News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 3rd September 2019
Markets_main1567481054.png-28153


వస్తు తయారీ రంగం పనితీరు ఆగస్టులో 15నెలల కనిష్టానికి పడిపోయింది.
 భారత జీడీపీ క్యూ1లో వృద్ధిరేటు వరుసగా ఆరో త్రైమాసికంలో పతనమైంది. 
జీఎస్‌టీ వసూళ్లు ఆగస్ట్‌లో ఈ ఆర్థిక సంవత్సరంలోనే  అత్యల్పంగా రూ.98, 202 కోట్లు వసూళ్లయ్యాయి. 
ఆగస్టులో వాహన విక్రయాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. 

రియలన్స్‌ కమ్యూనికేషన్స్‌:- డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌కు వ్యతిరేకంగా ధాఖలు చేసిన పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకుంది. 
బయోకాన్‌:- యూఎస్‌ఎఫ్‌డీఏ ఇన్సులిన్ గ్లార్జిన్ ఔషధానికి సీఆర్‌ఎల్‌(కంప్లీట​ రెస్పాన్స్‌ లెటర్‌)ను కేటాయించింది. 
ఎస్‌పీఎంల్‌ ఇన్ఫ్రా:- ప్రపంచ బ్యాంక్‌ నుంచి రూ.1774 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకుంది. 
న్యూలాండ్‌ ల్యాబ్స్‌:- హైదరాబాద్‌ యూనిట్‌కు యూఎస్‌ఎఫ్‌డీ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఇన్ఫెక్షన్‌ రిపోర్ట్‌ను జారీ చేసింది. 
కాఫీ డే ఎంటర్‌టైన్‌మెంట్‌:- ఆర్థిక వ్యవహారాలపై దర్యాప్తు చేసేందుకు కంపెనీ సీబీఐ మాజీ డీజీ అశోక్‌ మల్హోత్రాను నియమించింది. 
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:- మొత్తం రుణంలో, లేదా కొంతభాగాన్ని షేర్లు, ఇతర సెక్యూరిటీస్‌లోకి మార్చేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. రుణమార్పిడి యాజమాన్యంలో మార్పుకు దారితీయవచ్చు. 
పీఎన్‌బీఐ:- ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యూనిటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలు విలీనం కానున్నాయి. తద్వారా దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకుగా అవతరించునుంది. 
కెనరా బ్యాంక్‌:- సిండికేట్‌ బ్యాంక్‌ విలీనంతో దేశంలో నాలుగో అతిపెద్ద బ్యాంకుగా ఏర్పాటు కానుంది.
యూనియన్‌ బ్యాంక్‌ ఇండియా:- కార్పోరేషన్‌ బ్యాంక్‌, ఆంద్రా బ్యాంక్‌ల విలీనంతో దేశంలోనే ఐదో పెద్దగా మారనుంది. 
ఇండియా బ్యాంక్‌, అలహబాద్‌ బ్యాంక్‌:- రెండు బ్యాంకులు విలీనం కానున్నాయి. 
ఇండియా హౌసింగ్‌ ఫైనాన్స్‌:- కంపెనీ ధీర్ఘకాలిక రేటింగ్‌ను ఎఎ(+)గానూ, స్వల్పకాలిక రేటింగ్‌ను ఎ1(+)గానూ సవరించింది. 
ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌:- ఎస్‌డీలపై అసలు, వడ్డీరేట్లను సకాలంలో చెల్లించినట్లు ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చింది. 
కర్ణాటక బ్యాంక్‌:- ఏడాది కాలపరిమితి గల ఎంసీఎల్‌ఆర్‌ వడ్డీరేట్లను 9.25శాతంగా నిర్ణయించింది. 
భెల్‌ లిమిటెడ్‌:- నీలాంచల్‌ ఇస్పాట్‌ నిగమ్‌లో రూ.5కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టింది. 
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌:- బ్యాంకు సదుపాయాలపై ఇక్రా రేటింగ్‌ సంస్థ ధీర్ఘకాలిక రేటింగ్‌ను ఎఎగానూ, స్వల్పకాలిక రేటింగ్‌ ఎ1(+) రేటింగ్‌గానూ సవరించింది.You may be interested

నిఫ్టీ 100 పాయింట్లు... సెన్సెక్స్‌ 300 పాయింట్లు క్రాష్‌

Tuesday 3rd September 2019

మూడు రోజుల వరుస సెలవుల అనంతరం మంగళవారం దేశీయ మార్కెట్‌ నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 141 పాయింట్లు నష్టంతో 37,181.76 వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల పతనంతో 11000 దిగువున 10,960.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌(క్యూ1)లో దేశ జీడీపీ ఆరేళ్లలోనే కనిష్టానికి పతనమైన 5శాతమే పురోగతి సాధించడటం, పీఎస్‌యూ బ్యాంకులను విలీనం, వస్తు తయారీ రంగం పనితీరు ఆగస్టులో 15నెలల కనిష్టానికి పడిపోవడం, జీఎస్‌టీ వసూళ్లు

తగ్గిన జీడీపీ...పెట్టుబడులకు ఇది మంచి అవకాశం

Monday 2nd September 2019

-విశ్లేషకులు  ఆర్థిక సంవత్సరం 2020 మొదటి త్రైమాసికానికి సంబంధించి దేశ జీడీపి 5 శాతంగా నమోదైంది. కాగా ఇది ఆరేళ్ల కనిష్టం కావడం గమనార్హం. మార్కెట్‌ సెంటిమెంట్‌ దేశ జీడీపీతో ముడిపడి ఉండడం వలన మార్కెట్‌ మరింత పతనమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు తెలిపారు. అయినప్పటికి ఈ పరిస్థితిని ఇన్వెస్ట్‌ చేయడానికి ఉపయోగించుకోవాలని సలహాయిస్తున్నారు. ‘జూన్‌ త్రైమాసికపు జీడీజీ వృద్ధి రేటు మా అంచనా కంటే తక్కువగా ఉంది. దీని ఫలితంగా

Most from this category