News


శుక్రవారం వార్తల్లో షేర్లు

Friday 28th June 2019
Markets_main1561693838.png-26640

వివిధ వార్తల‌కు అనుగుణంగా శుక్రవారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు 
టాటా స్టీల్‌:-
యూర‌ప్ విభాగంపు సీఈవోగా హెన్రిక్ ఆడ‌మ్ స్థానంలో హ‌న్స్ ఫిచ‌ర్ నియ‌మితుల‌య్యారు. 
లుపిన్:- మైర్బెట్రిక్ ఔష‌ధాల జనరిక్ కోసం యూఎస్ఎఫ్‌డీఏ నుంచి తాత్కలిక అనుమతులు ద‌క్కించుకుంది.
క్వెస్ కార్పోరేష‌న్‌:- మూల‌ధ‌న నిధుల స‌మీక‌ర‌ణ ప్రక్రియ‌ను వాయిదా వేసింది.   
కెన్ ఫిన్ హోమ్స్:- కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సీఈవోగా శ‌ర‌త్ కుమార్ హోటా రాజీనామా చేశారు. 
జీహెచ్ సీఎల్‌:-  కంపెనీ రూ.25 కోట్ల విలువైన క‌మ‌ర్షియ‌ల్ పేప‌ర్లను జారీ చేసింది. 
ఇంసిల్కో:- నిల్వలు భారీగా పెర‌గ‌డంతో  జూన్ 07 నుంచి జూలై 09 వ‌ర‌కు ప్లాంట్ మూసివేస్తున్నట్లు ప్రక‌టించింది. 
ఎంఎంటీసీ:- నీలాచ‌ల్ ఇస్పాత్‌ నిగ‌మ్ లిమిటెడ్ జాయింట్ వెంచ‌ర్‌లో ఈక్విటీ వాటా ఉప‌సంహ‌కోవాలని భావిస్తుంది. 
బ్యాంక్ ఆఫ్ బ‌రోడా:-  విలీన బ్యాంకులైన విజ‌యాబ్యాంక్‌, దేనా బ్యాంక్ లతో క‌లిపి ఏప్రిల్ 2019 నుంచి బ్యాలెన్స్ షీట్‌ను రూపొందించేందుకు ఆమోదం తెలిపింది.
స్టార్ పేప‌ర్ మిల్స్‌:- మ‌రో మూడేళ్ల పాటు మ‌ధుక‌ర్ మిశ్రా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా  కొన‌సాగనున్నారు. 
హైటెక్ గేర్స్‌:- కంపెనీ సీఎఫ్ఓగా దినేష్ చంద్ శ‌ర్మ రాజీనామా చేశారు. 
కాక్స్‌ అండ్‌ కింగ్స్‌:- ఎన్‌డీఎలపై రూ.150 కోట్లు  చెల్లించడంలో విఫలమైంది. 
ఎక్సెల్‌ ఇండస్ట్రీస్‌:- నెట్‌ మాట్రిక్స్‌ కార్ప్‌ కేర్‌కు చెందిన కెమికల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ విలీనానికి బోర్డు ఆమోదం తెలిపింది.
మాక్స్‌ ఇండియా:- ఫార్మామాక్స్‌ గ్రూప్‌లో తన మొత్తం వాటాను ఉపసంహరించుకుంది. 
ఎన్‌ఎమ్‌డీసీ:- స్టీల్‌ ప్లాంట్‌ కాంటాక్టుకు సంబంధించి భెల్‌ కంపెనీ నుంచి టెర్మినేషనల్‌ నోటీసును అందుకుంది. 
బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర:- ఎఫ్‌పీఓ/రైట్స్‌ ఇష్యూ/క్యూఐపీ/ఫ్రిపరెన్షియల్‌ ఇష్యూల ద్వారా కంపెనీ రూ.3000 కోట్ల మూలధన నిధుల సమీకరణను పూర్తి చేసింది. 
ఐఎఫ్‌సీఐ, జెట్‌ ఎయిర్‌వేస్‌, పీసీ జ్యూవెలరీస్‌, రిలయన్స్‌ పవర్‌ షేర్లను సెక్యూరిటీ లెండింగ్‌ అండ్‌ బారోయింగ్‌(ఎస్‌ఎల్‌బీ) విభాగం నుంచి తొలగించినట్లు ఎన్‌సీఈ ప్రకటించింది. 
గురువారం దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు 0.71 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల‌ను విక్ర‌యించారు. స్వదేశీ ఇన్వెస్టర్లు రూ.196.57 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసిన‌ట్లు ఎన్ఎస్ఈ గ‌ణాంకాలు తెలియ‌జేశాయి.You may be interested

69 దిగువకు రూపీ

Friday 28th June 2019

డాలర్‌ మారకంలో రూపీ శుక్రవారం(జూన్‌ 28) ట్రేడింగ్‌లో 8 పైసలు బలపడి 68.98 వద్ద ట్రేడవుతోంది. చమురు ధరలు తగ్గడంతో పాటు అమెరికా డాలర్‌ బలహీనంగా ఉండడంతో గత సెషన్‌లో రూపీ 8 పైసలు బలపడి 69.06 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 11 తర్వాత రూపీ 69 కిందకు రావడం ఇదే మొదటి సారి.   ఈ వారం చివరిలో అమెరికా-చైనా సమాశం జరగనుండడంతో మదుపర్లు జాగ్రత్తను

స్వల్పలాభాలతో ప్రారంభం

Friday 28th June 2019

 ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్నా, జూలై డెరివేటివ్‌ కాంట్రాక్టులకు తొలిరోజైన శుక్రవారం భారత్‌ సూచీలు స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 40 పాయింట్ల పెరుగుదలతో 39,630 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19 పాయింట్లు జంప్‌చేసి 11,861 పాయింట్ల వద్ద మొదలయ్యింది. అదాని పోర్ట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహింద్రాలు 1 శాతం లాభంతో ప్రారంభంకాగా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్‌ఫ్రాటెల్‌, జీ టెలి, యాక్సిస్‌బ్యాంక్‌, టైటాన్‌ షేర్లు

Most from this category