News


గురువారం వార్తల్లో షేర్లు

Thursday 25th July 2019
Markets_main1564027259.png-27295

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
యస్‌ బ్యాంక్‌:-
పలు బాండ్లపై ధీర్ఘకాలిక రేటింగ్‌ను తగ్గించడంతో పాటు నెగిటివ్‌ అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్లు రేటింగ్‌ సంస్థ ఇక్రా ప్రకటించింది.
మెక్‌నల్లీ భారత్‌ ఇంజనీరింగ్స్‌ కంపెనీ:- హాంగ్‌కాంగ్‌ ఆధారిత కంపెనీ ఎస్‌జీటీఓఆర్‌జీ నుంచి రూ.50 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకుంది. ఇందులో భాగంగా కంపెనీకి రెండేళ్ల పాటు డిజైన్‌ అండ్‌ ఇంజనీరింగ్స్‌ సేవలు అందించడం, ఎక్విప్‌మెంట్‌ సరఫరా చేయాల్సి ఉంటుంది. అలాగే ఈపీస్ఎస్‌ పద్ధతిలో 3నెలలు మెయింటెన్స్‌ సర్వీసులు అందిచాల్సి ఉంటుంది.
జీహెచ్‌సీఎల్‌:- కమర్షియల్‌ పేపర్ల జారీ ద్వారా కంపెనీ రూ.25 కోట్లను సమీకరించింది.
ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- కంపెనీ రుణ సౌకర్యపు అవుట్‌లుక్‌ రేటింగ్‌ను స్థిరత్వం నుంచి నెగిటివ్‌కు కేర్‌ రేటింగ్‌ సంస్థ డౌన్‌గ్రేడ్‌ చేసింది.
సాగర్‌ సిమెంట్స్‌:- ప్రతి ఈక్విటీ షేరు ధర రూ.730 చొప్పున ప్రమోటర్లకు మొత్తం 15.5లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేసింది.
త్రిభూవన్‌దాస్‌ భీమ్‌జీ జువేరీ:- అక్విటీ రేటింగ్‌ సంస్థ కంపెనీ ధీర్ఘకాలిక రుణ సౌకర్యపు సదుపాయానికి ఎ(-) రేటింగ్‌, స్థిరత్వం అవుట్‌లుక్‌ను కేటాయించింది. 
నోడియా టాల్‌ బ్రిడ్జ్‌ కంపెనీ:- కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పదవికి అజయ్‌ మథూర్‌ రాజీనామా చేశారు. 
డీబీ రియల్టీ:- ప్రమోటర్‌ 15లక్షల ఈక్విటీ షేర్లను ఆనంద్‌రాఠి గ్లోబల్‌ ఫైనాన్స్‌ వద్ద తనఖా పెట్టారు. 
సందర్‌ టెక్నాలజీస్‌:- దక్షిణ కొరియా దేశానికి చెందిన హన్‌ షిన్‌ కార్పోరేషన్‌ కంపెనీతో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇండియాలో అటో పరిశ్రమకు కావల్సిన విడిభాగాలు, ఎలక్ట్రానిక్‌ పార్టుల తయారీతో పాటు, విక్రయం చేయనుంది.
భెల్‌:- ఎన్‌టీపీసీతో కలిసి జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేయనుంది. 
షుగర్‌ స్టాక్స్‌:- 2019-20 ఏడాదిగానూ క్వింటల్‌ చక్కెర ధరను రూ.275లుగా నిర్ణయిస్తూ కేంద్ర కేబినేట్‌ ఆమోదం తెలిపింది. 
నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- టాటామోటర్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, అంబుజా సిమెంట్స్‌, బయోకాన్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌, ఐఎఫ్‌బీ ఇండస్ట్రీస్‌, తాజ్‌ జీవీకే హోటల్స్‌, శ్రేయాస్‌ ఇండస్ట్రీస్‌, ఆర్‌ఎస్‌ సాఫ్ట్‌వేర్‌, టాటాస్టీల్‌ బీఎస్‌ఎల్‌, సోమ్‌ డిస్ట్రిలరీస్‌ బేవరీజేస్‌, గ్రేన్‌లామ్‌ ఇండస్ట్రీస్‌, తిరుమలై కెమికల్స్‌, టాటా కాఫీ, జీనీయస్‌ పవర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, గృహ్‌ ఫైనాన్స్‌, జుబిలెంట్‌ ఇండస్ట్రీస్‌, పర్‌సిసెంట్ సిస్టమ్స్‌, ఎంఫసీస్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌, సౌత్‌ ఇండియా బ్యాంక్‌.You may be interested

68.98 వద్ద రూపీ ప్రారంభం..

Thursday 25th July 2019

రూపీ డాలర్‌ మారకంలో 3 పైసలు బలహీనపడి గురువారం ట్రేడింగ్‌లో  68.98 వద్ద ప్రారంభమైంది. విదేశి పెట్టుబడుల ఔట్‌ ఫ్లోతో పాటు మేజర్‌ కరెన్సీలతో పోల్చితే డాలర్‌ బలపడడంతో గత కొన్ని సెషన్‌ల నుంచి రూపీ డాలర్‌ మారకంలో బలహీనపడుతోంది. గత సెషన్‌లో 4 పైసలు బలహీనపడి 68.95 వద్ద ముగిసింది. ఈ రోజు డాలర్‌ మారకంలో రూపీ 68.60-69.30 పరిధిలో కదలాడవచ్చని విశ్లేషకులు తెలిపారు. 

పాజిటివ్‌ ప్రారంభం

Thursday 25th July 2019

ఐదు రోజులుగా వరుస నష్టాల్ని చవిచూసిన భారత్‌ స్టాక్‌ సూచీలు గురువారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. 85 పాయింట్ల లాభంతో 37,935 పాయింట్ల వద్ద ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ కొద్దిసేపట్లోనే 150 పాయింట్లు లాభపడి 38,000 పాయింట్ల స్థాయిని దాటింది.  20 పాయింట్ల లాభంతో 11,292 పాయింట్ల వద్ద మొదలైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  కొద్ది నిముషాల్లోనే 11,300 పాయింట్ల స్థాయిని అధిగమించింది. 

Most from this category