నేటి వార్తల్లోని షేర్లు
By Sakshi

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు
ఇండియన్ హోటల్స్:- ఈఎల్ఈఎల్ హోటల్స్‌లో మిగిలిన 14.3శాతం వాటాను రూ.250 కోట్లకు కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
టాటా పవర్:- గుజరాత్‌లోని దాలోరా పార్క్‌లో 50 మెగావాట్ల పవర్ ప్లాంట్ అభివృద్ధికి బోర్డు ఆమోదం తెలిపింది.
లుపిన్:- జపాన్ కంపెనీ క్యోవా ఫార్మాలోని తన మొత్తం వాటాను ప్లూటస్ సంస్థకు విక్రయించనుంది.
బాల్మెర్ లారె:- 1:2 నిష్పత్తిలో షేర్ల జారీకి బోర్డు ఆమోదం తెలిపింది.
అజంతా ఫార్మా:- ప్రమోటర్ తనఖా పెట్టిన 4లక్షల షేర్లను విడిపించారు.
టీసీఎస్:- వృద్ధి ప్రణాళికలను మరింత సమర్థవంతంగా నడపడానికి ఫోనిక్స్ గ్రూప్ గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని మరింతకాలం పొడిగించినట్లు ప్రకటించింది.
గోద్రేజ్ ఇండస్ట్రీస్:- అన్ సెక్యూర్డ్ ఎన్సీడీలు, బాండ్లు, ఇతర మార్గాల్లో రూ.1500 కోట్ల నిధు సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
పంజాబ్ సింధ్ బ్యాంక్:- కేంద్రానికి ప్రిఫరెన్షియల్ ఇష్యూలో షేర్ల జారీ ద్వారా రూ.787 కోట్ల నిధుల సమీకరణకు షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపారు.
టాటా మోటర్స్ గ్రూప్:- అక్టోబర్‌లో కంపెనీ హోల్స్సేల్స్ అమ్మకాలు 89,108 యూనిట్లుగా నమోదయ్యాయి.
రిలయన్స్ కమ్యూనికేషన్స్:- క్యూ2 ఫలితాలను నవంబర్ 12నుంచి నవంబర్ 15కి వాయిదా వేశారు.
అవంతి ఫీడ్స్:- ఆదాయ పన్ను శాఖ అధికారులు నవంబర్ 7-11 తేదిల్లో కంపెనీ ప్రధాన కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు.
You may be interested
ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు
Wednesday 13th November 2019ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడుతున్నప్పటికీ, భారత్ స్టాక్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభంలో క్రితం ముగింపు 40,347 పాయింట్ల సమీపంలోనూ, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,915 పాయింట్ల సమీపంలోనూ స్వల్ప హెచ్చుతగ్గులకు లోనయ్యాయి.
నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కంపెనీలు
Wednesday 13th November 2019భెల్, కేడిలా హెల్త్‌కేర్, ఏబీబీ ఇండియా, ఐఆర్సీటీసీ, నాల్కో, ఆర్సీఎఫ్, సింటెక్స్ ఇండస్ట్రీస్, థెరాక్స్, బజాజ్ హిందూస్థాన్, న్యూ ఇండియా అస్యూరెన్స్, బ్లూ స్టార్, హుడ్కో, కాఫీ డే ఎంటర్ప్రైజెస్, బాటా ఇండియా, సద్భవన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, అదానీ పవర్, అశోకా బిల్డ్‌కాన్, జాగరణ్ ప్రకాషన్, లెమన్ ట్రీ హోటల్స్, ఎంఫసీస్, బాలజీ టెలీఫిల్మ్స్, పిడిలైట్ ఇండస్ట్రీస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, దీపక్ ఫెర్టిలైజర్స్, ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలు ఈ ఆర్థిక