News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 6th August 2019
Markets_main1565064415.png-27559

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
యస్‌ బ్యాంక్‌:-
మూడీస్‌ రేటింగ్‌ సంస్థ రెండు నెలల్లోనే రెండుసారి హెచ్చరికలు జారీ చేసింది. ఆ‍స్తుల నాణ్యత తగ్గడం, షాడో బ్యాంకులకు భారీగా రుణాలిచ్చి ఉండటంతో బ్యాంక్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసే అంశం ఇంకా పరిశీలనలోనే ఉందంటూ మూడీస్‌ వెల్లడించింది. గతంలో బ్యాంక్‌కు కేటాయించిన ధీర్ఘకాలిక కరెన్సీ ఇష్యూకు ‘‘బీఎ1’’ రేటింగ్‌ను కొనసాగించే రేటింగ్‌ను పరిశీస్తున్నట్లు తెలిపింది. 
బ్రిక్స్‌వర్క్స్‌ రేటింగ్‌ లోయర్‌ టైర్‌ -II బాండ్‌ రేటింగ్‌ను బిడబ్ల్యూఆర్‌ ఎఎ నుంచి బిడబ్ల్యూఆర్‌ ఎఎ(-)కు, అప్పర్‌ టైర్‌ -II బాండ్లు, హైబ్రీడ్‌ టైర్‌-I బాండ్లకు బీడబ్ల్యూఆర్‌ ఎ(+) నుంచి బీడబ్ల్యూఆర్‌ ఎఎ(-)కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. నెగిటివ్‌ అవుట్‌లుక్‌ కొనసాగించింది.
బ్యాంకు ఆఫ్‌ బరోడా:- మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను 15 శాతానికి సవరించింది.
వాబ్కో ఇండియా:- బలహీన డిమాండ్‌, కస్టమర్ల షెడ్యూల్ దృష్ట్యా కంపెనీ తన ఐదు ప్లాంట్లలో కార్యకలాపాలను నిలిపివేసింది.
టాటా మోటర్స్‌:- కంపెనీ ధీర్ఘకాలిక రుణ రేటింగ్‌ను ఎఎ నుంచి ఎఎ(-)కు తగ్గించింది. 
ముత్తూట్‌ ఫైనాన్స్‌:- నిధుల సమీకరణ అంశంపై చర్చించేందుకు కంపెనీ ఆగస్ట్‌ 12న బోర్డు సభ్యులు సమావేశం కానున్నారు. 
కాక్స్ అండ్‌ కింగ్స్‌:- ఆగస్ట్‌ 05న కమర్షియల్‌ పేపర్లపై రూ.5కోట్లు చెల్లించడంలో విఫలమైంది. 
టాటా పవర్‌:- న్యూ ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్‌ సెంట్రల్‌కు  70కేడబ్ల్యూ సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాటుకు  ఆర్డర్లు దక్కించుకుంది.  
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌:- క్లినికల్ ట్రయల్స్‌లో ఎంహైల్త్‌ విస్తరించేందుకు కంపెనీ, ఒరాకిల్ హెల్త్ సైన్సెస్‌తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదర్చుకుంది.
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్స్‌:- నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లపై వడ్డీ చెల్లించడంలో విఫలమైనంది.
జమ్మూ కాశ్మీర్‌ బ్యాంక్‌:- ఇండియా రేటింగ్‌ సంస్థ ఇష్యూ రేటింగ్‌ను ఎఎ నుంచి ఎఎ(-)కు డౌన్‌గ్రేడ్‌ చేసింది.

నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు :- ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, టైటాన్‌ కంపెనీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అరవింద్‌, పెడిలైట్‌ ఇండస్ట్రీస్‌, నీల్‌కమల్‌, మెట్రోపాలీస్‌ హెల్త్‌కేర్‌, మాక్స్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, ఎన్‌ఎల్‌సీ ఇండియా, షీలా ఫామ్‌, ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌, లక్స్‌ ఇండస్ట్రీస్‌, థామస్‌ కుక్‌, సుందరం ఫైనాన్స్‌, ఆర్‌ఈసీ, జెన్సార్‌ టెక్నాలజీస్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, గ్లోబల్‌ ఆఫ్‌షోర్‌ సర్వీసెస్‌, ఇండోవిండ్‌ ఎనర్జీ, శ్రీరాం ఈపీసీ, మిండా ఇండస్ట్రీస్‌, భారత్‌ గేర్స్‌, ఎక్సెల్‌ కార్ప్‌ కేర్‌, శ్రీ రేణుకా షుగర్స్‌, జేకే లక్ష్మీ సిమెంట్స్‌, గుజరాత్‌ స్టేట్‌ ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌, ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌, కేఎం షుగర్‌ మిల్స్‌, డెక్కెన్‌ సిమెంట్స్‌You may be interested

బ్యాంక్‌ నిప్టీ 1శాతం అప్‌

Tuesday 6th August 2019

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఒకశాతం లాభపడింది. నిన్నటి రోజు భారీ పతనం నేపథ్యంలో నేడు మార్కెట్లో కొనుగోళ్లకు మద్దతు లభిస్తుంది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 27,518.50 వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ రికవరీలో భాగంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లు లాభపడుతుడంతో ఈ ఇండెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే దాదాపు 1శాతం వరకు లాభపడి 27928.85 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.

పతనం నుంచి కోలుకుంటున్న రూపీ

Tuesday 6th August 2019

రూపీ డాలర్‌ మారకంలో మంగళవారం 7 పైసలు బలహీనపడి 70.80 వద్ద ప్రారంభమయినప్పటికి, దేశియ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవుతుండడంతో రూపీ డాలర్‌ మారకంలో తిరిగి పుంజుకొంటుంది. ఉదయం 9.45 సమయానికి రూపీ 26 పైసలు బలపడి 70.54 వద్ద ట్రేడవుతోంది. గత ఆరేళ్లలో ఒకే రోజు అత్యధికంగా రూపీ, గత సెషన్లో(అగష్టు 5) 113 పైసలు బలహీనపడి 70.73 వద్ద ముగిసింది. అంతర్జాతీయ వాణిజ్య భయాలు, దేశియ ఈక్విటీ మార్కెట్ల

Most from this category