బుధవారం వార్తల్లోని షేర్లు
By Sakshi

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
మన్‌పసంద్ బేవరీజెస్:- కంపెనీపై జీఎస్టీ అధికారులు దర్యాప్తు చేయడంతో కంపెనీకి ఆడిటర్ సేవలు అందిస్తున్న మెహ్రా గోయల్ అండ్ కో. రాజీనామా చేసింది.
కేఆర్‌బీఎల్:- కంపెనీ బ్యాంకు రుణసౌకర్య సదుపాయాలకు ఇక్రా రేటింగ్ సంస్థ ఎఎ(స్థిరత్వం) నుంచి ఎఎ(-)కు డౌన్‌గ్రేడ్ చేసింది.
ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్:- కంపెనీ ప్రధాన ప్రమోటర్లలలో ఒకరైన రాకేశ్ గంగ్వాల్ తన ఫిర్యాదులపై జోక్యం చేసుకోవాలని కోరుతూ సెబీకి లేఖ రాసారు. ఈ అంశంపై సెబీ స్పందిస్తూ జూలై 19లో కంపెనీ సమాధానం ఇవ్వాలని కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది.
ఎస్బీఐ:- ఏడాది కాలవ్యవధి కలిగిన అన్ని వడ్డీరేట్లపై 5 బేసిస్ పాయింట్ల మేర ఎమ్సీఎల్ఆర్ను తగ్గించింది. తాజా తగ్గింపుతో ఏడాది కాల పరిమితి కలిగిన రుణాల వడ్డీరేటు 8.45 శాతం నుంచి 8.40 శాతానికి తగ్గుతాయని బ్యాంకు తెలిపింది.
అనిక్ ఇండస్ట్రీస్:- కంపెనీలో నెలకొన్న ద్రవ్యకొరత కారణంగా బ్యాంకు రుణ సౌకర్య సదుపాయ రేటింగ్ బి(+)/స్థిరత్వం నుంచి ‘‘సి’’కు డౌన్‌గ్రేడ్ చేస్తున్నట్లు కేర్ రేటింగ్ సంస్థ తెలిపింది.
గేర్వేర్ సింథటిక్స్:- కంపనీ డైరెక్టర్ పదవికి రమేష్ చందోర్కర్ రాజీనామా చేశారు.
నవభారత్ వెంచర్:- క్రిసెల్ రేటింగ్ సంస్థ బ్యాంకు రుణ సదుపాయ సౌకర్య రేటింగ్‌ను ‘‘ఎ’’గానూ ‘‘స్థిరత్వం’’ అవుట్‌లుక్‌ను కేటాయించింది.
భెల్:- హరిద్వార్ వద్ద రైలు ఆధారిత లాజిస్టిక్స్ టెర్మినల్ ఏర్పాటు కొరకు కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీతో జాయింట్ వెంచర్ ఏర్పాటుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఇండస్ ఇండ్ బ్యాంక్:- కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి హరిభక్తి అండ్ కో. ఆడిటర్ సేవలు అందించనుంది.
భారతీ ఎయిల్టెల్:- ఎయిర్టెల్ ఆఫ్రికా ఐపీఓ షేర్లు నైజీరియా స్టాక్ మార్కెట్లో ప్రతి షేరు ధర 363 నైరా(నైజీరియా కరెన్సీ)లుగా మొత్తం 3.76 బిలియన్ షేర్లు లిస్ట్ అయ్యాయి.
నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- జీటీఎల్ హాత్వే, హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్
You may be interested
టీసీఎస్ ఎఫెక్ట్..నెగిటివ్ ప్రారంభం
Wednesday 10th July 2019ఐటీ దిగ్గజం, ఇండెక్స్ హెవీవెయిట్ టీసీఎస్ 2.5 శాతం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభంకావడంతో బుధవారం స్టాక్ సూచీలు నెగిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 30 పాయింట్ల క్షీణతతో 38,700 పాయింట్ల సమీపంలోనూ, ఎన్ఎస్ఈ నిఫ్టీ 20 పాయింట్ల క్షీణతతో 11,536 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. క్రితం రోజు టీసీఎస్ ప్రకటించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరుత్సాహానికి లోనుచేయడంతో ఈ షేరు 2.5 శాతం క్షీణతతో రూ. 2,080 వద్ద మొదలయ్యింది. బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్,
ఆరు నెలల వరకు రాబడులు ఆశించొద్దు..!
Tuesday 9th July 2019మార్కెట్లో సెంటిమెంట్ చాలా బలహీనంగా ఉందన్నారు ప్రముఖ మార్కెట్ నిపుణులు, కేఆర్ చోక్సే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఎండీ దేవేన్ చోక్సే. బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొన్న వాటి అమలు సాధ్యమేనా అన్న విషయమై మార్కెట్‌కు సందేహాలున్నట్టు చెప్పారు. సమీప కాలంలో కంపెనీల ఎర్నింగ్స్ ఆశాజనకంగా ఉంటాయన్నది అనుమానమేనన్నారు. వృద్ధి తక్కువగా ఉంటే లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో దిద్దుబాటు జరగొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ