STOCKS

News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 8th August 2019
Markets_main1565237646.png-27620

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
భాష్‌:-
అనవసరమైన నిల్వలను తొలగించేందుకు రెండు యూనిట్లలో 13రోజుల పాటు ఉత్పత్తులను నిలిపివేస్తున్నట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది
మారుతి సుజుకీ ఇండియా:- వరుసగా ఆరోనెలలో ఉత్పత్తులు తగ్గిపోయాయి. ఈ జూలైలో మొత్తం 1.33లక్షల యూనిట్లను ఉత్పత్తులు చేసింది. గతేడాది ఇదే జూలైలో జరిగిన 1.75లక్షల ఉత్పత్తులతో పోలిస్తే ఇది 25శాతం తక్కువ. వ్యయ నియంత్రణలో ఉత్పత్తులను తగ్గించుకున్నట్లు కంపెనీ తెలిపింది.
గుజరాత్‌ అల్కేస్‌:- భారీ వర్షం కారణంగా దహేజ్‌ యూనిట్‌లో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. 
సంభవ్‌ మీడియా:- తన అనుబంధ సంస్థ వీఈడీ టెక్నోసర్వ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెక్‌ ఆర్డర్లు దక్కించుకుందని తెలిపింది. 
సికాల్‌ లాజిస్టిక్స్‌:- ఇక్రా రేటింగ్‌ సంస్థ ధీర్ఘకాలిక రేటింగ్‌ను బిబి(+) నుంచి బిబి(నెగిటివ్‌)కు, స్వల్పకాలిక రేటింగ్‌ను బిబిబి(+)నుంచి ఎ4కు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది.
ఎన్‌బీసీసీ:- జూన్‌, జూలై కాలానికి మొత్తం రూ.201.77 కోట్ల ఆర్డర్లు దక్కించుకున్నట్లు తెలిపింది.
విప్రో:- కెనడాకు చెందిన మోట్రినల్‌ విమాయాన కంపెనీకి ఐదేళ్ల పాటు సాంకేతిక సేవలు అందేంచేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
ఫోనిక్స్‌ మిల్స్‌:- తన హాస్పిటిలిటీ వ్యాపార విభాగాన్ని విలీనం చేసుకునేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. 
డిష్‌ టీవీ:- ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీతో విలీన వార్తలను ఖండించింది.
నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎబీసీసీ, పేజ్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫీభీమ్‌ అవెన్యూస్‌, మాక్స్‌ ఇండియా, యూకో బ్యాంక్‌, రిలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఆర్‌సీఎఫ్‌, ఇక్రాన్‌ ఇంటర్నేషన్‌, మహానగర్‌ గ్యాస్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా కెమికల్స్‌, ఇంజినీర్స్‌ ఇండియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, రైల్‌ వికాస్‌ నిగమ్‌, మిధాని, మ్యాక్స్‌ ఇండియా, వండర్‌లా హాలిడేస్‌You may be interested

పసిడిలో స్వల్ప లాభాల స్వీకరణ

Thursday 8th August 2019

ప్రపంచ మార్కెట్లో గరిష్ట స్థాయిల వద్ద పసిడి ఫ్యూచర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌లో 16డాలర్లు నష్టపోయింది. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల ట్రేడింగ్‌ కారణంగా అక్కడి మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 35.40 డాలర్లు లాభపడి 1,519.60 వద్ద స్థిరపడింది. ఈ నేపథ్యంలో నేడు ఆసియాలో ట్రేడర్లు, ఇన్వెస్టర్లు పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణకు పూనుకోవడంతో 16డాలర్లు మేర క్షీణించి 1,503.75

భారీ పతనం తర్వాత పెరిగిన చమురు

Thursday 8th August 2019

డాలర్‌ బలహీనపడడంతో చమురు ధరలు భారీ పతనం తర్వాత గురువారం కొలుకున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 2.29 శాతం పెరిగి బ్యారెల్‌కు 57.52 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 2.54 శాతం పెరిగి బ్యారెల్‌కు 52.39 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. కాగా యుఎస్‌-చైనా ట్రేడవార్‌ వలన చమురు డిమాండ్‌ భయాలు మదుపర్లను ఇంకా వెంటాడుతున్నాయి. ఫలితంగా గత సెషన్లో చమురు ధరలు 4 శాతం మేర పడిపోయాయి. ‘యుఎస్‌ డాలర్‌ బలహీనత క్రూడ్‌

Most from this category