News


బుధవారం వార్తల్లో షేర్లు

Wednesday 22nd May 2019
Markets_main1558499085.png-25872

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
సింటెక్స్‌ ప్లాస్టిక్‌:
తన అనుబంధ సంస్థ సింటెక్స్‌ -  బీఏపీఎల్‌ కంపెనీ అటో విభాగాన్ని విక్రయించేందుకు ఆమోదం తెలిపింది. 
ఎడెల్వీజ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌:- తన అనుబంధ సంస్థ ఎడెల్వీజ్‌ ఇన్సూరెన్స్‌ బ్రోకర్స్‌ కంపెనీలో ఆర్థర్‌ జే. గల్లఘేర్ & కో. మైనారిటీ వాటాను కొనుగోలు చేసింది.  
ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌:- ఇక్రా రేటింగ్‌ సంస్థ కంపెనీ ధీర్ఘకాలిక రేటింగ్‌ ‘‘ఎఎ’’కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. 
ఇన్ఫోసిస్‌ ఫైనాన్షియల్‌:- మయన్మార్‌ దేశానికి చెందిన గ్లోబల్‌ ట్రెజరీ బ్యాంక్‌లో ఫైనాన్షియల్‌ కోర్‌ బ్యాంకింగ్‌ సెల్యూషన్‌ను విజయవంతంగా అమలు చేసినట్లు తెలపింది.
ఎడ్యూర్సన్‌ టెక్నాలజీస్‌:- కంపెనీ ధీర్ఘాకాలిక బుణ సౌకర్యానికి క్రిసెల్‌ రేటింగ్‌ సంస్థ ఎఎ/పాజిటివ్‌, స్వల్పకాలిక రుణ సౌకర్యాలు, కన్జ్యూమర్‌ పోర్ట్‌ఫోలియో సర్వీసెస్‌ దృష్ట్యా ఎ1(+) రేటింగ్‌ను కేటాయించింది.
సియంట్‌:- సాంకేతిక పబ్లికేషన్‌ సెల్యూషన్స్‌ సేవల పరస్పర సహకారం కొరకు వన్‌స్టాండ్‌ ఇంక్‌తో జత కట్టింది.
ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- అక్యూట్‌ రేటింగ్స్‌, రీసెర్చ్‌ కంపెనీ కమర్షియల్‌ పేపర్ల జారీ ఇష్యూకు ఎ1(+) రేటింగ్‌ను, ఎన్‌సీడీలపై ఎఎ(స్థిరత్వం) రేటింగ్‌ను కేటాయించింది. 
ఆల్కాలీ మెటల్స్‌:- యూఎస్‌ఎఫ్‌డీఏ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం యూనిట్‌కు ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఇన్‌స్పెక్షన్‌ రిపోర్ట్‌(ఈఐఆర్‌)ను జారీ చేసింది. 
ఇండియా గ్లైకాల్స్:- రూ.250 కోట్లకు మించకుండా మూలధన సమీకరణకు కొరకు బోర్డు నుంచి అనుమతులు దక్కించుకుంది.
త్రివేణీ ఇంజనీరింగ్స్‌:- జూన్‌ 3 జరిగే బోర్డు సమావేశంలో బై బ్యాక్‌ అంశాన్ని పరిశీలించనుంది. 
ఏషియన్‌ గ్రానిటీ:- ఏజీఎల్‌ పానేరియా జాయింట్‌ వెంచర్‌లో వాటా ఉపసంహరణకు సర్కూలేషన్‌ను జారీ చేసింది.

నేడు క్యూ4 ఫలితాలను వెల్లడించే కొన్ని ప్రధాన కంపెనీలు:- సిప్లా, బ్యాంకు ఆఫ్‌ ఇండియా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌, కెనరా బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఏడీఎఫ్‌ ఫుడ్స్‌, అల్‌కార్గో లాజిస్టిక్స్‌, అశోకా బిల్డ్‌కాన్‌, బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌, బజాజ్‌ హిందూస్థాన్‌ షుగర్స్‌, బాలాజీ టెలీఫిల్స్‌, కుమ్మిస్‌ ఇండియా, జీఎస్‌ఎఫ్‌సీ, హెరిటేజ్‌ ఫుడ్స్‌, జిందాల్‌ సా, జేకే లక్ష్మీ సిమెంట్స్‌, మెయిల్‌, క్వెస్‌ కార్పో, రామ్‌కో సిమెంట్స్‌, స్కిప్పర్‌, సింఫనీ, థెరామిక్స్‌ You may be interested

2వారాల కనిష్టం వద్ద పసిడి

Wednesday 22nd May 2019

డాలర్‌ ఇండెక్స్‌ 4వారాల గరిష్టానికి చేరుకోవడంతో ప్రపంచమార్కెట్లో పసిడి 2వారాల కనిష్ట ధర వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా మార్కెట్లో బుధవారం ఔన్స్‌ పసిడి ధర అరడాలరు స్వల్పలాభంతో 1,273.65డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా ఇటీవల చైనా టెలికాం దిగ్గజ కంపెనీ హువాయిపై విధించిన సుంకాలను 3నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టింది. దీంతో

పాజిటివ్‌ ఓపెనింగ్‌...సెన్సెక్స్‌ 116 పాయింట్లు అప్‌

Wednesday 22nd May 2019

క్రితం రోజు..ఆల్‌టైం గరిష్టస్థాయి నుంచి లాభాల స్వీకరణతో క్షీణించిన భారత్‌ మార్కెట్‌ బుధవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 116 పాయింట్ల లాభంతో 39,086 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 11,728 పాయింట్ల వద్ద మొదలయ్యింది.  తాజాగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నేటినుంచి ఎక్స్‌డివిడెండు అయిన ఐటీసీ ట్రేడింగ్‌ ప్రారంభంలో 2 శాతం జంప్‌చేసి రూ. 306.5 స్థాయికి చేరింది. టాటా మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌,

Most from this category