News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 21st May 2019
Markets_main1558415227.png-25851

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
అదానీ గ్రీన్‌:-
ప్రమోటర్‌ కంపెనీలు ఒక్కరోజు(మే 21) ఓపెన్‌ ఆఫర్‌ సేల్‌ ఇష్యూను ప్రకటించాయి. ఇష్యూలో భాగంగా అదానీ ట్రేడ్‌లైన్‌, ఎల్‌ఎల్‌పీ, యూనివర్శల్‌ ఎల్‌ఎల్‌పీ, యూనివర్శల్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌లు కంపెనీలు మొత్తం 8.75 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మకానికి పెట్టనున్నాయి. ఇందుకు ప్రతి ఈక్విటీ షేరు ధరను రూ.43లుగా నిర్ణయించాయి.
ఇండోస్టార్‌ క్యాపిటల్‌:- ఎన్‌సీడీల జారీ ద్వారా మొత్తం రూ.10వేల కోట్ల సమీకరణ బోర్డు ఆమోదం తెలిపింది. 
పనేషియా బయోటెక్:- కీమోథెరిపీ చికిత్సలో వినియోగించే అజాసిటిడిన్‌ ఔషధ విక్రయాలను అమెరికాలో విక్రయించేందుకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకుంది.
ఐసీఐసీఐ బ్యాంక్‌:- ఇండియా ఇంటర్నేషల్‌ క్లియరింగ్‌ కార్పోరేషన్‌లో 10శాతం వాటాను కొనుగోలు చేసింది.
గెయిల్‌:- మే 27న జరిగే బోర్డు సమావేశంలో కంపెనీ ఆర్థిక ఫలితాలను విడుదల చేయడంతో పాటు షేర్ల బోనస్‌ ఇష్యూను ప్రకటించనుంది.
ధరమ్‌పూర్‌ షుగర్స్‌ మిల్స్‌:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రతి ఈక్విటీ షేరుపై రూ.3ల తుది డివిడెండ్‌ను ప్రకటించింది.
టాటా మోటర్స్‌:- జేఎల్‌ఆర్‌ కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా సేవలు అందిస్తున్న కెన్‌ జార్జ్‌ జూన్‌ 1న పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపింది. 
8కే మైల్స్‌ సాఫ్ట్‌వేర్‌:- గత ఆర్థిక సంవత్సరపు ఫలితాలను విడుదల గడువును జూన్‌ 30 వరకు పొడిగించమని ఎక్చ్సేంజ్‌లను కోరింది. 
నేడు క్యూ 4 ఫలితాలను ప్రకటించిన కొన్ని ప్రధాన కంపెనీలు:- డీఎల్‌ఎఫ్‌, టెక్‌ మహీంద్రా, ఐఎఫ్‌సీఐ, జేఎస్‌పీఎల్‌, భారత్‌ ఫైనాన్షియల్‌ ​ఇన్‌క్లూజన్‌, బోధల్‌ కెమికల్‌, భాష్‌, కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌, ధనక అగ్రిటెక్‌, జేబీ కెమికల్స్‌, కేఈఐ ఇండస్ట్రీస్‌, ముక్తా ఆర్ట్స్‌, ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌, ఆర్‌ఎస్‌డబ్ల్యూఎం, సోమనీ సిరామిక్స్‌, స్పై మొబిలిటీ, సన్‌ఫ్లాగ్‌ ఐరన్‌, త్రివేణి ఇంజనీరింగ్‌, వీఏ టెక్‌ వాబాగ్‌. You may be interested

ఫలితాలకు ముందే 12200 పాయింట్లకు నిఫ్టీ!

Tuesday 21st May 2019

బ్రోకరేజ్‌ల అంచనా ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితంగా దేశీ మార్కెట్‌ ఒక్కసారిగా పరుగు మొదలెట్టింది. ఒక్కరోజులోనే నిఫ్టీ దాదాపు 4 శాతం లాభపడింది. ప్రస్తుతం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మానసిక అవధి 12వేల పాయింట్లకు నిఫ్టీ కేవలం 120- 150 పాయింట్ల దూరంలో నిలిచింది. ప్రస్తుత ఆప్షన్‌ డేటా చూస్తే ఎన్నికల నిజ ఫలితాలకు ముందే నిఫ్టీ 12వేల పాయింట్లను దాటడమే కాకుండా 12200 పాయింట్ల వరకు దూసుకుపోయే ఛాన్సులున్నాయని నిపుణులు

ప్రారంభంలోనే సూచీల సరికొత్త రికార్డు

Tuesday 21st May 2019

క్రితం రోజు దశాబ్దంలోనే అతిపెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ సూచీలు మంగళవారం సైతం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 97 పాయింట్ల లాభంతో 39,500 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 11,863 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. నిఫ్టీ సూచికి ఇది ఆల్‌టైమ్‌ రికార్డుస్థాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 18న నెలకొల్పిన 11,856 పాయింట్లస్థాయిని తాజాగా నిఫ్టీ అధిగమించింది. క్రితం రోజు జరిగిన పెద్ద ర్యాలీలో

Most from this category