News


మంగళవారం వార్తల్లో షేర్లు

Tuesday 20th August 2019
Markets_main1566273640.png-27875

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ‍ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
వోడాఫోన్‌ ఐడియా:-
కంపెనీ ఎండీ, సీఈవోగా రవీందర్‌ థక్కర్‌ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈవ బాధ్యతలు నిర్వర్తిస్తున్న బలేష్‌ శర్మ తిరిగి వోడాఫోన్‌ గ్రూప్‌నకు సేవలు అందించనున్నారరు. 
ఎంఆర్‌పీఎల్‌:- వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో దక్షిణ కన్నడ జిల్లాలోని ఫేజ్‌-III యూనిట్‌లో రీఫైనరీ యూనిట్‌ కార్యకలాపాలు నిలివేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఫేజ్‌-I, ఫేజ్‌-II యూనిట్లు కార్యకలాపాలు యధావిధిగా జరుగుతాయని తెలిపింది.
టాటా మోటర్స్‌ :- కంపెనీ ధీర్ఘకాలిక రేటింగ్‌ని కేర్‌ రేటింగ్‌ సంస్థ ఎఎ నుంచి ఎఎ(-)కు, నెగిటివ్‌ అవుట్‌లుక్‌ను కేటాయించింది. 
ఎల్‌టీ ఫుడ్స్‌:- అంతర్జాతీయ సంస్థలన్నింటి ఏకీకృతం చేసే దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా స్వతంత్ర్య మర్చంట్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో చట్టపరంగా ఆయా సంస్థలు వాటాల బదిలీలకు బోర్డు ఆమోదం తెలిపింది. 
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:- నిధుల కొరత కారణంగా ఎన్‌సీడీ, కమర్షియల్‌ పేపర్లపై చెల్లించాల్సిన రూ.1571 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైనట్లు తెలిపింది.
నేషనల్‌ ఫెర్టిలైజర్‌:- ఇక్రా రేటింగ్‌ సంస్థ ధీర్ఘకాలిక రుణసదుపాయ రేటింగ్‌ను ఎఎకు పెంచింది. అయితే అవుట్‌లుక్‌ మాత్రం స్థిరత్వం నుంచి నెగిటివ్‌కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. 
హెచ్‌ఎఫ్‌సీఎల్‌:- భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌నుంచి రూ.2467 కట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకంఉది. 
ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌:- ఆగస్ట్‌ 19న ఎస్‌డీలపై వడ్డీ చెల్లింపుల్లో విఫలమైంది. 
హిందాల్కో:- ఎల్‌ఐసీ తన వాటాను 8.3శాతం నుంచి 10.4శాతం వాటాకు పెంచుకుంది. 
మహానగర్‌ గ్యాస్‌:- బ్రిటన్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ సంస్థ కోటి ఈక్విటీ షేర్లను విక్రయించింది. 
స్టైర్లింగ్‌ అండ్‌ విల్‌సన్‌ సోలార్‌:- నేడు ఎక్చ్సేంజీల్లో ఐపీఓ షేర్లు లిస్ట్‌ అవనున్నాయి. ఆగస్ట్‌ 06-09 తేదిల్లో ఐపీఓ ఇష్యూకు పూర్తి చేసుకుంది. ఐపీఓకు 92శాతం సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌:- క్రిడెట్‌ శాక్స్‌ షేరు రేటింగ్‌ను నేచురల్‌ నుంచి అండర్‌ఫెర్‌ఫామింగ్‌ కు అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు షేరు కొనుగోలు ధర రూ. 1,028 నుంచి రూ. 1,210 పెంచింది. 
సినిక్‌ ఎక్స్‌పోర్ట్స్‌, తంతియా కన్‌స్ట్రక‌్షన్స్‌, నోవా ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీలు నేడు క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి.You may be interested

ఐటీ షేర్ల ర్యాలీ: లాభాల్లో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌

Tuesday 20th August 2019

దేశియ కరెన్సీ డాలర్‌ మారకంలో బలహీనపడడంతో ఐటీ షేర్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ ఉదయం 9.31 సమయానికి 1.46 శాతం లాభపడి 15,640.95 వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవి వెయిట్‌ షేర్లయిన టీసీఎస్‌ 1.14 శాతం లాభపడి రూ. 2,172.00 వద్ద, , ఒరాకిల్‌ ఫైనాన్షియల్స్‌ 0.87 శాతం లాభపడి రూ. 3,012.00 వద్ద ట్రేడవుతున్నాయి. మిగిలిన షేర్లలో మైండ్‌ ట్రీ 2.38 శాతం, ఇన్ఫోసిస్‌

క్షీణించిన రూపాయి

Tuesday 20th August 2019

చైనా తన కరెన్సీ యువాన్‌ విలువను తగ్గించుకోవడంతో రూపీ డాలర్‌ మారకంలో మంగళవారం 8 పైసలు బలహీనపడి 71.51 వద్ద ప్రారంభమైంది. ఉదయం 9.23 సమయానికి 71.63 వద్ద  రూపీ డాలర్‌ మారకంలో ట్రేడవుతోంది.అం‍తర్జాతీయ ఆర్థిక మందగమన భయాలు, విదేశి నిధుల ఔట్‌ఫ్లో కొనసాగుతుండడంతో రూపీ డాలర్‌ మారకంలో గత సెషన్‌లో 29 పైసలు బలహీనపడి 71.43 వద్ద ముగిసింది. వీటితో పాటు పెరిగిన చమురు ధరలు, డాలర్‌ బలపడడం

Most from this category