News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 12th June 2019
Markets_main1560313817.png-26235

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
అదానీ గ్రీన్‌:-
ప్రమోటర్లు ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా 6శాతం వాటాను విక్రయించనున్నారు. నేఢు ప్రారంభం కానున్న ఈ ఓపెన్‌ ఆఫర్‌ రేపటితో ముగియనుంది. ఇందుకు షేరు ఫ్లోర్‌ ధరను రూ.43లుగా నిర్ణయించారు. 
ఇండియా సిమెంట్స్‌:- ప్రమోటర్‌ తనఖా పెట్టిన 1.68శాతం వాటాను సోమవారం విడుదల అయ్యాయి.
వోల్టాస్‌:- కంపెనీ సీఎఫ్‌ఓగా అభిజిత్ గజేంద్రకద్కర్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో డిప్యూటీ ఎండీగా సేవలు అందిస్తున్న జార్జ్‌ సీఎఫ్‌ఓ పదవికి ఎన్నికయ్యారు.
యస్‌ బ్యాంక్‌:- ప్రీపెయిడ్ నిబంధలను ఉల్లఘించినతో ఆర్‌బీఐ రూ.11.2 కోట్ల జరిమానాను విధించింది. అలాగే కంపెనీ జనరల్‌ మేనేజర్‌ ముఖేష్‌ సబర్వాల్‌ రాజీనామా చేశారు. 
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:- ఎన్‌సీడీలపై రుణదాతలకు జూన్‌ 04న రూ.962 కోట్ల వడ్డీని చెల్లించింది. 
సుజ్లాన్‌ ఎనర్జీ:- రుణాన్ని తగ్గించుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అందులో భాగంగా తాజా ఈక్విటీ షేర్ల జారీ, అనుబంధ సంస్థల్లో వాటా విక్రయం, సబ్సిడిరీలను తగ్గించుకోవడం తదితర అంశాలను పరిశీలిస్తుంది. 
టాటా స్టీల్‌:- జర్మన్‌ ఉక్కు దిగ్గజం థీస్సెన్‌క్రూప్‌ భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే జాయింట్‌ వెంచర్‌ కంపెనీ ఏర్పాటు ప్రతిపాదనను నిలిపివేస్తున్నట్లు యూరోపియన్ కమిషన్  ప్రకటించింది. 
కేఈసీ ఇంటర్నేషనల్‌:- కంపనీ స్వతంత్ర డైరెక్టర్‌ పదవికి మనీషా గిరోత్రా రాజీనామా చేశారు. 
సీ టీవీ నెట్వ్‌వర్క్‌:- కంపనీ ఛీప్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసరుగా మనీష్‌ జైన్‌ నియమితులయ్యారు. 
యస్‌ బ్యాంక్‌:- రేటింగ్‌ తగ్గించే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ సంకేతాలనిచ్చింది. 
సింప్లెక్స్ ఇండస్ట్రీస్:- క్రెడిట్ రేటింగ్‌ను యథాతథ స్థితిలో కొనసాగిస్తున్నట్లు కేర్ రేటింగ్స్ సంస్థ తెలిపింది. 



You may be interested

పన్ను విధానాల్ని సరళం చేయాలి

Wednesday 12th June 2019

ఆర్థికమంత్రికి పారిశ్రామికుల ‘బడ్జెట్‌’ సూచనలు కార్పొరేట్‌ పన్నులు తగ్గించాలని అభ్యర్థన మౌలిక రంగంలో పెట్టుబడులు పెంపునకు వినతి న్యూఢిల్లీ:  కేంద్రంలో కొత్తగా కొలువుతీరిన నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) పూర్తి స్థాయి బడ్జెట్‌ను జూలై 5వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో మంగళవారం పారిశ్రామిక రంగం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు కీలక బడ్జెట్‌ సూచనలు చేసింది. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, పన్ను విధానాలను మరింత సరళతరం చేయడం, మౌలిక రంగంలో

11950 దిగువన నిఫ్టీ ప్రారంభం

Wednesday 12th June 2019

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ బుధవారం నష్టంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 100 పాయింట్ల నష్టంతో 39850 వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల తగ్గుదలతో 11935 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. వరుసగా ఆరు రోజులపాటు ర్యాలీ చేసిన అమెరికా మార్కెట్లో  లాభాల స్వీకరణతో నిన్న రాత్రి నష్టాల్లో ముగిశాయి. వాణిజ్య యుద్ధ భయాలు మరోసారి తెరపైకి రావడంతో ఆసియా మార్కెట్లు నేడు నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది.

Most from this category