News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 26th July 2019
Markets_main1564118358.png-27326

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
సుందరం మల్టీక్యాప్‌:-
కేర్‌ రేటింగ్‌ సంస్థ రుణసదుపాయపు సౌకర్యానికి బిబి-(స్థిరత్వం) రేటింగ్‌ను కేటాయించింది
అవెన్యూ సూపర్‌మార్ట్‌:- కంపెనీ రూ.30 కోట్ల కమర్షియల్‌ పేపర్ల ఇష్యూను జారీ చేసింది. 
జేకే అగ్రి జెనిటిక్‌:- కంపెనీ సీఎఫ్‌ఓగా కుమార్‌ గౌతమ్‌వరమ్‌ నియమితులయ్యారు. 
టాటా స్టీల్:- టాటా స్పాంజ్‌ ఐరన్‌లో రైట్స్‌ ఇష్యూ ద్వారా ప్రతి షేరు ధర రూ.500లు చొప్పున మొత్తం 2.6కోట్ల ఈక్విటీ షేర్లను రూ.1292.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ కొనుగోలుతో కంపెనీ కంపెనీ వాటాను 54.5శాతం రూ.75.91శాతానికి పెరిగింది.
బజాజ్‌ హిందూస్థాన్‌ షుగుర్‌:- కేర్‌ రేటింగ్‌ సంస్థ... కంపెనీ ధీర్ఘకాలిక, స్వల్పకాలిక బ్యాంక్‌ రుణ సదుపాయ సౌకర్యాలపై రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. ‘‘డీ’’ రేటింగ్‌ నుంచి ‘‘డీ(కేర్‌)’’ కు పరిమితం చేసింది.
బజాజ్‌ ఫైనాన్స్‌:-  కంపెనీ సీఆర్‌ఓగా శ్రీ ఫకారీ సర్జన్‌ నియమితులయ్యారు. 
పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌:- రైట్స్‌ ఇష్యూ/ఎఫ్‌పీఓ పద్ధతిలో రూ.5000 కోట్ల మూలధన సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది. 
అమర రాజా బ్యాటరీస్‌:- నలంద ఇండియా ఈక్విటీ ఫండ్‌ మేనేజర్‌లో ఈ కంపెనీలో వాటాను 7.3శాతం నుంచి 9.3శాతానికి పెంచుకుంది.
శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌:- ప్రపంచబ్యాంకు విభాగం ఐఎఫ్‌సీ(ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌) 200 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.
టెక్నో ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఇంజనీరింగ్‌:- గ్యాస్‌ సరఫరా వ్యవస్థ రూపకల్పనకు దామోదర్‌ వ్యాలీ కార్పోరేషన్‌ నుంచి రూ.369 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది. 
సెష్పాలిటీ రెస్టారెంట్‌:- లండన్‌ వ్యాపార విస్తరణకు కొరకు హోమేజ్‌ వెంచర్‌తో కలిసి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. 
టీఆర్‌ఎఫ్‌ బోర్డు:- ఇంగ్లాండ్‌ కంపెనీ ఎన్‌స్కో కు తన సింగపూర్‌లో తన అనుబంధ సంస్థలో మొత్తం వాటాను విక్రయించేందుకు బోర్డు ఆమోద తెలిపింది. 
వేదాంత:- ప్రధాన ప్రమోటర్‌ అనిల్‌ అగర్వాల్‌ కంపెనీలో వాటా ఉపసంహరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. 

నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- 
మారుతీ సుజుకీ, బజాజ్‌ అటో, పీఎన్‌బీ, వేదాంత, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, తిలక్‌నగర్‌ ఇండస్ట్రీస్‌, సుప్రీం పెట్రోకెమ్‌, ఉషా మార్టిన్‌, పాలీక్యాబ్‌ ఇండియా, ఏబీబీ ఇండియా, ఓరియంటల్‌ కార్బన్‌, అతుల్‌, కళ్యాణి ఫోర్జ్‌, బజాజ్‌ అమైన్స్‌, రేమ్‌సన్‌ ఇండస్ట్రీస్‌, కాన్ఫీడెన్స్‌ పెట్రోలియం ఇండియా, వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌, పురవంక, జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌, మంగళం డ్రగ్స్‌, మ్యాజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌, టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌, కేపీఐటీ టెక్నాలజీస్‌, ఆర్తి డ్రగ్స్‌, వోడాఫోన్‌ ఐడియా, డీఐసీ ఇండియా, ఇంద్రప్రస్థ మెడికల్‌ కార్పోరేషన్‌, బజాజ్‌ హోల్డింగ్స్‌, మహీంద్రా లైఫ్‌స్పేస్‌ డెవెలపర్స్‌You may be interested

స్వల్పంగా పెరిగిన పసిడి

Friday 26th July 2019

నిన్నటి ట్రేడింగ్‌లో వారం కనిష్టస్థాయికి పతనమైన పసడి ధర శుక్రవారం స్వల్పంగా లాభపడింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన పరిస్థితులు పసిడి బలపడేందుకు మద్దతినిస్తున్నాయి. ఫలితంగా నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో  ఔన్స్‌ పసిడి ధర 3డాలర్లు పెరిగి  1,417.70డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే.., నేటి రాత్రి అమెరికా క్యూ2 జీడీపీ గణాంకాలు వెల్లడి కానున్న నేపథ్యంలో ట్రేడర్ల అప్రమత్తతతో లాభాలు పరిమితమయ్యాయి.  దేశీయంగా స్వల్ప తగ్గింపు:-  దేశీయ ఎంసీఎక్స్‌

69.13 వద్ద రూపీ ప్రారంభం

Friday 26th July 2019

విదేశీ నిధుల ఔట్‌ ఫ్లో కొనసాగుతుండడంతో పాటు అంతర్జాతీయంగా డాలర్‌ బలపడుతుండడంతో రూపీ డాలర్‌ మారకంలో 9 పైసలు బలహీనపడి శుక్రవారం ట్రేడింగ్‌లో 69.13 వద్ద ప్రారంభమైంది. అంతేకాకుండా దేశియ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ఉండడంతో, చమురు ధరలు పెరగడం కూడా రూపీ బలహీనపడడానికి కారణమయ్యాయి. గత సెషన్లో రూపీ డాలర్‌ మారకంలో 6 పైసలు తగ్గి 69.04 వద్ద స్థిరపడింది. విదేశీ సావరిన్ బాండ్లను జారీ చేయాలనే ఆలోచనను

Most from this category