News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 9th July 2019
Markets_main1562645247.png-26908

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌:-
మెడికల్‌ అండ్‌ సర్జికల్‌ సెంటర్‌ లిమిటెడ్‌లో తన అనుబంధ సంస్థ పోర్టీస్‌ హెల్త్‌కేర్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ మొత్తం వాటాను ఉపసంహరించుకుంది. 
టైటాన్‌:- ఏప్రిల్‌ - జూన్‌ జ్యూవెలరీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 13శాతం పెరిగింది. బంగారం ధరలు అధికంగా పెరగడంతో జ్యూవెలరీ అమ్మకాలకు డిమాండ్‌ తగ్గినట్లు కంపెనీ తెలిపింది. 
సందర్‌ మేనేజెస్‌ ఐరన్‌ ఓర్‌:- ధీర్ఘకాలిక కంపెనీ అవుట్‌లుక్‌ను పాజిటివ్‌ నుంచి స్థిరత్వానికి డౌన్‌గ్రేడ్‌ చేసింది.
కెనరా బ్యాంక్‌:- వెబ్‌కాన్‌ కన్సల్టెన్సీ ఇండియా కంపెనీ ఈక్విటీ షేర్లను విక్రయించేందుకు ప్రతిపాదనలు జారీ చేసింది. 
డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌:- విల్సన్‌ వ్యాధి నివారణకు వినియోగించే ట్రైంటైన్ ఔషధాలను విక్రయానికి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది. 
గ్లెన్‌మార్క్‌ ఫార్మా:- గుండె సంబంధిత చికిత్సలో వినియోగించే రనోలజైన్‌ ఔషధ తయారీకి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది. 
ప్రైమ్‌ ఇండస్ట్రీస్‌:- ఈక్విటీ షేర్ల విభజనకు షేర్‌ హోల్డర్లు అనుమతులు తెలిపారు. రూ.10 ముఖవిలువ కలిగి ప్రతి షేరును రూ.5లు చొప్పున మొత్తం రెండు ఈక్విటీ షేర్లుగా విభజించనుంది.
భెల్‌:- కంపెనీ ఛైర్మన్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌గా నలిన్‌ సింఘాల్‌ పదవి బాధ్యతలు తీసుకున్నారు. 
మాస్టర్‌ ట్రస్ట్‌:- ఈక్విటీ షేర్ల విభజనకు షేర్‌ హోల్డర్ల అనుమతులు దక్కించుకున్నారు. 
ఎన్‌హెచ్‌పీసీ:- జూలై 6, 7 తేదిల్లో బిర్లా సునిల్‌ పవర్‌ స్టేషన్‌ యూనిట్‌ 1, 3 ల్లో, విద్యుత్‌ ఉత్పత్తి ప్రక్రియను ప్రారంభించింది.
వోల్టాస్‌:- ఎనర్జీ ఎఫెక్టివ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధమైనట్లు కంపెనీ ప్రకటించింది. ఇరు కంపెనీల భాగస్వామ్యంలో 5స్టార్‌ రేటింగ్‌ ఇన్వెర్టర్‌ ఏయిర్‌ కండీషన్‌ తయారీ, అమ్మకాలు జరపనున్నాయి. 
మాగ్మనీ ఆర్గానిక్స్‌:- అనుబంధ సం‍స్థ మాగ్మనీ ఫైన్‌కెమ్‌ క్లోరోమెథైన్‌ వాణిజ్య ఉత్పత్తులను ప్రారంభించినట్లు తెలిపింది.
హీరో మోటోకార్ప్:- ద్విచక్ర వాహనాలపై 1శాతం వరకు ధరలను పెంచినట్లు కంపెనీ తెలిపింది.
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- ఎకో ఫ్రెండ్లీ టెక్స్‌టైల్స్‌ వ్యాపారం కొరకు టర్కీ కంపెనీ కెవిన్‌ టెక్‌స్టిల్తో వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
నేడు క్యూ1 ఫలితాలను వెల్లడించే కొన్ని ప్రధాన కంపెనీలు:- టీసీఎస్‌, ఎక్సాల్‌ రియల్టీYou may be interested

తగ్గిన చమురు ధరలు

Tuesday 9th July 2019

మధ్యప్రాచ్య దేశాలలో ఉద్రిక్తతలు చమురు ధరలకు మధ్ధతుగా ఉన్నప్పటికి ట్రేడ్‌వార్‌ వలన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలు మందగించాయి. ఫలితంగా డిమాండ్‌ భయాల నేపథ్యంలో చమురు ధరలు మంగళవారం ట్రేడింగ్‌ (జులై 9 )లో నష్టపోయాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 0.3 శాతం నష్టపోయి బ్యారెల్‌కు 63.90 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 0.4 శాతం పడిపోయి 57.46 వద్ద ట్రేడవుతున్నాయి.   

68.76 వద్ద రూపీ ప్రారంభం

Tuesday 9th July 2019

గత సెషన్‌లో దేశియ ఈక్విటీ మార్కెట్లు భారీగా పతనం కావడంతో పాటు బడ్జెట్‌లో సంపన్నులపైన సర్‌ చార్జీలను పెంచడంతో 2,000 విదేశీ ఫండ్‌లపైన ప్రభావం పడింది. ఈ ఫండ్‌లు దేశియ మార్కెట్లను విడిచి పెట్టి వెళ్లిపోతాయనే భయాల నేపథ్యంలో సోమవారం 24 పైసలు బలహీనపడి డాలర్‌ మారకంలో 68.66 వద్ద ముగిసింది. రూపీ మంగళవారం ట్రేడింగ్‌లో 10 పైసలు బలహీనపడి 68.76 వద్ద ప్రారంభమైంది.

Most from this category