News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 13th June 2019
Markets_main1560402890.png-26260

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితయ్యే షేర్ల వివరాలు 
టాటా మోటర్స్‌:-
అంతర్జాతీయంగా మేనెలలో అమ్మకాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గతేడాది మేలో జరిగిన అమ్మకాలతో పోలిస్తే 23 శాతం 82,374 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే నెలలో జేఎల్‌ఆర్‌ అమ్మకాలు 39,895 యూనిట్లుగా ఉన్నాయి.
సెయిల్‌:- నష్టాల్లో ఉన్న యూనిట్లను విక్రయించే యోచనలో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. 
హెచ్‌సీసీ:- జూన్‌ 17న జరిగే బోర్డు సమావేశంలో నిధుల సమీకరణ ప్రతిపాదనుకు షేర్లు హోల్డర్లు ఆమోదం తెలిపనున్నారు. 
విప్రో:- ఐటీ సేవల కొరకు అంతర్జాతీయ సంస్థ  మోగ్‌సాఫ్ట్‌తో జట్టు కట్టింది. 
అలహాదాబాద్‌ బ్యాంక్‌:- వివిధ రకాల రుణాలపై  ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను 5 బేసిస్‌ పాయింట్లను తగ్గించాలని నిర్ణయించింది. సవరించిన వడ్డీరేట్లు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. 
టైగర్‌ లాజిస్టిక్‌:- బ్యాంకు సౌకర్యాల దృష్ట్యా రుణ రేటింగ్‌ అవుట్‌లుక్‌ను ‘‘స్థిరత్వం’’ నుం‍చి ‘‘నెగిటివ్‌’’కు సవరించింది. 
మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌:- రిలయన్స్‌ బ్రాడ్‌కాస్ట్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌ విలీనం కొరకు వ్యూహాత్మక బిడ్డింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
ఎన్‌టీపీసీ:- ఈస్ట్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌తో కలిసి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
జెట్‌ ఎయిర్‌వేస్‌:- స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ఈనెల 28 నుంచి  షేర్ల ట్రేడింగ్‌పై పరిమితులు విధించనుంది.
పీఎఫ్‌సీ:- అంతర్జాతీయ మార్కెట్లలో బాండ్లను జారీ చేసి రూ.6930 కోట్ల నిధులను సమీకరించింది. 
ఐఎఫ్‌సీ:- కంపెనీ జనరల్‌ మేనేజర్‌ రాజేష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.
రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌:- ఆడిటింగ్‌ బాధ్యతల నుంచి ప్రైస్‌ వాటర్‌హౌస్‌ తప్పుకుంది.You may be interested

60 డాలర్ల దిగువకు క్రూడ్‌

Thursday 13th June 2019

క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గురువారం స్థిరంగా ట్రేడవుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ప్యూచర్‌ 0.2శాతం పెరిగి 60.09 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ క్రూడ్‌ బుధవారం 3.7శాతం కోల్పోయి ఐదు నెలల కనిష్ఠమైన 59.97 డాలర్లకు పడిపోయింది. అమెరికా క్రూడ్‌ నిల్వలు పెరగడంతో పాటు మందగమనం కారణంగా డిమాండ్‌ తగ్గడంతో గత సెషన్‌లో 4 శాతం మేర నష్టపోయాయి. యూఎస్‌ వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర

11900 దిగువన ప్రారంభమైన నిఫ్టీ

Thursday 13th June 2019

క్రితం నష్టాల ముగింపునకు కొనసాగింపుగా మార్కెట్‌  గురువారం కూడా నష్టాలతోనే మొదలైంది. నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 11900 స్థాయి దిగువన 11,874ల వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 77 పాయింట్లను కోల్పోయి 39,679 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలు, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి ఫ్లాట్‌ ప్రారంభం, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల తరలింపు తదితర అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి.

Most from this category