్స్‌, ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌,అడ్రైట్‌ ఇన్ఫోటెక్‌, ఆగ్రో ఫోస్‌ ఇండియా, ఆక్స్‌ ఆఫ్టీఫైబర్‌, అల్కాలీ మెటల్స్‌,ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌, అల్‌సెక్‌ టెక్నాలజీస్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌, అపోలో సింధూరి హోటల్స్‌, ఆర్కిస్‌, ఆర్కోటెక్‌, అరిహంత్‌ ఫౌండేషన్‌ అండ్‌ హౌసింగ్‌, ఆరో గ్రీన్‌టెక్‌, ఆశియాన హౌసింగ్‌, అస్ట్రాన్‌

పతనంలో షేర్లు కొంటున్న ప్రమోటర్లు

Wednesday 18th March 2020

కంపెనీలలో వాటా పెంపుపై దృష్టి గ్రూప్‌ కంపెనీలలో టాటా సన్స్‌ వాటా అప్‌ జాబితాలో మారుతీ, గోద్రెజ్‌, బజాజ్‌ కోవిడ్‌-19 విలయానికి అమెరికా బాటలో దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం కరెక్షన్‌ బాటలో సాగుతున్నాయి. చైనాలో కరోనా వైరస్‌ బయటపడ్డాక ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ మంగళవారానికల్లా 28 శాతం దిద్దుబాటుకు లోనైంది. ఇదే విధంగా గత నెల రోజుల్లో సెన్సెక్స్‌తోపాటు, బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు సైతం 26 శాతం క్షీణించాయి.

Most from this category