STOCKS

News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 16th August 2019
Markets_main1565929258.png-27797

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
భాష్‌ లిమిటెడ్‌:- రెండో త్రైమాసిక కాలం నుంచి  ప్రతి నెలలో 10రోజుల పాటు వివిధ ప్లాంట్లలో ‘‘నో ప్రాడెక్ట్స్‌ డే’’ పాటించనుంది. ఈ పదిరోజుల్లో ‘‘పవర్‌ట్రైన్‌ సెల్యూషన్స్‌ డివైజెస్‘‘ అభివృద్ధిపై పూర్తి దృష్టి సారించనున్నట్లు కంపెనీ తెలిపింది. 
యస్‌ బ్యాంక్‌:- క్యూఐపీ ఇష్యూ ద్వారా రూ.1,930 కోట్ల సమీకరణను పూర్తి చేసింది. ఆగస్ట్‌ 9న ప్రారంభమైన ఈ ఇష్యూకు 14వ తేదిన ముగిసినట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. 
యస్‌బీఐ:- పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా కార్డు వ్యాపారంలో వాటాను తగ్గించుకోవడానికి ప్రాథమిక అనుమతులు దక్కించుకుంది. ప్రస్తుతం ఎస్‌బీఐ కార్డు అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 74శాతం వాటాను కలిగి ఉంది. 
ఐడీఎఫ్‌సీ:- తన అనుబంధ సంస్థ ఐడీఎఫ్‌సీ పైనాన్షియల్‌ హోల్డింగ్‌ కలిసి ధర్మేంద్ర మెహతా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా ఇరు కంపెనీలు ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీలో 100 శాతం ఈక్విటీ వాటాను ధర్మేంద్ర మెహతాకు వాటాలను విక్రయించనున్నారు. 
టాటా మోటర్స్‌:- క్రిసెల్‌ రేటింగ్‌ సంస్థ కంపెనీ ధీర్ఘాకలిక రేటింగ్‌ను ఎఎ/నెగిటివ్‌ నుంచి ఎఎ(-) నెగిటివ్‌కు డౌన్‌గ్రేడ్‌ చేయడంతో పాటు నెగిటివ్‌ అవుట్‌లుక్‌ను కేటాయించింది. జేఎల్‌ఆర్‌ వ్యాపారం బలహీనంగా ఉండటం ఇందుకు కారణంగా చెప్పుకొచ్చింది. అయితే స్వల్పకాలిక రేటింగ్‌ను ఎలాంటి మార్పు చేయలేదు.
ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌:- మూడీస్‌ రేటింగ్‌ సంస్థ దీర్ఘకాలిక కార్పొరేట్‌ రేటింగ్‌ను బీఏ1 నుంచి బీఏ2కి తగ్గిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ వెల్లడించింది. అలాగే భవిష్యత్ అంచనాలను కూడా 'స్థిర' స్థాయి నుంచి 'నెగటివ్‌' స్థాయికి తగ్గించినట్లు తెలిపింది.  
సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా:- వడ్డీరేట్లపై ఎంసీఎల్‌ఆర్‌ను 20 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. సవరించిన వడ్డీరేట్లు ఆగస్ట్‌ 15నుంచి అమల్లోకి రానున్నాయి
కాక్స్‌ అండ్‌ కింగ్స్‌:- ఆగస్ట్‌ 14న కమర్షియల్‌ పేపర్లపై రూ.150 కోట్ల వడ్డీని చెల్లించడంలో విఫలమైంది. 
హీరో మోటోకార్ప్‌:- డిమాండ్‌ తగ్గింపు దృష్ట్యా కంపెనీ తయారీ ప్లాంట్‌ను మూడురోజుల పాటు (ఆగస్ట్‌15 నుంచి 18వరకు) మూసివేస్తున్నట్లు తెలిపింది.
టాక్‌వేర్స్‌ బెటర్‌ వాల్యూ ఫిట్‌నెస్‌, ఓర్‌టెల్‌ కమ్యూనికేషన్‌ కంపెనీలు తమ రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. You may be interested

డాలర్‌ డిమాండ్‌..తగ్గిన రూపీ విలువ

Friday 16th August 2019

బ్యాంకులు, దిగుమతిదారుల కొనుగోలు వలన యుఎస్‌ కరెన్సీకి డిమాండ్‌ పెరగడంతో దేశియ కరెన్సీ రూపీ డాలర్‌ మారకంలో  శుక్రవారం 10 పైసలు బలహీనపడి 71.37 వద్ద ప్రారంభమైంది. దీనితో పాటు పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ గత సెషన్లో 6.58 శాతానికి తగ్గింది. ఇది అంతకుముందు ట్రేడింగ్ సెషన్లో 6.62 శాతంగా ఉండడం గమనార్హం. యుఎస్ రిటైల్ అమ్మకాల పెరగడంతో డాలర్‌ బలపడుతోంది. ఈ రోజు, రూపీ డాలర్‌ మారకంలో 71.10-

పతనాల తర్వాత పెరిగిన చమురు

Friday 16th August 2019

యుఎస్‌ రిటైల్‌ అమ్మకాలు పెరగడంతో, అమెరికా ఆర్థిక మాంద్య ఆందోళనలు కొంత తగ్గాయి. ఫలితంగా వరుసగా రెండు సెషన్‌లలో నష్టపోయిన చమురు ధరలు శుక్రవారం తిరిగి కోలుకున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 0.5 శాతం పెరిగి బ్యారెల్‌ 58.54 డాలర్లకు చేరుకుంది. అదేవిధంగా డబ్యూటీఐ క్రూడ్‌ 0.8 శాతం పెరిగి బ్యారెల్‌ 54.90 డాలర్లకు చేరుకుంది. కాగా గత రెండు సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ 2.1 శాతం, 3 శాతం నష్టపోగా,

Most from this category