News


నష్టాల్లో ఆరంభమైన ఐడియా, ఎయిర్‌టెల్‌ షేర్లు

Friday 15th November 2019
Markets_main1573790272.png-29608

గురువారం క్యు2 ఫలితాల్లో భారీ నష్టాలు నమోదు చేసిన టెలికం సంస్థలు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా షేర్లు శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో నష్టాల్లో ఓపెనయ్యాయి. ఎయిర్‌టెల్‌  సుమారు ఒక శాతం నష్టంతో ఆరంభమై వెంటనే లాభాల్లోకి మరలింది. ఉదయం 9.19 సమయానికి ఎయిర్‌టెల్‌ దాదాపు 1.13 శాతం లాభంతో 366 రూపాయల వద్ద ట్రేడవుతోంది. మరో దిగ్గజం వొడాఫోన్‌ ఐడియా మాత్రం ఆరంభం నుంచి తీవ్రనష్టాల్లో ట్రేడవుతోంది. ప్రస్తుతం ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయి రూ. 2.70 వద్ద ట్రేడవుతోంది. ఈ కౌంటర్లో అమ్మకందారులు కనిపించకపోవడం గమనార్హం. క్యు2లో ఎయిర్‌టెల్‌ సుమారు రూ. 23వేల కోట్లు, వీఐఎల్‌ సుమారు రూ.51వేల కోట్ల నష్టాలను నమోదు చేశాయి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఏజీఆర్‌కు కేటాయింపుల జరపాల్సిరావడంతో ఈ సంస్థలు భారీ నష్టాలు చూపించాయి. 



You may be interested

బలపడిన రూపీ

Friday 15th November 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో శుక్రవారం సెషన్‌లో 18 పైసలు బలపడి 71.79 వద్ద ప్రారంభమైంది. కాగా గత సెషన్లో రూపీ డాలర్‌ మారకంలో ప్రారంభ లాభాలను కోల్పోయి 72 స్థాయి దిగువకు పడిపోయింది. సెషన్‌ పూర్తయ్యేనాటికి స్వల్పంగా బలపడి 71.97 వద్ద ముగిసింది. వచ్చే నెల జరగనున్న ఒపెక్‌(చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాలు) సమావేశంలో చమురు ఉత్పత్తి కోతను కొనసాగించనున్నారనే అంచనాలుండడంతో చమురు ధరలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి.

కొన్ని ప్రధాన కంపెనీల త్రైమాసిక ఫలితాలు

Friday 15th November 2019

సువెన్‌ లాభం 1,565 శాతం జంప్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ నికరలాభం అనూహ్యంగా పెరిగింది. లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 1,565 శాతం అధికమై రూ.63.27 కోట్లుగా నమోదయింది. టర్నోవరు రూ.96 కోట్ల నుంచి రూ.280 కోట్లకు ఎగసింది.  యూనియన్‌ బ్యాంక్‌ నష్టాలు రూ.1,194 కోట్లు రూ.10,557 కోట్లకు మొత్తం ఆదాయం రెట్టింపైన కేటాయింపులు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌

Most from this category