STOCKS

News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 11th September 2019
Markets_main1568177182.png-28301

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
సన్‌ఫార్మా:-
రష్యాకు చెందిన పిజేఎస్సీ బయోసింటెజ్‌ కంపెనిలో తన మొత్తం వాటాను 100శాతానికి పెంచుకుంది.
జేకే టెర్స్‌:- కంపెనీ డిప్యూటీ ఎండీగా అన్షుమాన్ సింఘానియా రాజీనామా చేశారు.
టాటా మోటర్స్‌:- ఆగస్ట్‌లో జేఎల్‌ఆర్‌ రిటైల్‌ అమ్మకాలు గతేడాది ఇదే నెలతో పోలిస్తే 6.7శాతం క్షీణించి 34,176 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్స్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌:- కంపెనీ అడిటర్‌ సంస్థగా బాస్కర్‌ అండ్‌ కో ని నియమించింది.
మేఘ్మని ఆర్గానిక్స్‌:- తన అనుబంధ సంస్థ రూ. 275 కోట్ల విలువైన ఎపిక్లోరోహైడ్రిన్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
వరుణ్‌ బేవరీజెస్‌:- లూనార్మెచ్ టెక్నాలజీస్‌లో 20శాతం వాటా కొనుగోలుకు బోర్డు ఆమోదం తెలిపింది. 
గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌:- క్లోబెటాసోల్ ప్రొపియోనేట్ ఫామ్‌ ఔషధానికి ఎఎన్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది. 
ఎమ్కో ఎలెకాన్:- కంపెనీ ఎగ్జిక్యూటివడ్‌ డెరెక్టర్‌గా నారాయన్‌ ద్వివేది నియమితులయ్యారు. 
ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌:- క్రిసెల్‌ రేటింగ్స్‌​ సంస్థ దీర్ఘకాలిక రేటింగ్‌ను ఎఎ(+)గానూ, ధీర్ఘకాలిక రేటింగ్‌ను ఎ1(+)గా అప్‌గ్రేడ్‌ చేసినట్లు ఎక్సే‍్చంజీలకు సమాచారం ఇచ్చింది. 
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌:- సంకల్ప్‌ సెమికండక్టర్‌ను విలీనం చేసుకుంది. 
టీసీఎస్‌:- డిజిటల్‌ పరివర్తనను వేగవంతం చేసే పరిష్కారాలను రూపొందించడానికి సిస్కో కంపెనితో జతకట్టింది. 
డీఎఫ్‌ఎం ఫుడ్స్‌:- ఏ1 గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్ (సైప్రస్) పీసీసీ 26 శాతం వాటాను రూ.249.50 చొప్పున కొనుగోలు చేయడానికి ఓపెన్ ఆఫర్ ఇచ్చింది
పీఎన్‌బీ:- కేంద్రాన్ని ఫ్రిపరెన్షియల్‌ ఇష్యూ పద్దతిలో ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.800 కోట్ల మూలధన సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.You may be interested

నిఫ్టీలో షార్ట్స్‌ వద్దు!

Wednesday 11th September 2019

నిపుణుల సూచన నిఫ్టీ టెక్నికల్‌ సెటప్‌ చూస్తే బేరిష్‌ నుంచి బుల్లిష్‌ ట్రెండ్‌లోకి మారినట్లు కనిపిస్తుందని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందువల్ల ఈ సమయంలో కొత్త షార్ట్స్‌ వద్దని, కావాలంటే లాంగ్స్‌ పరిశీలించవచ్చని సలహా ఇస్తున్నారు. లాంగ్స్‌కు 10787పాయింట్లను స్టాప్‌లాస్‌ను పెట్టుకోవాలని సూచించారు. ఐదు వారాలుగా నిఫ్టీ 10750- 11100 పాయింట్ల రేంజ్‌లో కన్సాలిడేట్‌ అవుతోంది. దిగువన నిఫ్టీ వంద రోజుల డీఎంఏ వద్ద మద్దతు పొందుతోంది. నిఫ్టీకి 11142- 11181

వృద్ధి రేటు అంచనా 6.6 శాతానికి తగ్గింపు

Wednesday 11th September 2019

వృద్ధి రేటు అంచనా 6.6 శాతానికి తగ్గింపు న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) గతంలో వేసిన 6.8 శాతం నుంచి 6.6 శాతానికి రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ తాజాగా తగ్గించింది. అధిక రుణ భారం కారణంగా ద్రవ్య విధానాన్ని సడలించే అవకాశాలు ప్రభుత్వానికి పరిమితంగానే ఉన్నాయని ఈ సంస్థ అభిప్రాయపడింది. రానున్న సంవత్సరంలో భారత జీడీపీ 7.1 శాతానికి పుంజుకునే అవకాశం ఉందని

Most from this category